దేశంలో పలు ప్రాంతాలలో వర్షాభావం వల్ల నీటి కొరత తరచు దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంవల్ల పంటలు వేసిన రైతులు ఎంతో నష్టపోతున్నారు. పశువులకు మేత,ప్రజలకు తాగు,సాగునీటి కొరత ఏర్పడుతోంది. లభ్యమయ్యే ప్రతి నీటి బొట్టు ద్వారా మరింత భూమి సాగులోకి తేవాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం “కృషి సించాయి యోజన ప్రారంభించింది. ఈ పథకం అమలులో సాగునీటి ఆదా విస్తరణకు ప్రాధాన్యమిస్తారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి (నాబార్డ్) బ్యాంకు ద్వారా సూక్ష్మ సాగునీటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం 2021 – 22 వార్షిక బడ్జెట్ లో 10 వేల కోట్లు కేటాయించింది. బిందు మరియు తుంపర్ల ద్వారా 50 లక్షల ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఐదేళ్లలో రెండున్నర కోట్ల ఎకరాల భూమికి అంటే 50 లక్షల ఎకరాలకు ఈ సూక్ష్మ సాగు పద్ధతుల ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలనేదే లక్ష్యం కాగా, బిందు , తుంపర్ల సేద్యం పరికరాలకు దరఖాస్తు చేసుకునే రైతులు తమ వంతు వాటా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ఈ బిందు, తుంపర సూక్ష్మ సాగు విస్తీరణ అమలులో ఎంతో పురోగతి సాధిస్తున్నాయి. ఇంతవరకు ఈ పథకాల అమలుకు ప్రాధాన్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లుగా బిందు, తుంపర సూక్ష్మసాగుకు రైతాంగానికి ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. అంతకుముందు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూక్ష్మసాగు పరికరాల కొనుగోలుకు రాయితీలిచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతో లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమకు ప్రాధాన్యం ఇస్తూ బిందు,తుంపర్ల సేద్యానికి ఇది ఒక్క రూపాయి రాయితీ కూడా ఇవ్వడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాబార్డు సూక్ష్మ సాగు నీటికి రూ .5 వేల కోట్లు కేటాయించి ఆ మొత్తాన్ని 10 వేల కోట్లకు పెంచడం వల్ల రానున్న కాలంలో పెద్ద రాష్ట్రాల పైన ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, జార్ఖండ్ లలో సూక్ష్మసాగు పథకాల అమలు పంచుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 308 లక్షల ఎకరాలు బిందు ,తుంపర తదితర పరికరాలతో సూక్ష్మనీటి సాగవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి కృషి సించాయి పథకాన్ని ప్రారంభించింది. 2019 – 20లో 11 లక్షల మంది రైతులు 29.30 లక్షల ఎకరాలలో బిందు మరియు తుంపర సేద్యం ద్వారా నీటి పొదుపుగా నీరు వాడి పంటలు పండించారు. సూక్ష్మ నీటి సాగు సాంకేతిక పరిజ్ఞానం వాడకం ద్వారా 20 నుండి 48 శాతం నీరు, విద్యుత్ తదితర ఇంధనం వాడకంలో 10 నుండి 17 శాతం కూలీల ఖర్చు 30 నుండి 40 శాతం ఎరువుల వాడకంలో 11 నుండి 19 శాతం ఖర్చు తగ్గడం వల్ల అన్నదాతలు ఈ సూక్ష్మ సాగు పద్ధతులపై మొగ్గుచూపుతున్నారు. దుర్భిక్ష ప్రాంతాలలో లభ్యమయ్యే ప్రతి నీటి బొట్టులో మరింత పంట తీయడం వంటి ఆ పథకాల పై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read : యాసంగిలో ఆవాల సాగు మెలకువలు
కృషి సించాయి యోజన లో కొత్త సాగునీటి వనరుల కల్పన, సాగునీటి వనరుల అభివృద్ధి, భూమిలో తేమను శాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ, పొలంలో సాగు నీటిని అవసరమైన మేరకే పొదుపుగా వాడకం, నమోదైన నీటి వాడకం దార్ల బృందాలను సాముదాయిక నీటి సాగు చేపట్టేలా చూడటం, రైతులలో నీటి పొడుపు ద్వారా పంటల సాగుపై అవగాహన పెంచడం ,సామర్ధ్యం పెంపు వంటి వ్యూహాలను అనుసరించడం ముఖ్యమైనది.
సత్వర నీటి పారుదల ప్రయోజన కల్పన (AIBP) : ఈ పథకం కింద ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, జాతీయ ప్రాజెక్టులు మధ్య తరహా నీటి పారుదల పథకాలను సత్వరమే (AIBP) వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
ప్రతి పంట భూమికే సాగునీరు : సత్వర నీటిపారుదల పథకం కింద అభివృద్ధి చేసిన సాగునీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఆయాకట్టు ప్రాంత పనులు ,కొత్త నీటి వనరులను ,రక్షిత సాగునీటి కింద సాగు భూమి విస్తీర్ణం పెంచడానికి ప్రాధాన్యమిస్తారు.
Also Read : అగమ్యగోచరంగా మారిన తెలంగాణ రైతుల పరిస్థితి!