Enterotoxemia Disease in Cattle: కోట్లాది మంది ప్రజలు ప్రధానంగా రైతు కుటుంబాలు తమ పోషణ, ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. పశువుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయం ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న తరహా పశువుల పెంపకంతో భారీగా సంపాదించవచ్చు.

Enterotoxemia Disease in Cattle
Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!
చిటుక వ్యాధి:- ఈ వ్యాధి క్లాస్ట్రీడియం పేర్ఫొరిన్టెన్స్ అను Gm+ve బ్యాక్టీరియా వలన గొర్రెలు, మేకలు, ఆవులలో కలుగు అతి తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో ఒపిస్తోటోనస్ (పశువు శరీరం ధనస్సు మాదిరి వంగి వుంటుంది) కండరాలు కొట్టుకోవడం, కళ్ళు సరిగ్గా కనిపించక ఎదురుగా వుండే వాటిని గుద్దుకోవడం (Blind stagerring), కోమ వంటి లక్షణాలు వుండి ఒక గంట వ్యవధిలోనే గొర్రెలు చనిపోతుంటాయి. కొన్ని గొర్రెలలో ఆకలి వుండక, పారుకుంటు, రక్తం మరియు మూత్రంలో అధిక గ్లూకోజు కలిగి వుంటాయి.
వ్యాధికి కారణం :- వ్యాధి కలుగుటకు దోహదపడు అంశాలు
- వున్నట్టుండి పశువుల ఆహారంను మార్చడం.
- పచ్చ గడ్డి, ఎండు గడ్డి నుండి అధిక దాణా మేపడం.
- ప్రేగులలో ఆహారం జీర్ణం కాక అలాగే వుండిపోవడం.
- ప్రేగులలో అడ్డంకులు, ప్రేగులు మడత పడటం.
వ్యాధి వచ్చు మార్గం :- వ్యాధితో కలుషితమైన ఆహారాన్ని గొర్రెలు తిన్నప్పుడు ఈ వ్యాధి కలుగుతుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- సిద్ధబీజాలతో కలుషితం అయిన ఆహారాన్ని గొర్రెలు తీసుకొన్నప్పుడు, అవి పొట్ట ద్వారా ప్రేగుల్లోకి చేరి పైన ఉదహరించిన క్రీడిస్పోసింగ్ కారణాల వలన గాలి రహిత స్థితి ఏర్పడినప్పుడు, ఈ సిద్ధబీజాలు పెరిగి ఎప్సిలాన్ అను విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఇవి రక్తం ద్వారా మెదడుకు చేరి మెదడు కణజాలాలను నాశనం చేయడం ద్వారా గొర్రెలు వున్నట్టుండి చనిపోతాయి. కొన్ని సందర్భాలలో ఈ విష పదార్థాలు కాలేయం మీద పని చేసి కాలేయంలోని గ్లైకోజెన్ను గ్లూకోజ్ గా మారుస్తుంది. ఈ గ్లూకోజ్ రక్తం ద్వారా మూత్ర పిండాలలోకి చేరి, మూత్రం ద్వారా బయటికి విసర్జించబడుతూ వుంటుంది.
Also Read: Nursery Management in Jatropha: జట్రోఫా లో నర్సరీ యాజమాన్యం.!