తెలంగాణమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

రైతన్నకో ప్రశ్న…?

0

1.వేరుశనగ పంటలో విత్తన శుద్ధికి ఏ రసాయనం వాడాలి ? ( ఎ )
ఎ. టెబ్యూకోనజోల్ 1గ్రా./ కిలో విత్తనానికి
బి. మాంకోజెబ్ 2గ్రా. / కిలో విత్తనానికి
సి. ప్రోపికోనజోల్ 1 మి.లీ./ కిలో విత్తనానికి
డి. పైవేవి కావు

2. వేరుశనగలో నేల శుద్ధి చేసుకోవడం ద్వారా ఏ తెగుళ్లను నివారించుకోవచ్చు ? ( డి )
ఎ. మొదలు కుళ్ళు
బి. కాండం కుళ్ళు
సి. వేరు కుళ్ళు
డి. పైవన్నీ

3. ప్రస్తుత వాతావరణంలో వరిలో ఏ పురుగులు, తెగుళ్ల ఉధృతి
ఎక్కువగా ఉంటుంది ? ( సి )

ఎ. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు
బి. సుడి దోమ
సి. పై రెండు
డి. పైవేవి కావు

4. మిరప పంటలో ఎండు తెగుళ్లను ఏ విధంగా అరికట్టుకోవాలి ? ( సి )
ఎ. జొన్న, ఇతర చిరు ధాన్య పంటలతో పంట మార్పిడి
బి. నేల శుద్ధి ట్రైకోడెర్మా విరిడి 2 కిలోలు + వేప పిండి 10 కిలోలు + పశువుల ఎరువు 100 కిలోలు బాగా మాగిన తర్వాత ఎకరాకి నేలలో తేమ ఉన్నపుడు వేసుకోవాలి.
సి. పై రెండు
డి. పైవేవి కావు

5. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం తెలుపగలరు ( బి )
ఎ. వేప గింజల కాషాయం పిచికారి
బి. క్లోరాంట్రానిలిప్రోల్ +ల్యామ్డా సైహాలోత్రిన్ 0.5మి. లీ. /లీటరు నీటికి
సి. ప్రోపికోనజోల్ 1మి. లీ /లీటరు నీటికి
డి. పైవేవి కావు

6. మెషీన్ ద్వారా కోతకు అనుకూలమైన శనగ పంట రకం ? (సి)
ఎ) ఎన్. బి. ఇ. జి. – 3
బి) కే. ఏ. కే. – 5
సి) ఎన్. బి. ఇ. జి. – 47
డి) జె. జి. – 11

7. కింది వాటిలో జీరో టిల్లేజీ పద్దతిలో వరి మాగాణిలో విత్తుకోదగిన పంట ? (డి)
ఎ) నువ్వులు
బి) ఆవాలు
సి) కుసుమ
డి) పొద్దుతిరుగుడు

8. శనగ పంటలో 15 నుంచి 20 రోజుల పంట కాలంలో గడ్డి జాతి కలుపు నివారణకు వాడే కలుపు మందు ? (బి)
ఎ) పెండిమిథాలిన్ 1.5 లీ. /ఎకరాకు
బి) క్విజాలోఫాప్ – పి – ఇథైల్ 400 మి. లీ. /ఎకరాకు
సి) అలాక్లొర్ 1 లీ. /ఎకరాకు
డి) ఆక్సీప్లోర్ ఫెన్ 125 మి. లీ. / ఎకరాకు

9. పొద్దు తిరుగుడు పంటలో గింజ కట్టుదలకు పిచికారి చేసే పోషకం ?  (ఎ)
ఎ) బోరాక్స్ 2 గ్రా. / లీ. నీటికి
బి) జింక్ సల్ఫేట్ 2 గ్రా. / లీ. నీటికి
సి) ఇరన్ సల్ఫేట్ 5 గ్రా. / లీ. నీటికి
డి) యూరియా 2 గ్రా. / లీ. నీటికి

10. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మానేజ్ మెంట్ ఈ కింది
ఏ నగరంలో ఉంది ? (సి)
(ఎ) ఢిల్లీ                                  (బి) ముంబై
(సి)హైదరాబాద్                      (డి) బెంగళూరు

ఎం. రాజశేఖర్, డా.జె.ఎస్.సుధా రాణి, డా.కె.అరుణ, డా.ఎ.నిర్మల,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్.

Leave Your Comments

పాలలో కల్తీ ……గుర్తిస్తేనే ఆరోగ్య దీప్తి !

Previous article

అధిక రసాయన ఎరువులతో అనర్థాలు సేంద్రియ ఎరువులతో నేలకు జవజీవాలు

Next article

You may also like