ఆంధ్రప్రదేశ్లో పండించే వాణిజ్య పంటలలో చెరుకు ముఖ్యమైనది. సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. 130 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది. నీటిపారుదల సౌకర్యం గల భూములు, చెరుకు సాగుకు మిక్కిలి అనువైనవి. రాయలసీమ, కోస్తా జిల్లాలలో జనవరి నుంచి మార్చి వరకు ముమ్మరంగా చెరుకును నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో రైతులు నాటారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు అపరాలు తీసి చెరుకు నాట్లు వేస్తున్నారు. అధిక దిగుబడి,రసంలో ఎక్కువ పంచదార శాతం పొందడానికి దోహదపడే అంశాలు సాగునీటి పారుదల, నాణ్యత,ఎరువుల ఎంపిక కూడా గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆలస్యమైనందువల్ల స్వల్పకాలిక రకాలను ఎన్నుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:
ఆలస్యంగా నాట్లు వేస్తున్న రైతులు కాలువలు తయారు చేయడానికి ముందుగా తమకు లభ్యంగా ఉన్న పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, వెదజల్లి దున్నాలి. లోతుకాలువల పద్ధతి అవలంభించినప్పుడు ఈ సేంద్రియ ఎరువులను వారం రోజులు ముందుగా చల్లి మన్నుతో కలియబెట్టాలి. ఫిల్టరు మట్టి లభ్యమైన చోట్ల దానిని కూడా ఎకరానికి 10-12 టన్నులు వేయవచ్చు. సేంద్రియ ఎరువులు లేకుంటే పచ్చిరొట్ట ఎరువులైన జనుము లేక సీమజీలుగ విత్తనాలను తోటలో చల్లాలి. ఇలా చేయడానికి హెక్టారుకు 15 కిలోల జనుము విత్తనాలు లేక 10 కిలోల సీమ జీలుగు విత్తనాలు కావాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులు మొక్కలు పెరుగుదలను బట్టి సుమారు 60 రోజుల తర్వాత మొక్కలను మొదట వేసి మట్టితో కప్పాలి. మొదటి 60-70 రోజులలో అంతరపంటలుగా మినుము,పెసర వేసుకోవచ్చు.
నత్రజని ఎరువులు:
అమ్మోనియం సల్ఫేట్, యూరియా, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ లేక అమ్మోనియం సల్ఫేట్ వంటి రసాయనిక ఎరువులలో ఏదైనా ఒక దానిని ప్రాంతాలను బట్టి వివిధ మోతాదులలో ఆయా మొక్క రకాన్ని బట్టి తోటలకు వేయాలి. నత్రజని ఎరువులను మొక్కల మొదళ్ళ వద్ద సుమారు 7 1/2 సెంటీమీటర్లలోతు గోతులలో వేసి మట్టితో కప్పాలి.
భాస్వరం, పొటాష్ ఎరువులు:
భాస్వరం, పొటాష్ ఎరువులు ఆయానేల స్వభావం, నేలలో ఆయా మూలక లభ్యతను బట్టి వేసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా చెరుకుసాగు మొదలుపెట్టిన సాగుచేస్తున్న రేగడి భూములలో భాస్వరం లోటుగా ఉన్నట్లు కనబడింది. ఆ భూములకు హెక్టారుకు 1/2 కిలోగ్రాముల భాస్వరం అందించే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలపాలి చెరువుల కింద సాగుచేసే వర్షాధారపు చెరకు పంటకు హెక్టారుకు 120 కిలోల పొటాషియం రెండు దఫాలుగా ముచ్చెలు నాటినపుడు సగభాగం. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మిగిలిన భాగం వేసుకుంటే ఎండాకాలంలోనే కాక వర్షాకాలం తర్వాత ఏర్పడే వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. 81ఎ99, కోటి 201,85 ఎ 261, కో 7219 రకాలకు పొటాషియం చాలా అవసరం.
సూక్ష్మ పోషకాలు, ఉప పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాష్ గాక చెరకు మొక్కలకు కాల్షియం (సున్నం), మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్, రాగి, జింక్, గంధకం, సిలికాన్ కూడా అవసరమవుతాయి. సున్నం అధికంగా ఉండే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో, చిత్తూరు, నిజామాబాద్ జిల్లాలో అక్కడ అక్కడ ఆకులలో పచ్చదనం తగ్గి అవి పాలిపోతాయి. ఈ పరిస్థితికి ఇనుములోపించడమే కారణం. దీనిని 2 శాతం ఫెర్రస్ సల్ఫేట్ (హెక్టారు కు 5 కిలోల అన్నభేది 1125 లీటర్ల నీటిలో) కలిపిన నీరు మొక్కల మీద చల్లి నివారించవచ్చు. రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు ఈ మందు చల్లితే ఈ పరిస్థితి అరికట్టవచ్చు. మాంగనీసు లోపిస్తే హెక్టారుకు 6.25 కిలోగ్రాముల మాంగనీస్ సల్ఫేట్ 1125 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే మాంగనీసు లోపం నివారించవచ్చు.
నీతికట్టు – ఇవకతీత:
పంట మొదటి నాలుగు నెలల్లో (బాల్యదశలో) ఎంత తరచుగా నీరు కడితే అంత ఎక్కువ దిగుబడులు వస్తాయి. పంట బాల్యదశలో వేసవిలో 6 రోజులకొకసారి. పక్వదశలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 21 రోజులకొకసారి తదుపరి 10 – 15 రోజుల వ్యవధిలోనూ నీరుకట్టుట సామాన్యంగా చేయాలి. నీటి ఎద్దడి ఈ పరిస్థితుల్లో చెరుకు నాటిన మూడవ రోజున హెక్టరుకు 3 టన్నుల చొప్పున చెరకు బెత్త నేలమీద పరుచుట వల్ల చెరుకు దిగుబడులు సుమారు 20 శాతం పెరుగుతాయి. పంట బాల్యదశలో ప్రధమ తడి ఇచ్చిన తర్వాత ఒక్క తడి పెట్టుటకు మాత్రమే సరిపోయేంత నీరు ఉన్నప్పుడు ఆ తడిని మొదటి తడి పెట్టిన 31 వ రోజున పెట్టడం మంచిది.