ఆహారశుద్దిమన వ్యవసాయం

Storage of Grains: ధాన్యం నిలువ సమయంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు.!

0
Storage of Grains
Storage of Grains

Storage of Grains: కోత సమయంలో ధాన్యంలో తేమ సుమారు 24% వరకు ఉంటుంది. అందువలన ధాన్యం నిలువ చేసే ముందు 10–12% ఉండేటట్లు ఎండలో ఆరబెట్టాలి.

Storage of Grains

Storage of Grains

  • నిల్వ ఉన్న పాతధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలుపరాదు.
  • వీలైనంత వరకు క్రొత్త సంచులలో ధాన్యం నిలువ చేయాలి.
  • పాత సంచులను వాడేటప్పుడు పాతధాన్యం క్రిమికీటకాలు లేకుండా వాటిని శుభ్రపరిచి ఎండ బెట్టాలి.
  • ఈ సంచుల మీద 1లీ నీటికి 10మి॥లీ॥ మలాథియాన్ 5మి॥లీ॥ డై క్లోరోవాన్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసి ఆరనిచ్చి ధాన్యాన్ని నిల్వ చేయాలి.
  • ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా తేమలేని పొడి ప్రదేశంలో చెక్క బల్లలమీద నిలువ చేయాలి.
  • 100kg ల ధాన్యానికి kg ల వేపగింజల పొడిని కలిపితే పురుగులు ఆశించవు.
  • కప్పులో పగుళ్ళు లేకుండా చూడాలి.
  • తలుపులకు కాశీలు, రంధ్రాలు లేకుండా చూడాలి.
  • అపరాలను చిక్కగా నేసిన జనపనార సంచులలో గాని లేదా పాలిథీన్ అమర్చిన సంచులలో గాని, నైలాన్ సంచులలోగాని నిల్వచేయాలి.
  • ఒక లీటరు నీటిలో 10మి॥లీ॥ మలాథియాన్ కలిపిన ద్రావణాన్ని ప్రతీ 100 చ॥మీ॥ 3॥ వంతున గోదాములలో ధాన్యం నిలువ చేసేముందు పిచికారి చేయాలి.

Also Read: Weed Management in Direct Seeded Paddy: నేరుగా విత్తిన వరి పొలంలో కలుపు యాజమాన్యం.!

నివారణ చర్యలు:

  • విషవాయువుతో గోదాములను నింపి పురుగు నివారణ చర్యలు తీసుకోవాలి.
  • గోదాములలో నిల్వ చేసిన ధాన్యం రక్షణకు టన్నుకు 3gr ఉండే అల్యూమినియం ఫాస్పైడ్ బిళ్ళలను 1 లేదా 2 ఉపయోగించాలి.
  • ఇథిలిన్ బ్రోమైడ్ ఒక క్వింటాళ్ళు ధాన్యానికి 5ml,1 క్వింటాలు అవరాలకు 3mil ఉపయోగించి గాలి వెలుపలికి పోకుండా 7 రోజుల వరకు జాగ్రత్త పడాలి.

విషవాయువులు ఉపయోగించినపుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు:

  • విష వాయువులను నూనెగింజల రక్షణకు ఉపయోగించరాదు.
  • విష వాయువులను నింపడానికి ముందుగా నల్లటి పాలిథిన్ పేపరు బస్తాలమీద పరచడానికి అనువుగా బిళ్ళలను వీలైనంత త్వరగా బస్తాల మధ్య అమర్చి వెంటనే నల్లని పాలిథిన్ పేపర్ ను కప్పాలి.
  • దాని అంచుల వెంట ఇసుకగాని, మట్టి గాని పోసి విషవాయువు లోపల నుండి వెలుపలికి రాకుండా చేయాలి.
  • గోదాములను విషవాయువు ప్రయోగించే ముందుగా కిటికీలను, వెంటలేటర్లను మూసి పేపర్ అంటించి గాలి వెలుపలికి పోకుండాచేయాలి. తేమ నేల నుండి బస్తాలను సోకకుండా ఉండడానికి బస్తాలను దీర్ఘచతురస్రాకారపు చెక్కలు పైన ఉంచాలి.

సాధారణ పద్ధతి: ఈ పద్ధతిలో బస్తాలను పొడవుగా ఒకదానికొకటి ఉంచి అదే విధంగా పై వరుసలలో కూడా అమర్చవలెను. ఈ పద్ధతిని వర్లకు గాని, జొన్నలకు గాని ఉపయోగిస్తారు. దీనిలో 14 వరుసల కన్నా ఎక్కువ ఉంచుటకు

వంకర టింకర పద్ధతి: బస్తాలను ఒక పద్ధతి ప్రకారం ఒక వరుసలో పొడవు వైపు 2వ వరుసులో వెడల్పు వైపు 3వ వరుసలో తిరిగి పొడవు వైపు 4వ వరుసలో వెడల్పువైపు అమర్చవలెను. ఇది మంచి పద్ధతి బస్తాలు పడకుండా ఉందును.

బ్లాక్ పద్ధతి: ఈ పద్ధతిలో ప్రతి వరుసలో ఒక బస్తా పొడపు వైపు 2వ బస్తా వెడల్పు వైపు అమర్చాలి. ప్రతి భాగంలో ఒక బస్తా పొడవు వైపు 2 బస్తాలు వెడల్పు వైపు ఉండును. ఈ పద్ధతిలో బస్తాలు లెక్కించుట సులభం.

Also Read: Paddy Cultivation: వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.!

Leave Your Comments

Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!

Previous article

Vana Mahotsavam: వన మహోత్సవం ఎలా జరుపుతారు.!

Next article

You may also like