ఆహారశుద్దిమన వ్యవసాయం

రబీ ఉలవలు సాగు – యాజమాన్యము

2

ఉలవలు సాగు :  మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.  ఖరీఫ్ లో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏక పంట గాను వేయవచ్చు. రాగి, జొన్న పంటల్లో సహ పంటగాను వేయవచ్చు.

horse gram

horse gram ( ఉలవలు )

పంటకాలం : సెప్టెంబర్ – అక్టోబర్

నేలలు : నల్లరేగడి నేలలు అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు.

రకాలు :

రకం పంటకాలం (రోజుల్లో) దిగుబడి (క్వి /ఎ) లక్షణాలు
పి .డి .యం 105 6 – 6.5 గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి
వి .జడ్ .యం 1 90-95 6-6.5 గింజలు నలుపు రంగులో ఉంటాయి
పి.హెచ్ .జి . 62 85 6-6.5 గింజలు నలుపు రంగులో ఉంటాయి
పి.హెచ్ .జి 9 90-100 6 గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి .పల్లాకు తెగులును తట్టుకుంటుంది

 

Also Read : ప్రపంచ నూనెగింజల విస్తీర్ణం 20 % భారత్ లోన

విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్  మందు చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.

Horse Gram ( ఉలవలు )

Horse Gram ( ఉలవలు )

నేల తయారీ : ఖరీఫ్ లో మొదటి పంటకోసిన తరువాత తగినంత తేమ చూసుకోని, భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని తరువాత చేసుకోవాలి.

విత్తనం , విత్తేదూరం : గొర్రుతో వరుసలతో విత్తే పద్ధతిలో ఎకరాకు 8 – 10 కిలోలు, వెదజల్లే పద్ధతిలో  12 – 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీ.మీటర్ల , మొక్కల మధ్య 10 సెంటి.మీటర్ల దూరం పాటించాలి.

ఎరువులు : ఎకరాకు 4 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి.

అంతరకృషి : విత్తిన 25 – 30 రోజుల మధ్య నెలలో తగినంత తేమ ఉన్నప్పుడు, గొర్రు వేసి కలుపు నివారణ చేసుకోవాలి.

సస్య రక్షణ : కాయతొలుచు పురుగు :పూత మరియు పిందె ఏర్పడే సమయంతో పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలి.

బూడిద తెగులు :వాతావరణంలో అధిక తేమ ఉండి, రాత్రి, పగటి ఉష్ణోగ్రతలలో ఎక్కువగా వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. తెగులు ఉదృతంగా ఉన్న ఎడల 15 రోజుల వ్యవధిలో రెండో సారి కూడా పిచికారి చేసుకోవాలి.

 పి.సౌజన్య , ఎస్ . రమేష్ బాబు, డాక్టర్. కె తేజేశ్వరరావు మరియు డాక్టర్ జి. రామారావు కృషి విజ్ఞాన కేంద్రం ,కుటుంబ విజయనగరం జిల్లా

Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్య

Leave Your Comments

టమోటా ధరలపై సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

Previous article

ఆ కొత్త విమానాశ్రయంతో రైతులకి మేలు…

Next article

You may also like