ఉద్యానశోభమన వ్యవసాయం

Equipment’s for mango harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు

3

MANGO CULTIVATION మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు.  దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే. దాదాపు భారతదేశంలో 1000 మామిడి రకాలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 రకాలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పండిస్తున్నారు. భారతదేశంలోని మామిడి యొక్క వాణిజ్య రకాలు దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.

పరికరాలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, బెంగుళూరు వారు రూపొందించిన ఐ.ఐ.హెచ్. ఆర్ పరికరం భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూడిల్లీ వారు రూపొందించిన ఐ.ఎ.ఆర్.ఐ పరికరం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఫర్ నార్తన్ ప్లెయిన్స్ లక్నో వారు రూపొందించిన సి.ఐ.హెచ్.ఎన్.పి పరికరం మరియు కొంకణ్ కృషి విదాపీఠ్, డా పోలీ వారు రూపొందించిన డాపోలీ పరికరం.

డాపోలీ సహాయంతో కాయల తొడిమను ఈ పరికరం కత్తెరల మధ్య ఉంచి లాగినపుడు స్ప్రింగు వల్ల కత్తెరలు దగ్గరగా వచ్చి తొడిమను కత్తిరిస్తాయి. కాయలు చట్రానికి అమర్చిన వలలో పడతాయి. చాల వరకు పండ్లను మరియు కూరగాయలను పరిపక్వతకు రాకముందే కోయడం వల్ల వాటిని రవాణా చేయడానికి మరియు మార్కెటింగ్కి సులువు అగును. కోత కోసిన సమయం నుండి మార్కెట్కి చేరే లోపు అవి పక్వతకు వచ్చి మంచి నాణ్యతను సంతరించుకోగలవు.

కోత అనంతరం పండ్లను, కూరగాయలను కడగాలి. కడగడం వల్ల బాహ్య స్వరూపం పెరుగును మరియు వడలి పోవడం తగ్గును అంతేకాకుండా ఏవైనా సూక్ష్మజీవులు ఉన్నట్లయితే విడిపోతాయి. కడిగే నీటిలో ఫంగిసైడ్ను గాని బాక్టీరిసైడు కాని కలపడం వల్ల సూక్ష్మ జీవులను పూర్తిగా నిర్మూలించవచ్చు. అరటిలో కోత అనంతరం కడగడం వల్ల పక్వతను ఆలస్యం చేయవచ్చు. కడిగిన వెంటనే ఎక్కువగా ఉన్న తేమను తీసివేయాలి. లేకపోతే కుళ్ళి పోవుటకు అస్కారం కలదు. వేరు మరియు దుంప కూరగాయలను కడగడం వల్ల మట్టి మరియు యితర మలిన పదార్థాలను నిర్మూలించవచ్చు..

Leave Your Comments

Bud and fruit dropping in trees: కాయ, పిందె రాలుట కు కారణాలు మరియు అరికట్టే పద్ధతులు

Previous article

Rain Forecast: పొంచి ఉన్న భారీ వర్షపాత ముప్పు.!

Next article

You may also like