Forest farming మన భారతదేశంలో అడవుల యాజమాన్యానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం 1864 సం. నుండే దృష్టి సాధించినప్పటికి క్రమేన అడవుల విస్తరణ తగ్గుతూ వచ్చింది. వన్య సంపదను సంరక్షించడానికి అనేక చర్యలు చేపట్టారు. ఫన్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియాను 19 అక్టోబర్ 1894 సం.లో ప్రవేశ పెట్టారు. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశాలు:
- రాష్ట్ర అడవుల ఫలములను ప్రజల అవసరాల కోసం కేటాయించుట
- కొండ లోయ ప్రాంతాలలోని అడవుల సంరక్షణ
- నేలను సాగుచేసుకొనుటకు సరైన కారణము, బలమైన డిమాండ్ ఉంటే, అప్పుడు మాత్రమే సందేహింపకుండ కొంత భూభాగాన్ని ఇస్తారు.
- వివిధ వన్య సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవడం ద్వారా తగిన రుసుమును (పైకం) ప్రభుత్వానికి చెల్లించాలి.
స్వాతంత్రం తరువాత భారత ప్రభుత్వ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, 12 మే 1952 సం.లో రెండవ జాతీయ అటవీ పాలసీని ప్రవేశ పెట్టారు. ఈ పాలసీ దేశం యొక్క ఆరు సర్వోఛమైన అవసరాలను దృష్టించి తయారుచేయడం జరిగింది.
- నేలను సంపూర్ణముగాను, సమతలంగాను వినియోగించుకోవడం
- వృక్షాలు లేని స్థలాలలో, నది తీర ప్రాంతాలలో, పనికిరాని నేలలో మృత్తిక క్రమక్షయం గురించి శ్రద్ధ తీసుకోవడం.
- ప్రజల క్షేమం కోసం సాధ్యమైనన్ని ప్రాంతాలలో అటవీ మొక్కలను పెంచటం.
- అటవీ ప్రదేశాలలో వుండే పచ్చికబయలో, పశువులు మేయడానికి అనుమతించిన యెడల ఎరువును సమకూర్చుకోవడం
- అధిక సంవత్సరిక ఆదాయమును సమకూర్చుకోవడం
భారత ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి 7 డిసెంబర్, 1988 సం.లో పార్లమెంటల్ న్యూ నేష్నల్ ఫారెస్ట్ పాలసీని ప్రవేశపెట్టాడు. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశాలు.
- భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 1/3 వంతు భూభాగంలో అడవులను స్థాపించుట వలన బలహీనమైన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవచ్చు.
- నది తీర ప్రాంతాలు, సరస్సులు, రిసర్వాయర్స్, వాలు ప్రదేశాలు ఇసుక తిన్నెలతో కప్పబడకుండ కాపాడాలి.
- వంట చెరకు, ఇందన కలపకు (fuel wood) సంబంధించిన మొక్కలను, పనికిరాని నేలలో పెంచడము.”
- డ్యామ్స్, రిసర్వాయర్లు, మైనింగ్కు సంబంధించిన నిర్మాణాత్మక చర్యలు చేపట్టకుండ నిశేదించడము.
- పశువులు, మేకలు మొదలగు జంతువులు అడవులలో మేయకుండ నిశేదించదము.
Leave Your Comments