మత్స్య పరిశ్రమమన వ్యవసాయం

Fish Farming: చేపల పెంపకం – సాగులో మెళుకువలు.!

1
Fish Farming, Cultivation
Fish Farming, Cultivation

Fish Farming: 
చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.

చేప పిల్లల ఎంపిక
చేపపిల్లల ఎంపిక చాలా కీలకం. ఒక దానితో ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. మిశ్రమ పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే, బంగారు తీగ వంటి చెరువు అడుగున ఉండే చేపలను వదలరాదు.

Fish Farming

Fish Farming

నీటి నాణ్యత
చేపలు ఆరోగ్యంగా పెరగడానికి నీరు లేత ఆకుపచ్చ రంగుతో 28-32 డిగ్రీ ల సేం. గ్రే. ఉష్ణోగ్రత ,30-40సేం. మీ. పారదర్శకత కలిగి నీటిలో ఉండే ప్రాణవాయువు 5-8 పి. పి. ఎం., ఉండాలి. అలాగే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్, భాస్వరం, కూడా పరిమిత స్థాయిలో ఉండాలి. చెరువు నీటిలో ప్రాణవాయువు తగ్గకుండా జాగ్రత్త పడాలి.నర్సరీ చెరువులో 8-10 సేం. మీ. పెరిగే వరకు 30-40 రోజుల పాటు పెంచి పెంపకం చెరువులో వదలాలి. పెంపకం చెరువులో 1.5 మీ. కు తగ్గకుండా నీరు ఉండాలి.

Also Read: Procedures for Fish Storing: చేపలను పట్టుబడి చేసిన తరువాత నిల్వ చేయు విధానాలు.!

ఎరువులు
చెరువును సారవంతం చేసి, సహజ ఆహారం ఉత్పత్తికి గాను నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒక దాని తర్వాత మరొకటి వేయాలి.

మేతలు
చేపల సత్వర పెరుగుదలకు మేతల వాడకం తప్పనిసరి. మేత తయారీకి నాణ్యమైన దినుసులు అనగా వేరు సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి. ఎకరాకు 5-10 మేత సంచులను సూర్యోదయం తరువాతనే కట్టాలి. సాలిన ఎకరాకు 150 కి. రాతిసున్నని నెలసరి వాయిదాల్లో వాడాలి.

ఆరోగ్యం
పెంపకం సమయంలో కనీసం 15 – 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలి. చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి. అవసరం అయితే వ్యాధుల నివారణ లో తగిన రసాయనాలను వాడాలి.

మార్కెటింగ్
పెరిగిన చేపలను సకాలంలో పట్టుబడి చేసి, సైజుల వారిగా గ్రేడింగ్ చేసి గిట్టుబాటు ధరకు మార్కెటింగ్ చేసుకోవాలి. చేప కిలో సైజు పెరగడానికి 10-12 నేలలు పడుతుంది. వెదురు బుట్టలో ఐస్ తో ప్యాక్ చేసి, వ్యాన్ రవాణా చేస్తారు.

Also Read: Jhora Fish Farming: జోరా టెక్నిక్‌తో చేపల పెంపకం

Leave Your Comments

Livestock Housing: పశువుల పెంపకంలో గృహవసతి యాజమాన్యం.!

Previous article

Water Hyacinth Organic Compost Fertilizer: గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు.!

Next article

You may also like