Coconut కొబ్బరిని పండించటంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. కొబ్బరి మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతభాండము. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పన్నాలు, కొబ్బరి నీరు ఆధారంగా ఉత్పన్నాలు, కొబ్బరి టెంక మరియు కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు ప్రధానమైనవి.
- మనరాష్ట్రంలో ఇది కొబ్బరిని ఆశిస్తూ చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది.
- సాధారణంగా 2-3 నెలల వయస్సు కలిగిన లేశపిందెలపై ఈ నల్లి ఎక్కువగా ఆశిస్తుంది.
- ముచ్చిక క్రింద ఉన్న మెత్తని ఎదిగే కణజాలం వద్ద ఈ పురుగులు వేలసంఖ్యలో గుంపులుగా చేరి రసంపీల్చడం మొదట్లో తెల్లని చారలు పొడవుగా ఏర్పడుతాయి.
- తరువాత ఇవి పసుపు లేదా గోధుమరంగులో మారి ముచ్చిక నుండి కాయ క్రిందివైపు వ్యాపిస్తాయి. క్రమేపి ఈ మచ్చలు ఎరుపురంగుకు మారి చర్మం ఎండి నిలువుగా పగుళ్ళు ఏర్పడి గజ్జికాయలుగా మారతాయి.
- పగుళ్ళ నుండి కొన్ని సార్లు జిగురు వస్తుంది.
- నల్లి సోకిన పిందెలు రాలిపోతాయి. కొబ్బరికాయ ఎదుగుదల లేక గిడసబారి పరిమాణము తగ్గుతుంది.
- కాయ పరిమాణం తగ్గడం వల్ల కొబ్బరి దిగుబడి దాదాపు 25% వరకు తగ్గుతుంది.
- కొబ్బరి దిగుబడి మరియు నాణ్యత కూడా తగ్గుతుంది.
- నల్లిసోకిన కాయలపైన పీచు గట్టిపడి పీచు పరిశ్రమకు పనికిరాదు.
- నల్లిసోకిన కాయలకు మార్కెట్లో తగిన ధర పలకదు.
యాజమాన్యం :
- నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలను నాశనం చేయవలెను.
- వేరుపిండిని 5-10kg ఒక చెట్టుకు ఒక సంవత్సరానికి వేయవలెను.
- వేపపిండితో పాటు ఇతర సేంద్రియ ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు విడివిడిగా వాడవలెను.
- సిఫారసు చేయబడిన ఎరువులు అనగా 1kgయూరియా+2kg SSP+2.5 kg ల MOP ఒక చెట్టుకు సం॥నకు తప్పకుండా వేయవలెను.
- నీటి తడులు క్రమంగా ఇవ్వవలెను.
- సారవంతమైన భూములలో అరటి, కంద, కోకో, పసుపు లేక వేరే కూరగాయలను అంతరపంటలుగా పండించుట వల్ల నల్లి తాకిడిని తగ్గించవచ్చు.
- చిన్న చెట్లయితే అజాడిరక్టా ఇండికా (వేపకు) సంబంధించిన 1000 ppm 5ml/Lt చొప్పున కలిపి పిచికారి చేయాలి.లేదా వేరుద్వారా 10ml అజాడిరగ్టన్ + 10ml Water కలిపి అందివ్వాలి. సంవత్సరానికి ఇలా 3 సార్లు పెట్టవలెను.
Leave Your Comments