Forest trees అటవీ మొక్కల యొక్క ఏ దశలోనైన లేక అవి ఇతర వృక్షజాతులతో పోటీపడు సందర్భాలలోనైన యాజమాన్య పద్దతులు అత్యధిక ప్రముఖ పాత్ర వహిస్తాయి. Tending అనేది ముఖ్యమైన సిల్వికల్చర్ పద్దతి. ఇది అత్యధిక నాణ్యత గల కలప ఉత్పత్తిలో, ఒక యూనిట్ ఏరియాలో అధిక దిగుబడులను సాధించుటకు ఉపయోగపడును. Tending పద్ధతులు ఈ క్రింది విధాలుగా ఉన్నవి.
నీటి పారుదల (Irrigation of watering): రహదారి మొక్కలు | (Avenue Plantation) యొక్క మంచి పెరుగుదలకు సమయానుకూలముగా నీటిని అందజేయాలి. అటవీ ప్రదేశాలలో మరియు గ్రామీణ వీధులలో అధిక సంఖ్యలో మొక్కలను నాటి వాటి సహజ పెరుగుదల స్థితికి వదలిపెట్టాలి. అటవీ ప్రాంతాలలో సాగునీటిని అరడుగా పెడతారు. ఎందుకంటే ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది.
Weeding:ప్రతి చెట్టు చుట్టూ 1.5 మీ వ్యాసార్థం గల పాదులు తీసి, ఆ పరిధిలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయుట ద్వార కలుపును నివారించవచ్చు. కనీసం నెలకొకసారైన కలుపు తీసుకోవలెను.
సాయిల్ వర్కింగ్ (Soil Working):చెట్టు చుట్టూ మట్టిని వదులు చేయుట ద్వార నేల తేమను ఆవిరైపోకుండ కాపాడుకోవచ్చు. వరి పొట్టు, గడ్డి మొదలగునవి. ( ) నేలపై కప్పుట ద్వార నేల గట్టి పడకుండ చూసుకోవచ్చును.
ఫైర్ ట్రేసింగ్ (Fire Tracing):ఒక చెట్టు చుట్టు 2 మీ వ్యాసంతో అన్ని వైపుల నుండి శుభ్రపరచాలి. అప్పుడు అగ్ని (Forest Fires) నుండి కాపాడుకోవచ్చును. గ్రామీన వీధులల్లో నాటే మొక్కల చుట్టూ 4 మీ పరిధిలో శుభ్రపరచుకోవాలి. తద్వార అగ్ని నుండి మొక్కలను రక్షించవచ్చును.
పింగ్లింగ్ (Singling):ఒక మొక్కలో రెండు లేద అంతకన్న ఎక్కువ పిలకలు ఉన్నప్పుడు, మంచి పిలకను/శాఖను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. అప్పుడు మొక్క ఏపుగాను, త్వరగాను పెరగుతుంది.
Brashing బ్రాషింగ్: రెండు లేద మూడవ సంవత్సరములో చెట్టు కున్న క్రింది భాగములోని కొమ్మలను, రంపము ద్వార తొలగించివేయాలి. ఈ విధముగా చేయుట ద్వార మొక్కలు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి.
క్లైంబర్ కట్టింగ్ (Climber Cuttingp): క్లైంబర్స్ చెట్టు యొక్క కలప నాణ్యతను తగ్గిస్తాయి. ఉదా: బహీనియా.. వాప్తి, బ్యూటియా పారిపోరా వైటీస్, అకేషియా మొదలగునవి తీగను కలిగియుంటాయి