మత్స్య పరిశ్రమమన వ్యవసాయం

మత్స్యకార రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను వినియోగించుకోవాలి

0
Fishery farmers credit cards : వరంగల్ లోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ మత్స్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, అధిపతి డా.ఎన్ రాజన్న మాట్లాడుతూ  1957  సంవత్సరం జులై 10 వ తేదీన డా. హీరాలాల్ చౌదరి, డా.అలీకుణ్ణి మొదటిసారి ప్రేరేపిత పద్ధతిలో కార్పు చేపల నుంచి చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. అప్పటినుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జులై 10 వ తేదీని మత్స్య రైతులు, మత్స్య శాస్త్రవేత్తలు, ఆక్వా డీలర్ లను ఉత్సాహపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్నివినియోగించుకొని లబ్ధిపొందాలని రైతులకు సూచించారు. అదేవిధంగా వ్యవసాయ రైతుల వలె మత్సకార రైతులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను వినియోగించుకొని ఇన్సూరెన్స్, రుణ సదుపాయాల వంటి సౌకర్యాలను పొందాలని మత్స్యకార రైతులకు సూచించారు.
కృషి విజ్ఞాన కేంద్రం మత్సశాస్త్రవేత్త డా. జి. గణేష్ మాట్లాడుతూ మత్స్యకార రైతులు చేపల పెంపకంలో అమలవుతున్న ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన బయోఫ్లాక్, రీసర్కులేటర్ ఆక్వా కల్చర్ ,కేజ్ కల్చర్, సమీకృత చేపల పెంపకం వంటి పద్ధతులలో చేపలను పెంచి అధిక లాభాలు పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాస్త్రవేత్త డా. జె. శశాంక్, డా. అరుంజ్యోతి, గృహ విజ్ఞాన శాస్త్ర వేత్త, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు సూరయ్య,యాకయ్య, రైతులు పాల్గొన్నారు
Leave Your Comments

“ఏపీసీఎన్ఎఫ్(APCNF)” కు ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు

Previous article

45 రోజుల్లో రెండు ఎకరాల్లో 1.52 లక్షల నికర ఆదాయం …

Next article

You may also like