మన వ్యవసాయం

వ్యవసాయ పరిణామ క్రమం ఏరువాక ఆవిర్భావం

0

సమస్తకోటి జీవజాల మనుగడకు ముఖ్యమైనది ఆహారం. అందరి కడుపులు నింపి క్షుధ్బాధలను తీర్చేది ఆహారం. ఆ ఆహార సముపార్జన ప్రక్రియే వ్యవసాయం. ఆదిమానవుడు తన ఆకలి బాధలను తీర్చుకునేందుకు జంతవులను వేటాడి తినేవాడు. మెల్లమెల్లగా తన చుట్టూ ఉన్న చెట్లనుండి కాయలు, పండ్లు కోసుకొని తినేవాడు. ఆ తరువాతి కాలంలో ఒక నిర్థిష్ట పద్దతి లోమొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వరా ఆహారం మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలకు శ్రీకారం చుట్టాడు. దానికే వ్యవసాయం అని పేరు పెట్టుకున్నాడు..

మానవ చరిత్రలో వ్యవసాయం అనే వృత్తి ఆవిర్భావం ఒక మహోజ్వల ఘట్టం…అతిపెద్ద అతిప్రాముఖ్యతగల అంశం కూడా. మానవమనుగడకు పట్టుగొమ్మేకాకుండా. సామాజిక, ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధికి అతికీలక అంశం వేటాడి ఆహారాన్ని సంపాదించి పొట్టపోసుకునే ఆదిమ సమాజానికి భిన్నంగా సంఘజీవి అయిన మానవుడు మారిన సంస్కృతిలో భాగంగా సంపద సమకూర్చుకోవడం, రాజ్యరక్షణకు సైనిక పటాలను ఏర్పాటు చేసుకోవడం వ్యవసాయం వ్యవస్ధీకరణ అనంతరమే సాధ్యమైంది
వ్యవసాయరంగంలో ఆరుగాలం కష్షించి పనిచేసే రైతులలో ఎక్కువ మంది ఫలసాయం తమ కుటుంబ అవసరాలకే సరిపెట్టుకోవడం, తమ అవసరాలకు మించి పండించడం ప్రారంభంకావడంతో ఆయా తెగల జాతులు రాజ్యంలోని వ్యక్తులకు ఇతర వృత్తి కార్యకలాపాలు చేసుకోవడానికి సంపద సృష్టికి అవకాశం లభించింది. వ్యవసాయం మాత్రం ప్రపంచంలోని అధిక శాతం ప్రజల వృత్తిగా నిలిచిపోయింది.

మనదేశంలో ఇప్పటికీ 60 శాతం ప్రజలు ప్రపంచంలో 42 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆథారపడి జీవిస్తున్నారు. సంపద సమీకరణ శాతం మాత్రం వ్యవసాయ రంగానిది కేవలం 5 శాతం మాత్రమే.
తొలిదశలో వేటతో మొదలయ్యే ఆహార సాధన ప్రక్రియ వ్యవసాయంగా మారడంతో జంతుమాంసం దుంపలు కాయలు పండ్లు తినే మానవుడి ఆహార అలవాట్లు మారడం. దానితో పంటల ప్రక్రియ మారడం కొంతకాలమైన తరువాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. అవసరాల కనుగుణంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభం అయ్యింది.

పశువులను మచ్చిక చేసుకొని వాటి పాలను ఆహారంగానూ, వాటి శ్రమను వ్యవసాయానికి వినియోగించుకోవడం ఆహారపు అలవాట్లలో భాగంగా పప్పు ధాన్యాలను కనుగొని ఆపంటల సాగుకు సిద్ధం కావటం క్రీ.పూ. 7000 సంవత్సరాలలోనే ప్రారంభం అయినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అనంతరం ప్రబలుతున్న పురుగుల నివారణను చేపట్టడానికి మందులతయారీ, ఎరువులు వాడటం, సాగునీటి యాజమాన్య పద్దతులు అమల్లోకి వచ్చాయి.

గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయమే నేటికీ ప్రధాన ఉపాధి వనరు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రపంచం ఎలక్ట్రానిక్ యుగంలోకి అడుగంపెట్టిని అనేక వ్యవస్ధల్లో కొత్త కల్పనలు, ఆవిష్కరణలు ఎన్నోవస్తున్నా నాటికీ నేటికీ వన్నె తగ్గని వృత్తి వ్యవసాయమమే..

వ్యవసాయదారులు కూడా సరళీకరణ ప్రభావానికి ప్రపంచీకరణ పరిణామాలకు అతీతులు కారు గదా..ఈ రంగంలో వస్తున్న వినూత్న మార్పులు ఆవిష్కరణలు పోకడలకు రైతులు అతీతం కాని నేపథ్యంలోనే ఏరువాక పత్రిక ప్రచురణ ప్రసార రంగాలతో పాటు డిజిటల్ మీడియాలో కూడా ఆవిష్కరణ జరుపుకుంది.
గ్రామీణ వ్యవసాయరంగంలో వివిధ రకాలుగా భాగస్వాములైన రైతులు సహకారసంస్ధలు ఔద్యోగిక సంస్ధలు అవసరమైన పనిముట్లు తయారీదారులు, ఎరువులు, రసాయన కర్మాగారాలు, భీమా సంస్ధలు, విస్తరణ సిబ్బంది వంటి వారి వివరాలు..

ఏరువాక ద్వారా రైతుల ఇండ్ల ముంగిటకు పంటల ప్రాంగణాలకు చేరుకుంటాయి..
వ్యవసాయాన్ని సంక్షోభం నుండి రక్షించడానికి తనపంటకు రైతు తానే గిట్టుబాటుధర నిర్ణయించుకునే దశకు రైతు చేరుకోవడానికీ వెన్నుదన్నుగా ఏరువాక నిలుస్తుంది. సకాలంలో రుణాలు లభించక ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు లేక ప్రకృతి వైపరీత్యలతో పంట నష్టపోయి పెక్కు సార్లు అనావృష్టి పంటలే చేతికి రాకపోవడం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నకిలీలతో మోసాలతో రైతన్న కుంగిపోయిన సందర్భాలు ఇవన్నీ ఆత్మహత్యలకు దారితీయటం చూస్తున్నా..
1990 నుండి ఇప్పటి వరకూ మూడులక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎంతటి విషాదమో ఆలోచించాలి.

ప్రతికూల పరిస్థితి అధిగమించి “వ్యవసాయం దండగకాదు పండగని” నినాదించి కొత్త వారిని ఈ రంగం వైపు ఆకర్షింపజేయటమే  ” ఏరువాక లక్ష్యం ” చదవండి…చదివించండి…
Leave Your Comments

వరిలో చీడపీడలు- యాజమాన్యం

Previous article

అవరోధాలను అధిగమించి ప్రగతి పధంలోకి అడుగు లేస్తున్న అనంత రైతు

Next article

You may also like