ఆహారశుద్దిమన వ్యవసాయం

Insect Pests of Stored Grain: బియ్యం ముక్కు మరియు గింజ తొలుచు పురుగు లక్షణాలను ఇలా గుర్తించండి.!

0
Insect Pests of Stored Grain
Insect Pests of Stored Grain

Insect Pests of Stored Grain: నిల్వచేసిన పంట ఉత్పత్తులను అనేక జీవరాశులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. వాటిలో పురుగులు, నల్లులు, బూజు తెగుళ్ళు ముఖ్యమైనవి. నిల్వచేసిన పంట ఉత్పత్తులలో 10-20% వరకు జీవరాశులు వలన నష్టం జరుగుతూ ఉంది.

Insect Pests of Stored Grain

Insect Pests of Stored Grain

Also Read: Late planting in rice: వరిలో ఆలస్యంగా నాట్లు వేయటానికి కావాల్సిన మొలకల వయస్సు

బియ్యం ముక్కు పురుగు:

గుర్తింపు చిహ్నాలు (MOI):

పెంకు పురుగు 3-3.5 మి॥మీ॥ పొడవు ఉండును. ఎరుపు గోధుమ వర్ణంలో ఉండును.
తల ముందు భాగాన పొడవాటి గట్టి ముక్కు ఉండును.
ముందుజత రెక్కలపైన నాలుగు పసుపు పచ్చని మచ్చలు ఉండును.
లద్దెపురుగు తెల్లగాను తల పసుపు రంగులో ఉండును. కాళ్ళు ఉండవు.

గాయపర్చు విధానం & గాయం లక్షణాలు:

పెంకు పురుగు, లద్దెపురుగు రెండూ కూడా బియ్యం, గోధుమ, జొన్న, మొక్కజొన్న బార్లి గింజలను ఆశించి నష్టం కలుగజేయును. పెంకుపురుగు ఎగర గలదు. అందువలన గింజలు నిల్వచేయకముందే పైరు కోయుటకు ముందే కంకుల మీద గింజల మీద గ్రుడ్లు పెట్టును. ఆ గ్రుడ్లనుండి వెలువడిన లద్దెపురుగులు గింజలోపలికి ప్రవేశించి నష్టం కలుగజేయును. పురుగు ఆశించిన గింజలమీద వంకరటింకర రంధ్రాలు ఏర్పడును.

జీవిత చక్రం:

పెంకు పురుగు గింజలపై గ్రుడ్లను పెట్టి జిగటలాంటి పదార్ధంతో కప్పును.
ఒక తల్లి పురుగు 400 గ్రుడ్ల వరకు పెట్టగలదు. అవి 6-7 రోజులలో పొదిగి లద్దెపురుగులు బయటికి వచ్చును.
లద్దెపురుగు గింజలోపల ప్రవేశించి లోపల పదార్ధములను తిని డొల్లగా మార్చును. అవి 16-20 రోజులలో పెంకు పురుగులు గింజలోపల రంధ్రం ఏర్పరిచి వెలుపలికి వచ్చును. పెంకుపురుగులు 4-5 నెలలు నివసించగలవు.

గింజ తొలుచు చిన్న పురుగు లేదా నుసిపురుగు:

రైజోపెర్తా డోమినికా:

గుర్తింపు చిహ్నాలు (MOI):

పెంకు పురుగులు సన్నగా గొట్టం ఆకారంలో ఉండును.
శరీరం గరుకుగా ఉండి ముదురు గోధుమరంగులో ఉండును.
తల ఉరం క్రింది భాగంలో వంగి ఉండును.

గాయపర్చు విధానం మరియు గాయ లక్షణాలు:

లద్దెపురుగు గోధుమరంగు తల కలిగి కాళ్ళు లేకుండా ఉండును. పెంకుపురుగులు, లద్దెపురుగులు గోధుమ, వడ్లు, I జొన్న గింజలను ఆశించి లోపల పూర్తిగా డొల్లగా మార్చును. అవి తిన్న దాని కన్నా గింజలను ఎక్కువగా పిండిగా మార్చును.

ఇవి ఆశించిన గింజలపై అనేక వంకరటింకర రంధ్రాలు ఉండును.

జీవిత చక్రం:

పెంకు పురుగులు గ్రుడ్లను ఒంటరిగా కాని, సముదాయంగా గాని గింజలపై పెట్టును.
ఒక్కొక్క తల్లిపురుగు 300-400 గ్రుడ్లను పెట్టును. అవి 5-9 రోజులు పొదుగును.
లద్దెపురుగు తొలిదశలో పెంకుపురుగులు తినేటప్పుడు ఏర్పడిన పిండితిని జీవించును.
తర్వాత గాయపడిన గింజలలోకి ప్రవేశించును. 44 రోజులలో పెరిగి గింజలోపల కోశస్థదశలో ప్రవేశించును.
7-8 రోజులలో కోశస్థదశ నుండి పెంకు పురుగులు వెలువడును.

Also Read: Rice nursery : అధిక వర్షాలకు రైతులు వరి నారుమళ్ల లో పాటించాల్సిన జాగ్రత్తలు

Leave Your Comments

Bamboo Cultivation Techniques: వెదురు సాగులో మెళుకువలు.!

Previous article

Nutrient Management in Tobacco: పొగాకు పంటలో ఎరువుల యాజమాన్యం.!

Next article

You may also like