Seed Treatment with Rhizobium: కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యపు పైర్లకు, వేరుశెనగ, సొయాబీన్ వంటి నూనె గింజల పైర్లకు… బఠాణి, చిక్కుడు, వంటి కూరగాయ పైర్లకు …. ఉలవ, పిల్లి పెసర, బర్సీమ్, వంటి పశుగ్రాసపు పైర్లకు రైజోబియo కల్చర్ ను ఉపయోగించవచ్చు. ఇవి ఎకరాకు 25 కిలోల పైబడి నత్రజనిని స్థిరీకరించగలవు. వాటిని ఉపయోగించినప్పుడు పైర్ల దిగుబడి 25 నుండి 30% పెరుగుతుంది.16 నుంచి 32 కిలోల నత్రజని భూమిలో నిల్వ ఉండి తర్వాత పైర్లకు ఉపయోగపడుతుంది. దీని వాడకం వల్ల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. వేర్లపై బుడిపేలు ఏర్పడతాయి. వీటిలోని రైజోబియం సూక్ష్మ జీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందిస్తాయి. వేర్వేరు పైర్లకు వేర్వేరు రైజోబియo కల్చర్లను వాడాలి.
వాడే విధానం:
ఒక లీటర్ నీటిలో 50 గ్రా. బెల్లం లేదా పంచదార కరగించి 15 నిముషాలు మరగకాచి చల్లార్చాలి. ఈ ద్రావణానికి 200గ్రా. రైజోబియం కల్చర్ ను వేసి బాగా కలిపి జావగా తయారు చేసి , విత్తనానికి పట్టించాలి. విత్తనం పైపొరలకు నష్టం కలుగకుండా చూడాలి. విత్తనాన్ని అరబెట్టి వెంటనే విత్తాలి. రైజోబియం కల్చర్ 200 గ్రా. ప్యాకెట్లలో లభిస్తుంది. ఇది ఒక ఎకరంలో వేయాల్సిన విత్తనానికి పట్టించడానికి సరిపోతుంది. నేలలో తగినంత భాస్వరం లభ్యమైనప్పుడే రైజోబియం కల్చర్ ఉపయోగం సమర్ధవంతంగా ఉంటుంది.
Also Read: Direct Seeding Methods: వరి పంటలో నేరుగా విత్తే పద్ధతులు.!
నాణ్యమైన విత్తనోత్పత్తికి సూచనలు:
వివిధ పంటలలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన, నాణ్యత కలిగిన విత్తనాల ఎంపిక చాలా అవసరం. రైతులు ఎంత మంచి యాజమాన్య పద్ధతులు పాటించినా, నాణ్యమైన విత్తనం ఉపయోగించకపోతే పంటలో ఆశించిన దిగుబడులు సాధించడానికి వీలు కాదు.
ప్రతి సంవత్సరం విత్తనాల కోసం రైతులు ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలపై ఆధారపడవలసి వస్తుంది. అదే విధంగా ముందుగా విత్తనాన్ని సేకరించి జాగ్రత్త పరచడం లేదు. అధిక శాతం వరిలో విత్తనోత్పత్తి జరుగుచున్నది. అధిక శాతం రైతులు మార్కెట్ మీద ఆధారపడం వలన కల్తీ, నాణ్యత లేని విత్తనాలు మార్కెట్లోకి వచ్చి రైతులు నష్టపోతున్నారు. సూటి రకాల విత్తనాన్ని రైతులు ప్రతి సంవత్సరం తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తర్వాత పంటకు కూడా వాడుకోవచ్చు.
నాణ్యమైన విత్తన లక్షణాలు:
- వందశాతం జన్యు శుద్ధత కలిగి ఉండాలి.
- 98 % బాహ్య స్వచ్ఛత కలిగి ఉండాలి. ఇతర కలుపు మొక్కలు లేదా
- విత్తనాలు ఉండకూడదు.
- 75-90 % మొలకెత్తే శక్తీ ఉండాలి.
- ధాన్యపు పంటలలో 10-12 %, అపరాలలో 8-9 % తేమ శాతం.
- చీడపిడలను కలుగ జేసే బీజాలు లేకుండా ఆరోగ్యావంతమైనదిగా ఉండాలి.
- విత్తనోత్పత్తికి ముఖ్య సూచనలు.
- విత్తనాన్ని ఆరోగ్యమైన పంట నుండే సేకరించాలి.
- విత్తనంలో తెగులు సోకి రంగులు మారిన గింజలు, చెత్త , చెదరం , లేకుండా చూసుకోవాలి.
- అధిక మొలక శాతం కలిగి ఉండాలి.
- విత్తన శుద్ధి విధిగా చేయాలి.
- నేరుగా నేలలో విత్తేటప్పుడు నేల తయారీ కలుపు లేకుండా బాగుండాలి.
- బాగా ఎండిన విత్తనాన్ని శుభ్రమైన గోనే సంచులలో పోసి విత్తన గోదాములో జాగ్రత్తపరచి నిల్వ ఉంచాలి.
Also Read: Seed Law: విత్తన చట్టం ఉల్లంఘించిన శిక్షలు తప్పవు.!