Emu Bird Farming: ఈమూ పక్షుల మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడ ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ మరియు ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం మరియు ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విస్తృతమైన పెంపక క్షేత్రాలలో (Rancher) మరియు తక్కువ వైశాల్యం గల ప్రదేశాలలో కూడ ఈ పక్షులను, అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి బాగా పెంచవచ్చు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, మరియు చైనా, ఎమూ పెంపకంలో ముందున్నాయి. ఎమూ పక్షులు, భారత దేశ వాతావరణ పరిస్థితులకు చక్కగా యిమిడి పోయాయి.
గది ఉష్ణోగ్రతకు అలవాటైన తరువాత, ఫలవంతమైన గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక ట్రే లో సమాంతరంగా గాని ఏటవాలుగా గాని, వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని (incubator) పూర్తిగా శుభ్రపరిచి, శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. మెషీన్ (యంత్రాన్ని) మీట నొక్కి, పొదగడానికి కావలిసిన ఉష్ణోగ్రత సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే డ్రై బల్బే (వేడి బల్బు) ఉష్ణోగ్రత సూమారు 96o – 97o f మరియు వెట్ బల్బ్ (తేమ బల్బు) ఉష్ణోగ్రత సుమారు 78o – 80o f (సుమారు 30 – 40% RH )లు గా ఉండాలి. గుడ్లను ఉంచిన ట్రే ను జాగ్రత్తగా ఒక సెట్టర్ (పొదిగే ప్రాంతం)లో ఉంచాలి. ఒకేసారి, ఇన్ క్యూబేటర్ సరైన ఉష్ణగ్రతతో, తేమతో సిద్ధంగా ఉన్నట్లైతే, గుడ్లను పొదగడానికి ఏర్పాటు చేసుకున్న సమయాన్ని, అవసరమైతే దాని జాతి చరిత్రను తెలిపే చీటిని అందులో పెట్టాలి.
Also Read: ఈమూ పక్షి పిల్లల పెంపకం
ఇన్ క్యూబేటర్ లోని ప్రతి 100 క్యూబిక్ అడుగుల స్థలానికి, 20 గ్రాముల పొటాషియం పెర్మాంగవేట్ + 40 మిల్లీ లీటర్ల ఫార్మలిన్ ను ఉపయోగించి రోగక్రిములను నాశనం చేయాలి. ప్రతిగంటకు, ఒకసారి గుడ్లను తిప్పుతూ, 48వ రోజు వచ్చే దాకా అలా చేస్తూ ఉండాలి. 49వ రోజు తరువాత గుడ్లను అటూ, యిటూ తిప్పడం మానివేసి, కదలికల కోసం గమనిస్తూ ఉండాలి. 52వ రోజుకు పొదగబడే సమయం అయిపోతుంది. ఎమూ పక్షి పిల్లలు పొడిగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చినప్పుడు, కనీసం 24 గంటల నుండి 72 గంటల దాకా పొదగబడిన గది లోనే ఉంచాలి. అందువలన వాటిలోని నూగు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి యిది అవసరం. సాధారణంగా, పొదగడంలో 70% కాని అంతకు మించి కాని ఫలితం ఉంటుంది. తక్కువగా పొదగబడడానికి చాల కారణాలు ఉంటాయి. సంతానోత్పత్తి దశలో, సక్రమమైన పోషకాహారం అంద చేయడం వలన, తరువాత కాలంలో ఆరోగ్యకరమైన పిల్లలు పొందడానికి కారణమౌతుంది.
Also Read: జామ తోటలో తేనెటీగల పెంపకం.. అదనపు ఆదాయం