మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Energy Plantation Importance: ఎనర్జీ ప్లాంటేషన్స్ యొక్క ప్రాముఖ్యత.!

0
Energy Plantation Importance
Energy Plantation Importance

Energy Plantation Importance: మన దేశంలోని ఇంధన వనరులలో ఎక్కువ భాగము వ్యాపారాత్మక కాని ఇంధనములు ఉన్నాయి. అవి ముందు ముందు మన ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన స్థానాన్ని ఏర్పకచికోవచ్చు. అందుకనే ఈ వ్యాపారాత్మకం కాని ఇంధన వనరులను వ్యాపారాత్మకముగా వాడుకొనే విధంగా ప్రయత్నాలు చేస్తే మనము అలాంటి ఇంధన వనరులను శక్తివంతముగా ఉపయోగించవచ్చు. దీనిని ఉద్దేశించుకొని 1982 డా. స్వామినాన్ గారు మన దేశంలో ఎక్కువగా లభించు సూర్యరశ్మిని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఎక్కువ బయోమాస్ ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చని ఫ్యూల్ ఉడ్ కమిటీకి సూచించారు. దీని ఆధారంగా ఆరవ పంచవర్షక ప్రణాళికలో గ్రామ ప్రజలకు అవసరమయ్యే ఇంధన ఉత్పత్తి గురించి ఇంధన వనాలను స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఇతర ఇంధన మూలాధారములగు బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయడానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.

Energy Plantation Importance

Energy Plantation Importance

Also Read: Energy Plantation Importance: ఎనర్జీ ప్లాంటేషన్స్ యొక్క ప్రాముఖ్యత.!

సూరంగా వాడుకోవాలంటే ఖాళీగా ఉన్న ప్రతి భూభూగమును సంవత్సర పొడవునా వార్షిక లేదా బహువార్షిక లేదా గుబురుగా పెరిగే పొదచెట్లతో పెంచవలెను. అలా ఉత్పత్తి చేసిన బయోమాసును సూటిగా ఇంధనముగా వాడుకోవచ్చు. ఇంధన వనములను వంట చెరుకు పంటలుగా పనికిరాని భూములలో క్షీణించిన భూముల్లో రోడ్ల పక్కన, కాలువగట్లపైన మరియు రైలు మార్గము ప్రక్కన పెంచవచ్చు. పెరుగుతున్న పెట్రోలియం మరియు వంటచెరుకు ధరలు, అదే విధంగా పెరుగుతున్న వాటి అవసరాల నడుమ ఇంధన వనాలు గ్రామీణ ప్రదేశాలలో ఇంధన అవసరములను తీర్చడానికి వాడుకోవచ్చు.

గ్రామ ఎంపిక – స్థలం ఎంపిక: కలప సముదాయాలను ఏర్పరిచేముందు వాటి స్థానము అం టే ఎక్కడ ఏర్పరచాలి మరియు వాటి సైజు అంటే ఎంత పరిమాణంలో పెంచాలో నిర్ణయించాలి. స్థల ఎంపిక గుహావసరాల్ని, భూమి గుణాన్ని మరియు మార్కెట్ అవసరాలను బట్టి జరుగుతుంది. కలప సముదాయాలను ముఖ్యంగా పొలంలో పనికిరాని భూములు మరియు క్షీణించిన భూముల్లో పెంచవచ్చు. ఒకవేళ కలప సముదాయాలను గాలి నిరోధకాలుగాపెంచాలనుకుంటే వాటి స్థలము భవనాలు, పొలాలు, పండ్లతోటలు, పచ్చిక బయళ్ళు మొదలగు వాటిలో వేటిని రక్షించాలో దాని మీద ఆధారపడి ఉంటుంది. కలప సముదాయ పరిమాణము చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు అది మనకున్న భూపరిమాణాన్ని బట్టి ఉం టుంది.

యాజమాన్యం:

కలప సముదాయమును అడవి యొక్క మూలధనముగా భావించొచ్చు. దీని నుంచి ఆదాయం వస్తుంది. చెట్లను పెంచడానికి పెట్టే పెట్టుబడిని మరియు చెట్ల సంవత్సరపు పెరుగుదల, అడవి మూలధనముపై వచ్చే వడ్డీతో సమానం. ఒకవేళ సంవత్సరానికి కలప ఉత్పత్తి ఎక్కువగా ఉం టే, ఎక్కువ శాతం వడ్డీని సరిగా అం టే వేగంగా పెరగకపోయినా, వాటి మధ్య సరైన దూరం లేకపోయినా వీటిపై ఆదాయం లేదా వడ్డీ తక్కువగా వస్తుంది. కలప సముదాయాల నుంచి వచ్చే ఆదాయం, వాటిపై పెట్టే ఖర్చు, వాటి యాజమాన్యము మీద ఆధారపడి ఉం టుంది.

ప్రతి సంవత్సరం సరైన మోతాదులో ఓ కలపను అడవి మూలధనం తగ్గకుండా ఉత్పత్తిచేయడం

ఈ ఉద్దేశాన్ని సాధించడానికి రెండు యాజమాన్య పద్ధతులను అవలంభించవచ్చు.

చెట్లన్నీ నాటిన తరువాయ, మెత్తం స్థలాన్ని సమభాగాలుగా చేసుకొని, పక్వానికి వచ్చిన తరువాత, ఒక్కొక్క భాగంలో ఉన్న చెట్టుని ప్రతి సంవత్సరం కలప కోసం కొట్టివేస్తూ ఉండాలి. అలా ప్రతొ సంవత్సరం వయస్సు మళ్ళిన చెట్లను నింకడాన్ని భ్రమణం ఆంటారు. ఈ భ్రమణం కావలసిన వస్తువులపైన మరియు చెట్ల పెరుగుదల పైన ఆధారపడి ఉం టుంది.

ఒకసారి చెట్లను ఏ వయసులో నరకాలో ముందే నిర్ణయించుకొని తరువాయ మెత్తం కలప సముదాయాన్ని సమభాగాలుగా చేసి, ఒక్కొక్క భాగంలో ఒక్కొ సంవత్సరమ్ చెట్లను కొట్టివేసి కలపను తీసుకోవాలి. ఒక భాగంలో చెట్లను కొట్టివేసిన వెంట్నే మొదట ఏ భాగంలో అయితే చెట్లను నరకడం మొదట పెట్టామో ఆ భాగంలో చెట్లు మళ్ళీ పెద్దవిగాను, పాతగాను తయారయ్యి కలపతో సిద్ధంగా ఉంటాయి.

Also Read: Organic Farming Techniques: సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు.!

Leave Your Comments

Broiler Farming: మాంసవు కోళ్ళ పెంపకంలో గృహవసతి, పోషణ యాజమాన్యం.!

Previous article

Citrus Crop Protection: నిమ్మలో సీతాకోక చిలుక మరియు చెదలు పురుగు నివారణ చర్యలు.!

Next article

You may also like