మత్స్య పరిశ్రమ

Tilapia Fish: తిలాపియా చేపల అమ్మకం తో ఉపాధి.!

1
Tilapia Fish
Tilapia Fish

Tilapia Fish: ఆరోగ్య రీత్యా చేపలు మంచి రాష్టికాహారం. స్ధానికంగా లభించే మంచి నీటి రకం చేపల్లో తిలానీయ’ చేపల గురించి తెలుసుకుందాం. ఇది విదేశీ రకం చేప. దీనిని తిలాపియ అని, శాస్త్రీయంగా ఓరియో క్రోమిస్ నైలోటికన్స్, ఓరియోక్రోమిస్ మోసాంబికస్ అని అంటారు. స్థానికంగా చైనగురక, దూబొచ్చ, పిల్లాచి, పాంపెట్ వగైరా పేర్లతో పిలుస్తారు. ఇది మంచినీటి వనరుల్లో సహజంగానే పెరుగుతుంది. సుమారు కిలో బరువు పెరుగుతుంది. వీటివి కొన్ని ప్రాంతాల్లో కలుపు చేసగా భావిస్తారు. కొన్నిప్రాంతాల్లో ఆహారపు చేపగా తీసుకుంటారు. ఇవి మిగతా చేపలకంటే తక్కువ ధరకు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా స్థానిక మంచి నీటి వనరుల్లో వీటి లభ్యత అధికమైంది. ఈ చేపలను లాభదాయకంగా పెంచే విధానం, ఆదాయం పొందే అవకాశాల గురించి తెలుసుకుందాం.

తిలాపియా ప్రత్యేకత:

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక ఉత్పత్తయ్యే చేప జాతుల్లో తిలాపియా ఒకటి. ఇది ఈజిప్టు దేశం నైలు నది చేప. గతంలో దీన్ని మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ప్రయోగాత్మకంగా పెంపకం చేపట్టారు. అలా క్రమంగా మంచి నీటి వనరుల్లోకి వెళ్లింది. తిలాపియా చాలా దృఢమైన చేప, అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని బ్రతికే సామర్థ్యం, స్వభావం ఈ చేపకు ఉంది. ఫలితంగా ఏడాదంతా ఈచేపలుంటాయి. అందువల్లన వీటి అమ్మకం ద్వారా నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చు. దీని మాంసంలో ముళ్లు కూడా తక్కువగా ఉంటాయి.

Also Read: కంజు పిట్టల పెంపకంలో ఆదాయం.!

Tilapia Fish

Tilapia Fish – Profits

పోషకాలు పుష్కలం:

తిలాపియ చేపలో మనకు అవసరమైన దాదాపు అన్ని పోషకాలు అనగా మాంసకృత్తులు, కొవ్వులు, పుష్కలంగా ఉంటాయి. మిగతా చేపలతో పోల్చితే. తక్కువ ధరలో అధిక పోషకాలను తిలపియా చేప ద్వారా మనం పొందవచ్చు.

విలువ పెంచే ఉత్పత్తుల తయారీ

చేపలను తినాలని చాలామందికి ఉన్నప్పటికీ వాటికుండే ముల్లు/ ఎముకలు అంటే భయం. చేపలను ముల్లు లేకుండా చేసి అమ్మితే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. కొర్రమీను, జల్ల చేపల వలే తిలాపియ చేపల్లో కూడా ముల్లు చాలా తక్కువగా ఉంటుంది. అనేక ఇతర రకాల చేపల మాదిరిగానే, తిలాపియాలో సెలీనియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి క్యాన్సర్‌తో పోరాడుతాయి మరియు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేస్తాయి. సెలీనియం ఫ్రీ రాడికల్ చర్యను తగ్గిస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడికి తక్కువగా గురి చేస్తుంది. ఇది క్యాన్సర్ కణాలకు ఆరోగ్యకరమైన కణాల మార్పును నిరోధిస్తుంది. తిలాపియా తీసుకోవడం వల్లన మెదడు పనితీరును పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా-3లు పుష్కలంగా ఉంటాయి, ఇవి నరాల పనితీరును పెంచుతాయి.

Also Read: ఏడాదంతా ఆదాయాన్నిచ్చే ఆకుకూరల సాగు.!

Leave Your Comments

Quail Farming: కంజు పిట్టల పెంపకంలో ఆదాయం.!

Previous article

Hike in Onion Prices: కోయకుండానే కన్నీళ్లు.. షాకివ్వనున్న ఉల్లి రేటు..

Next article

You may also like