మత్స్య పరిశ్రమ

Fish Farming: చేపపిల్లల (ఫ్రై, ఫింగర్‌లింగ్స్‌) పెంపకంతో అధిక లాభాలు.!

0
Rearing Fish
Rearing Fish

Fish Farming:  చేప జాతి పిల్లలు, కావలసిన సమయంలో,కావలసిన పరిమాణంలో దొరకడం అనేది చేపల పెంపకంలో ఒక కీలకాంశం. గత కొన్ని సంవత్సరాలుగా, కార్ప్‌ చేపల నర్సరీ విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరత ఉంది. చేప గుడ్లు పొదిగి, పిల్లలై కేవలం 72-96 గంటల వయసులో అప్పుడప్పుడే ఆహారం తీసుకోవడానికి అలవాటుపడే, (స్పాన్‌) దశనుంచి, 15-20 రోజుల వయసు వచ్చేంత వరకు అంటే 25-30 మి.మీ.సైజు వచ్చే వరకు (ఫ్రై దశ) నర్సరీలలో పెంచుతారు. ఆ తర్వాత ఈ ఫ్రైలను, దాదాపు 100 మి.మీ. సైజుకు (ఫింగర్‌లింగ్స్‌ దశ) ఎదిగేంత వరకు మరో చెరువులో పెంచుతారు.

Rearing Fish

Fish Farming

చెరువుల రకాలు : మంచి నీటి చేప క్షేత్రంలో ఉండే చెరువులు 3 రకాలు, పెంచే దశను బట్టి వీటిని నర్సరీ, రేరింగ్‌ పాండ్‌, స్టాకింగ్‌ (గ్రో అవుట్‌) పాండ్‌గా పిలుస్తారు.
ఉదాహరణకు :  10 ఎకరాల విస్తీర్ణం కల్గిన మత్స్య క్షేత్రంములో ఆయా రకములైన చెరువులకు క్రింది విధముగా కేటాయింపులను చేసుకోవాలి.
నర్సరీలు అర ఎకరము
రేరింగ్‌ పాండ్స్‌ 2 ఎకరములు
స్టాకింగ్‌ పాండ్స్‌ 7 1/2  ఎకరములు

ప్రీ స్టాకింగ్‌ యాజమాన్య పద్ధతి :
దీనిలో చేప పిల్లల పెంపకం జూన్‌ నెల నుండి సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెల వరకు సాగుతుంది. దీని యందు చెరువు తయారీ అతి ముఖ్యమైనది. చెరువు తయారీ నందు చెరువు ఎండబెట్టడం, దున్నడం, సున్నం చల్లడం, నీరు పెట్టడం, ఎరువులు వాడడం అనే దశలుంటాయి.

Types of Rearing Ponds

Types of Rearing Ponds

కలుపు మొక్కలు / నీటి మొక్కలు తొలగించుట:
వీటిని మనుషులు లేక యాంత్రిక లేక రసాయన పద్ధతుల (గ్లైకో ఫాస్ఫేట్‌ 3 కిలో/హెక్టారుకు) ద్వారా నివారించుకోవాలి, గడ్డి చేపలను హెక్టారుకి (100-200) పెంచుట ద్వారా చాలా రకాలైన కలుపు మొక్కలను జీవపరంగా నివారించవచ్చును.

Also Read: Salt Water Fish Farming: ఉప్పు నీటిలో చేపల పెంపంకం.!

నర్సరీ కుంటలను ఎండబెట్టడం : అడుగు భాగం బాగా బీటలు వారునట్లు ఎండబెట్టాలి. ఫలితంగా వ్యాధికారక క్రిములు, పరాన్న జీవుల వివిధ దశలు నశిస్తాయి. మట్టి కుంటల అడుగు భాగమును బాగా దున్నించాలి ఫలితంగా భూమిలో విష వాయువులు గాలిలో కలిసిపోతాయి. భూమిలో నత్రజని స్థిరీకరించబడుతుంది. ఫలితంగా నేల సారం పెరిగి సహజ ఆహరం/ ప్లవకాలు వృద్ధికి దోహదపడుతుంది.
సున్నం వాడకం : సున్నం వాడకం వలన నేలలో నిక్షిప్తమై యున్న పోషకాలు విడుదలవుతాయి. కుంట నేలలో ఉన్న వ్యాధి కారక క్రిములు నశిస్తాయి. నేల పి.హెచ్‌ ని సమస్థితిలో ఉంచుతుంది. సున్నంనుండి స్పాను పెరుగుదలకు అవసరమైన కాల్షియం అందుతుంది.సాధారణ పరిస్థితులలో ప్రతినెల హెక్టారుకు  250 కిలోల సున్నం చల్లడం అన్ని విధాలా మంచిది.
నీరు పెట్టుట : నర్సరీలకు నీరు పెట్టునప్పుడు 80,100 మైక్రాన్‌ మెష్‌ గల రెండు పొరల సంచులలో వడకట్టి పెట్టాలి. నర్సరీ కుంటలతో మొదట నీరు 2 అడుగుల మేర పెట్టాలి.

Waters ranging in pH from 6.5 to 8.5 (at sunrise)

Waters ranging in pH from 6.5 to 8.5 (at sunrise)

మెన్యూరింగ్‌ : స్టాకింగ్‌ మూడు రోజుల ముందు మెన్యూరింగ్‌ చేసుకోవాలి. హెక్టారునకు 1000 – 2500 కిలోల పశువుల పేడను వివిధ దఫాలలో వాడాలి. సాధారణంగా సేంద్రియ ఎరువులైన పేడ, కోడి పెంట, రసాయనిక ఎరువులైన సూపర్‌ ఫాస్పేట్‌ / యూరియా వాడాలి.
ఎరువు రకము   మోతాదు (ఎకరంనకు)
పేడ 600-800 కేజీలు
కోళ్ల పెంట 500-600 కేజీలు
వేరుశెనగ చెక్క 30-45 కేజీలు
సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ / యూరియా 30-40 కేజీలు
దీని వలన చేప పిల్లలకు కావలసిన సహజ ఆహారం (ప్లాంక్జాన్‌) ఉత్పతైన నీటి రంగు గోధుమ రంగులోకి గాని, ఆకుపచ్చ రంగులోని గాని మారుతుంది.
స్టాకింగ్‌ యజమాన్యత పద్ధతి :
– స్పాను స్టాకు చేయునపుడు నర్సరీ లోతు (2 అడుగులు ) తక్కువగా ఉండాలి.
– 5-8 మి. మీ సైజు గల స్పాను ను ఎకరానికి 20-50 లక్షల వరకు వదులుకోవచ్చును.
– ఒకే రకము / జాతికి చెందిన స్పానును మాత్రమే ఒక నర్సరీలో వేసి పెంచాలి.
స్పాను స్టాకు చేయు సమయం : స్పానుని చల్లని వేళలో ఉదయం గాని, సాయంకాలం గాని స్టాకు చేయాలి. మబ్బులు ఉన్నపుడు, ఎండగా ఉన్నప్పుడు స్టాక్‌ చేయరాదు.
స్పాను స్టాక్‌ చేయు విధానము :
– నర్సరీ నీటికి అలవాటు చేయుట (ఎక్లిమటైజేషన్‌ )
-స్పాను గల పాలిథీన్‌ బ్యాగులను నర్సరీ నీటిపై ఒక అరగంట ఉంచిన నర్సరీ నీటి ఉష్ణోగ్రత స్పాను గల బ్యాగు నీటి ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది.
– స్పాను బ్యాగులను తెరచి నర్సరీ నీటిని కొద్ది కొద్దిగా స్పాను బ్యాగుకు కలిపిన పిదప క్రమంగా స్పాను బ్యాగు నీటి నుండి స్పాను నర్సరీ నీటిలోకి ప్రవేశిస్తుంది.
పోస్ట్‌ స్టాకింగ్‌ యాజమాన్య పద్ధతి –
అదనపు ఆహారం : ప్లవకాల సాంద్రత ను బట్టి స్పాను స్టాక్‌ చేసిన 2 లేదా 3 వ రోజు నుండి అదనపు ఆహారంగా వేరుశెనగ చెక్క, పచ్చి తవుడు 1:1 నిష్పత్తి లో నర్సరీ నీటిపై చల్లాలి.
మేత ప్రణాళిక : మొదటి వారం శరీర బరువుకు సమానంగాను, రెండవ వారం మొదటి వారంకు రెట్టింపు మేత మరియు మూడవ వారం రెండవ వారం కు రెట్టింపు ఇవ్వాలి. మేతను రెండు సమ భాగాలుగా చేసి రోజులో రెండు దఫాలుగా ఇవ్వాలి. ప్రతి రోజు మేతను ఒక నిర్దిష్ట సమయంలో ఇవ్వాలి. 8వ రోజు నుండి 21 లేదా 28 రోజు వరకు మేతను పొడి రూపంలో వేరుశెనగ చెక్క, తవుడు ఇవ్వాలి. మబ్బులుగా ఉన్నప్పుడు, చిరుజల్లులు పడుతున్నప్పుడు మేతలు ఆపేయాలి .

Fish Rearing Pond Construction

Fish Rearing Pond Construction

నర్సరీ నీటి యాజమాన్యంలో రైతులు తీసుకొనవలసిన జాగ్రత్తలు :
-నర్సరీ నీరు లేత ఆకుపచ్చగా ఉండే విధంగా ఎరువులు వాడాలి.
– నీరు ముదురు ఆకుపచ్చగా ఉంటె నీటి మార్పిడి చేయాలి.
– ప్రతి రోజు నర్సరీ కి క్రొత్త నీరు పెట్టడం అన్ని విధాలా మంచిది.
-మేతలను తగిన పరిణామం లో వాడుకోవాలి. నీటి పి. హెచ్‌ మార్పులు అధికంగా ఉంటే నీటి మార్పిడి చేయాలి. నర్సరీ నీటి పారదర్శకతను సెచ్చి డిస్క్‌లో ప్రతి 5 లేదా 6 రోజులకు ఒకసారి పరిశీలించాలి.                                                                – దీని రీడిరగ్‌ 25-35 సెం. మీ ఉండాలి.
నమూనా సేకరణ ఆరోగ్య పరీక్షలు : క్రమం తప్పకుండా నర్సరీ నుండి చేప పిల్లలను సేకరించి ఆరోగ్య పరిశీలన చేయాలి. చేప పిల్లల శరీరం పొలుసులు, రెక్కలు పరిశీలించాలి.
చేప పిల్లల సాంద్రత పరిశీలన : స్పాను స్టాక్‌ చేసిన 12-15 వ రోజున లాగుడు వలతో పట్టి సాంద్రత పరిశీలించి బ్రతుకుదల అంచనా వేసుకోవాలి.
ఫ్రై పెంపకం ఆర్ధికాంశాలు :
అంశం విలువ రూ.
చర వ్యయం
చెరువు లీజు వెల 5,000
బ్లీచింగ్‌ పౌడర్‌ (10 పిపిఎం క్లోరైడ్‌) / ఇతర విషపదార్ధాలు 2,500
సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు 8,000
స్పాన్‌ (మిలియన్‌కు 5,000 రూపాయల వంతున 5 మిలియన్లు 25,000
అదనపు దాణా కేజి 10రూ. చోప్పున 750 కేజీలు 7,500
చెరువు నిర్వహణకు, చేపలుపట్టడానికి కూలీల  ఖర్చు 5,000
ఇతర ఖర్చులు 5,000
చర వ్యయం మొత్తం 58,000
మొత్తం వ్యయం 58,000
స్థూలాదాయం
ఫ్రై అమ్మకాలవల్ల వచ్చే రాబడి (లక్ష ఫ్రై రూ.7,000 వంతున 15 లక్షల ఫ్రై) 105,000
నికర ఆదాయం (స్థూల ఆదాయం-మొత్తం వ్యయం) 47,000
వానా కాలంలో, (జూన్‌- ఆగస్టు నెలల మధ్య), చెరువునుంచి రెండు పంటలు తీయవచ్చు. ఆ విధంగా, ఒక హెక్టారు చెరువు నుంచి రెండు పంటల ద్వారావచ్చే మొత్తం నికర ఆదాయం రూ. 94,000.
ఫింగర్‌ లింగ్స్‌ పెంపకం ఆర్ధికాంశాలు :
అంశం విలువ రూ.
1.చర వ్యయం
చెరువు లీజు వెల 10,000
బ్లీచింగ్‌ పౌడర్‌ (10 పిపిఎం క్లోరైడ్‌) / ఇతర విషపదార్ధాలు 2,500
సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు 3,500
ఫ్రై (లక్ష ఫ్రై 7,000 వంతున 3 లక్షల ఫ్రై) 21,000
అదనపు దాణా (టన్ను 7000 రూపాయల వంతున 5 టన్నులు) 35,000
చెరువు నిర్వహణకు, చేపలు పట్టడానికి కూలీల  ఖర్చు 5,000
ఇతర ఖర్చులు 3,000
చర వ్యయం మొత్తం 80,000
బి మొత్తం వ్యయం 80,000
స్థూలాదాయం
ఫింగర్‌లింగ్స్‌ అమ్మకాలవల్ల వచ్చే రాబడి
( 1000ఫింగర్‌లింగ్స్‌ రూ.500 వంతున 2.1 లక్షల ఫింగర్‌లింగ్స్‌ ) 1,05,000
నికర ఆదాయం (స్థూల ఆదాయం-మొత్తం వ్యయం) 25,000.

Also Read: Procedures for Fish Storing: చేపలను పట్టుబడి చేసిన తరువాత నిల్వ చేయు విధానాలు.!

Leave Your Comments

Marigold Cultivation: బంతి సాగులో -విజయా గాధ.!

Previous article

Sweet Potato Vines as Fodder: పశుగ్రాసంగా చిలగడ దుంప.!

Next article

You may also like