ఆహారశుద్దిమన వ్యవసాయం

వెదురు పిలకల కూర అద్భుతం

0
veduru

అరటి దూటనో, పువ్వునో కూర వండటం తెలుసుగానీ వెదురు పిలకలేంటి అని అనిపించడం సహజం. ఈ మధ్య మార్కెట్లో, రోడ్డు పక్కన లేతాకుపచ్చ రంగులో కోన్ ఆకారంలో ఉండే కాడల్లాంటివి కనిపిస్తున్నాయి. అవి పోషకాల నిధులని తెలియడంతో వాటికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడిందని టాక్. ఇది కొత్త తిండి కాదు, పూర్వం నుంచి ఉంది నిట్టనిలువుగా ఆకాశంలోకి పెరిగే వెదురులో అనేక జాతులు ఉన్నాయి. వాటిల్లో బ్యాంబుసావల్గారిస్, పైలోస్టాకిన్ ఎడ్యులిస్ వంటి జాతుల్ని మాత్రం అచ్చంగా పిలక మొక్కల కోసమే పెంచుతారట. ఆగ్నేయాసియా దేశాల్లోనూ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పిలకలతో కూరలు, సూప్ లు ,తయారుచేస్తారు. అందుకే వీటిని తాజాగానే కాదు, ప్రొపేన్ చేసి, ఎండబెట్టి,కేన్ డ్ ఫుడ్ గాను అమ్ముతుంటారు. పిండి పదార్ధాలు, ప్రోటీన్లు, పీచుతో పాటు కాపర్, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మూలకాలు, రిబోప్లేవిన్, విటమిన్ – ఎ, కె ,ఇ బి6 మొదలైన విటమిన్లు ఈ వెదురు పిలకల్లో పుష్కలంగా ఉంటాయి. ఇంకా పైటోస్టేరాల్సా, పైటోన్యూట్రియంట్లు, పీచువల్ల కొలస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా మెరుగవుతుందట. ఆరోగ్యంగా ఉన్న మహిళలు వరుసగా ఆరు రోజులపాటు వీటిని తిన్నప్పుడు వాళ్ళలో చెడు కొలస్ట్రాల్ తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. కప్పు వెదురు పిలకల్లో రెండు గ్రాముల పీచు లభిస్తుంది. ఇది రక్తంలో కొలస్ట్రాల్ కేన్సర్ ను సైతం తగ్గిస్తుంది. పొట్టలోని బాక్తీరియాకి ఆహారంగా ఉపయోగపడుతుంది. తద్వారా మధుమేహం, డిప్రెషన్ ఉభకాయం తగ్గడానికి దోహదపడుతుంది. ఈ కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువుని తగ్గిస్తాయి. పొట్ట కూడా తగ్గినట్లు అనేక అధ్యయనాల వల్ల తెలుస్తోంది. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ ముఖ్యంగా నాడీ సంభంద వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. వీటిని నీళ్ళలో మరిగించి తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంభంద వ్యాధులు ఉండవట. నొప్పులు తగ్గడానికి, పిట్ట సమస్యల్ని నివారించడానికి ఈ వెదురు పిలకలు తోడ్పడతాయని మరికొన్ని పరిశీలన వల్ల తేలింది. వీటిలో ఎక్కువగా ఉండే పొటాషియం వల్ల బిపి రోగులకు మంచి ఉపయోగం ఉంటుందట. గర్భీణిలకు తొమ్మిదో నెలలో వీటిని తినిపించడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని చైనా సంప్రదాయ వైద్యం పేర్కొంటుంది. వెదురు పిలకల్లో కర్ర పెండంలో మాదిరిగానే కొన్ని రకాల టాక్సిన్లు ఉంటాయి. ఉడికించినప్పుడు ఇవి తొలిగిపోతాయి. అందుకే తాజాగా వెదురు పిలకల్ని శుభ్రంగా చేసి పావుగంట సేపు పసుపులో ఉడికించాకే కూరల్లో వేస్తుంటారు. పులియబెట్టి బంగాళాదుంపలు, బీన్స్ తో కలిపి వండుతారంట. దక్షిణాదిన కర్ణాటక, ఆంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో వీటితో ప్రత్యేక వంటకాలు చేస్తారు. తెలుగులో ఈ పిలకలని వెదురు కొమ్మలు అంటారు. కొందరు వీటిని రెండు మూడు రోజుల పాటు నీళ్ళలో నానబెట్టి ఆ తరువాత పచ్చడి చేస్తారు. కొన్ని చోట్ల అనేక నెలల పాటు పులియబెట్టి వాడుకుంటారని తెలుస్తోంది. మణిపూర్ లోని అండ్రో గ్రామంలో ఇలా పులియబెట్టిన వెదురు పిలకల్ని కొన్ని ఏళ్ళ పాటు నిలువ చేసుకుంటారు.

 

Also Read : రోబో రైతులు…

 

 

 

Leave Your Comments

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది – PJTSAU ఉపకులపతి ప్రవీణ్ రావు

Previous article

అరేబియా సముద్రంలో మ‌త్య్స‌కారులు గల్లంతు

Next article

You may also like