పశుపోషణమన వ్యవసాయం

Exudative Epidermitis in pigs : పంది పిల్లలలో వచ్చే జిడ్డుతో కూడిన చర్మ వ్యాధి యాజమాన్యం

0

Livestocks కోట్లాది మంది ప్రజలు ప్రధానంగా రైతు కుటుంబాలు తమ పోషణ, ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. పశువుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయం ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న తరహా పశువుల పెంపకంతో భారీగా సంపాదించవచ్చు.

Exudative Epidermitis  ఇది పంది పిల్లలలో అకస్మాత్తుగా కనబడు చర్మ వ్యాధి. కొన్నిసార్లు ఈ వ్యాధి సోకిన పంది పిల్లలలో మరణాలు కూడా వుంటాయి.

వ్యాధి కారకం:- ఈ వ్యాధి స్టెఫైలోకోకస్ హయోస్ (Staphy lococcus hyos) అను గుంపులుగా అమరిన గోళాకారపు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వలన కలిగి, పందులు 24-30 గంటలలోపు చనిపోతాయి. వ్యాధి వ్యాప్తి చెందు విధానం, లక్షణాలు :- ఈ వ్యాధి అపరిశుభ్రంగా, పోషక విలువల లోపం ఉన్న పంది పిల్లలలో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా ప్రబలి, చర్మంపైన ఎర్రని దురదతో కూడిన దద్దురులు వచ్చి చితికిపోయి వాటి నుండి జిగురుగా ఉన్న పసుపు రంగు ద్రవాలు కారుతూ ఉంటాయి. ఈ పుండ్లు కంటి చుట్టూ, చెవుల వెనక, కడుపు క్రింద భాగాలలో ఎక్కువగా ఉండి వ్యాధి సోకిన 24-30 గంటలలో చనిపోవును. ఈ రోగం దీర్ఘకాలికంగా మానదు చర్మం మందమైపోయి, ముడతలు పడుతాయి.

నిర్ధారణ:- వ్యాధి లక్షణాలను బట్టి మరియు గాయాల నుండి వచ్చే ద్రవాలను పరీక్షించటం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చును.

చికిత్స :- అక్సి టెట్రాసైక్లిన్ కి. లో బరువుకు 5 -10 మి.గ్రా, లేదా క్లోరంఫెనికాల్ కి.లో బరువుకు 20-30 మి.గ్రా లేదా స్ట్రెప్టోమైసిన్ కి. లో బరువుకు 5-10 మి.గ్రా చొప్పున రోజుకు రెండు పూటలా, కండరంలో 3-5 రోజుల ఇవ్వాలి. డిక్సామిథాసోన్ 0.5-1 మి.లీ చొప్పున కండరంలోకి 2-3 రోజులు ఇవ్వాలి. చర్మంపై వున్న దద్దురులకు అంటీబయోటిక్ లేదా అంటీ సెప్టిక్ సొల్యూషన్ డ్రెసింగ్ చేయాలి. హైడ్రోకార్టిజోన్ ఆయింట్మెంట్ కూడా పూయవచ్చు.

నివారణ :- (1) పాకలో సూక్ష్మ క్రిమి సంహారక మందులు చల్లాలి. (2) చనిపోయిన పందిని దూరంగా పూడ్చాలి లేదా కాల్చి వేయాలి. (3) వ్యాధి సోకిన పందులను మంద నుండి వేరుచేసి చికిత్స చేయాలి.

Leave Your Comments

Dairy farming : పాడి పశువుల పెంపకం లాభాసాటిగా ఉండాలంటే ?

Previous article

Soil pollution : నేల కాలుష్యం కావడానికి కారణాలు

Next article

You may also like