నేలల పరిరక్షణమన వ్యవసాయం

Environmental pollution: పర్యావరణ కాలుష్యానికి కారణాలు మరియు నివారణకు చేపట్టవలసిన అంశాలు

0

Environment సహజ పర్యావరణానికి ఎలాంటి హాని జరిగినా దానిని “పర్యావరణ కాలుష్యం” అంటారు. మానవుల కనీస అవసరాలకే కాకుండా, సుఖ సౌఖ్యాలకు సహజ వనరులను విచక్షణా రహితంగా దుర్వినియోగం చేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కాలుష్యానికి గురవుతున్నది.

  • పంచ భూతాలైన నీరు, గాలి, నేల, అగ్ని, ఆకాశములలో మనకు అందుబాటులో ఉన్న నీరు, గాలి, నేల చాల వరకు కాలుష్యానికి గురవుతున్నాయి.
  • జనావరణం నుండి బయటకు విడుదలయ్యే వ్యర్థాలు, కర్మాగారాల నుండి విడుదలయ్యే వ్యర్ధాలు, వ్యవసాయం లో వాడే రసాయన ఎరువులు, పురుగు మందులు మొదలైన పదార్థాల చేత నేల, నీరు, గాలి కలుషిత మవుతున్నాయి.
  • గాలిలో CO, శాతం పెరగడం వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగి పంట దిగుబడులు తగ్గుతున్నాయి.
  • వాహనాలు, పరిశ్రమలు గాలి లోనికి వదిలే విష వాయువుల వలన గాలి కలుషిత మవుతున్నది.

  • నేలలో వేయబడిన సేంద్రియ పదార్ధం అనేక సూక్ష్మ జీవుల చర్య వలన కుళ్ళి హ్యూమస్ గా మారి మొక్కల పెరుగుదలకు ఉపయోగ పడుచున్నది. కాని నేలలో వేసే చెడు పదార్ధములను మార్చే శక్తి సూక్ష్మ జీవులకు లేదు ఉదా: ప్లాస్టిక్ పదార్ధాలు
  • నిత్యం అనేక వ్యర్ధ పదార్ధాలను నేలకు చేర్చడం అతి త్వరలో నేల నిర్జీవ పదార్ధం గా మారడం దీని వల్ల భావి తరాల వారికి పంటలు పండించే నేలను ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.

కాలుష్య నివారణకు చేపట్టవలసిన అంశాలు:

  • సమగ్ర సస్య రక్షణ (IPM), సమగ్ర పోషక రక్షణ (INM), చేపట్టి చెడు కలిగించే రసాయన వాడకాలను తగ్గించాలి.
  • పరిశ్రమల నుండి వచ్చే భారీ లోహాలను, పట్టణ ప్రాంతాలనుండి వచ్చే వ్యర్ధాలను వ్యవసాయ భూముల లోనికి రాకుండా చూసుకోవాలి.
  • సేంద్రీయ పదార్ధాలను ఒక పధ్ధతి ప్రకారం కుళ్ళు నట్లు చేయాలి.
  • లవణ కాలుష్యాన్ని మురుగు నీరు పారే వ్యవస్థను మెరుగు పరచి తగ్గించాలి.
  • పరిశ్రమలనుండి వెలువడే కాలుష్యాన్ని నివారించడం వల్ల ఆమ్ల వర్షాలను అరికట్టవచ్చు.
  • రేడియో ధార్మిక పదార్ధాలు జీవావరణం లోనికి ప్రవేశించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • అనివార్య పరిస్థితులలో అభివృద్ధి పేరిట కాలుష్య పరిస్థితులను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలి.
Leave Your Comments

Poultry farming: కడక్ నాథ్, అసిల్, బస జాతి కోళ్ల లక్షణాలు మరియు ఉపయోగాలు

Previous article

Brucellosis disease in cattle: పశువులలో ఈసుకుపోవు రోగము ఇలా వ్యాప్తి చెందుతుంది

Next article

You may also like