మన వ్యవసాయం

రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తి…

0
indian Food Production Economy
indian Food Production Economy

రాను రాను వ్యవసాయంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. రైతే రాజు ఇది అక్షరాలా సత్యం. కరోనా కష్ట కాలంలో రైతే దేశానికి అన్నం పెట్టింది. దీనంతటికి వ్యవసాయమే కారణం. రైతు పొలంలో దిగకపోతే దేశం నాలుగేళ్లు నోట్లోకి వెళ్లవు. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. తాజా గణాంకాలు చూస్తే దేశంలో వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్ధం అవుతుంది.

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ 2020-21 నాటి పంట విస్తీర్ణం మరియు వివిధ ఉద్యాన పంటల ఉత్పత్తిని విడుదల చేసింది, రాష్ట్రాలు మరియు ఇతర ప్రభుత్వ మూలాధార ఏజెన్సీల నుండి అందుకున్న సమాచారం ఆధారంగా వ్యవసాయంపై ఓ నివేదిక విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో ప్రభుత్వ రైతు అనుకూల విధానాలు, రైతుల అవిశ్రాంత కృషి, శాస్త్రవేత్తల పరిశోధన, ఉద్యానవన ఉత్పత్తి కారణంగా కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ ప్రకటన విడుదల చేశారు. 2020-21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 331.05 మిలియన్ టన్నుల ఉత్పత్తిగా అంచనా వేసింది. ఇది 2019-20 కంటే 10.6 మిలియన్ టన్నుల ఎక్కువ.

ఉద్యాన పంటల ఉత్పత్తి 2020-21లో రికార్డు స్థాయిలో 331.05 మిలియన్ టన్నులు కాగా ఇది 2019-20లో సాధించిన దానికంటే దాదాపు 10.6 మిలియన్ టన్నులు పెరిగింది. అదేవిధంగా పండ్ల ఉత్పత్తి 2019-20లో సాధించిన 102.1 మిలియన్ టన్నులతో పోలిస్తే 103.0 మిలియన్ టన్నులుగా నమోదైంది. కూరగాయల ఉత్పత్తి గత సంవత్సరం 188.3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోలిస్తే 197.2 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది, అంటే 4.8% శాతం పెరుగుదల కనిపిస్తుంది. ఉల్లి ఉత్పత్తి 2019-20లో 26.1 మిలియన్ టన్నుల నుండి 26.8 మిలియన్ టన్నులుగా ఎగబాకింది. బంగాళాదుంప ఉత్పత్తి 2020-21లో రికార్డు స్థాయిలో 54.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా…2019-20తో పోలిస్తే ఇది 5.6 మిలియన్ టన్నులు ఎక్కువ. టొమాటో కూడా తన ఉత్పత్తిని పెంచుకుంది. 2019-20లో 20.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగా, 2020-21లో 21.1 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఇక సుగంధ, మరియు ఔషధ పంటలలోనూ మార్పు కనిపిస్తుంది. ప్లాంటేషన్ పంటల ఉత్పత్తి 2019-20లో 16.1 మిలియన్ టన్నుల నుండి 2020-21 నాటికి 16.6 మిలియన్ టన్నులకు పెరిగింది. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 2019-20లో 10.1 మిలియన్ టన్నుల నుండి 2020-21 నాటికి 10.7 మిలియన్ టన్నులకు 5.3% పెరిగింది.


మొత్తానికి రైతులను ప్రోత్సహిస్తేనే ఈ మార్పు మనం చూడొచ్చు. వ్యవసాయం అంటే రైతుల కష్టమో, ఇంకా ఆహార ఉత్పత్తో కాదు వ్యవసాయం అంటే దేశాన్ని ముందుకు నడిపించడం, దేశ అభివృద్ధిలో భాగమవ్వడం. ఆ విషయంలో ప్రధాన మంత్రి మోడీ కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. గుజరాత్ రైతుల జీవితాల్లో పరివర్తన తీసుకురావడం ముఖ్యమంత్రిగా మోదీ పరిపాలనాకాలంలో అతి పెద్ద విజయం. తన విధానాల ద్వారా ఆయన గుజరాత్ రైతులను స్వయం సమృద్ధం, సుసంపన్నం చేశారు. రైతుల సమస్యల పట్ల తనకు గల లోతైన అవగాహన, అందరికీ లాభదాయకమైన పరిష్కారాల సాధన ద్వారా దిగువ శ్రేణి నుంచి ఎగువకు రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలు మోదీ వ్యవహార శైలిలోని ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రైతుల అతి చిన్న అవసరాలపై కూడా ఎంతో ఆసక్తి కలిగి ప్రదర్శించడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రైతులకు స్నేహపూర్వకంగా ఉండేలా చేశారు.

#FoodProduction #EconomicSurvey #Indiafoodproduction #Horticultureproduction #agriculturenews #dailytelugunews #eruvaaka

Leave Your Comments

ఆ రైతులకు అణా పైస చెల్లిస్తాం: బొత్స

Previous article

కొత్త సంస్కరణలతో ముందడుగు…

Next article

You may also like