Flue Curing in Tobacco: సిగరెట్ పొగాకు ఫ్లూ క్యూరింగ్ చేస్తారు. కోసిన ఆకులను నీడలోకి తీసుకుపోయి వాటి పరిమాణాన్ని బట్టి సుమారు 1.5 మీటర్ల పొడవు, 2-26 సెంటీమీటర్ల వ్యాసం వున్న వెదురు కర్రల మీద ఆకులు వృంతాలు పై వైపున ఉండేట్లు ఆకులు ఒకదాని వెనుకవైపు ఒంకోదాని వెనుక వైపుకు ఆనుకుని ఉండేట్లు 2,3 ఆకులు గల కట్టలుగా గుచ్చుతారు. ఒక్కొక్క కర్రకు 90-105 ఆకులుంటాయి.
Also Read: Home Remedies: ఇంటి వైద్యం- వంటింటి ఔషధాలు.!
సుమారు 700 కర్రలను 16’x16’x16′ బేరన్లో 810 లను 24’x16’x10 బేరెన్లో గానీ ఉంచుతారు. గుచ్చే ముందు ఆకులను పసుపు పచ్చని, ఎక్కువగా పక్వం అయిన లేక ఆకుపచ్చని పక్వమయి, ఆపక్వతీణులుగా శణీకరించడం మంచిది. అదే రోజు సాయంత్రం లోగా ఆకులు బారన్ లోకి ఎక్కిస్తారు. అపక్వ ఆకులుపై అంతస్థులలోనూ మలి పక్వమైన ఆకులను కింది అంతస్తులలోను, మిగిలిన వాటిని కేంద్ర భాగంలోనూ ఉంచుతారు. బారన్లను వేడి చేయడానికి ఉపయోగించే ఇంధనాలు బొగ్గు, కర్ర లేదా వరి పొట్టు మొదలగునవి ఉష్ణోగ్రతను గంటకు 1-2°C ఫారన్ హీట్ మించకుండా పెంచుతారు. ఆకు పసుపుగా మారే సమయానికి ఉష్ణోగ్రత 105° ఫారన్హీట్ కు చేరుకుంటుంది.
ఉష్ణోగ్రత 105° ఫారన్ హీట్ చేరుకునే సమయానికి పసుపుగా మారటం దాదాపు పూర్తయ్యేట్లు ఉష్ణోగ్రత. వుంచుతారు. ఆకు పసుపుగా మారటం దాదాపు పూర్తయ్యేట్లు ఉష్ణోగ్రత పెంచుతారు. బారన్ పైన వెంటిలేటర్ను చాలా కొద్దిగా తెరచి పెంచుతారు. ప్రత్యేకించి చల్లని రాత్రులలో క్రింది వెంటిలేటర్ను కొద్దిగా ఖాళీలతో తెరచి ఉంచుతారు. పసుపుగా మారిన తర్వాత పదును చేసే ప్రక్రియలు రంగు నిలవడం, ఆకు, కాండం ఎండడం ఈ పదును చేసి ప్రక్రియలన్నీ పూర్తికావడానికి క్రమంగా కావల్సిన మొత్తం కాలం 83-94 గంటలు, పసుపు కావడానికి కావల్సిన ఉష్ణోగ్రత 85-105° ఫారన్ హీట్. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పట్టే కాలం 30-40 గంటలు రంగు స్థాయీకరించడానికి 110-125 ° ఫారన్ హీట్ ఉంచుతారు. 5-10 గంటలలో రంగు పూర్తవుతుంది.
రంగు స్థాయీకరించే సమయంలో బేరవ్కింద వెంటిలేటర్లు. పాక్షికంగా తెరుస్తారు. తరువాత ఆకు ఎండటానికి 20-27 గంటలు సీపు 125-130° ఫారన్హీట్ ఉష్ణోగ్రత ఉండడం ఆవశ్యకం. ఆకు ఎండే చివరిదశలో 160° ఫారన్హీట్ ఉష్ణోగ్రతను 16-17 గంటల సేపు ఉంచుతారు. పదును చెయ్యడం అయ్యాక మంట ఆర్పివేస్తారు. వెంటిలేటర్లు మూసి ఉంచి బారన్లు చల్లబడనీయాలి. ఫ్లూ క్యూరింగ్ సమయంలో ఆకులోని తేమ అంశంలో అధిక భాగం ఆకుపచ్చని ఆకులో ఉండే దానిలో 77-80% పోతుంది. మొదట్లో ఉండే పొడి పదార్ధంలో 12-16% కూడా పోతుంది. వెంటిలేటర్ తెరచి ఆకు నిర్వహణకు సరైన పరిస్థితికి తీసుకురావాలి. తరువాత కర్రలను బారన్ నుంచి తీసేసి, ఆకులను కలిపి కర్రలతో పాటు గుట్టలుగా పోస్తారు. కలిపిన ఆకులను మళ్ళీ ఎండబెట్టి కిణ్వన ప్రక్రియకు ఉంచుతారు. ఆ తరువాత నిర్దేశించిన రంగు, ఇతర నాణ్యత అభిలక్షణాల ప్రకారం శ్రేణి చేయబడును.
Also Read: Insect Pests in Leafy Greens: వివిధ ఆకుకూరల్లో తెగుళ్ల సమస్యలు -నివారణ