చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Diseases of Bhendi: బెండి పంటలో లో సస్యరక్షణ చర్యలు.!

0
Diseases of Bhendi
Diseases of Bhendi

Diseases of Bhendi: బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగుతుంది. అనుకూల పరిస్థితులలో నాలుగు మీటర్లల వరకూ పెరుగుతుంది. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉంటుంది. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉంటుంది. అండాశయము ఐదు అరలు కలిగి ఉంటాయి. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉంటుంది. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉంటుంది. గింజలు చిన్న కందిగింజలంతేసి యుండును. గ్రామునకు 12 15 తూగును. నీలి వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉంటుంది.

Diseases of Bhendi

Diseases of Bhendi

Also Read: Bhendi yellow vein mosaic virus: బెండ లో పల్లాకు తెగులు మరియు యాజమాన్యం

బూడిద తెగులు:

కారకం: ఎరిసిఫె చికోరేసియారం

లక్షణాలు:

ఈ తెగులు ఎక్కువగా నవంబర్ మరియు మార్చి మాసాల మధ్యలో బెండ పైరుకు ఎక్కువగా ఆశిస్తుంది. మొదట మొక్కల క్రింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడును. క్రమేపి ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి పైకి కూడా విస్తరించును. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగుకు మారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులుసోకటం వలన పూత విపరీతంగా రాలిపోవును మరియు మొక్కలలో పుష్పించే శక్తి క్షీణిస్తుంది చల్లని పొడి వాతావరణం ఈ వ్యాధి వృద్ధి అనువైనది.

నివారణ:

ఈ తెగులు ఆశించిన వెంటనే, మరో 15 రోజుల వ్యవధిలో రెండవసారి లీటరు నీటికి కార్బండిజం 1గ్రా. లేదా థయోఫినేట్ మిథైల్ 1గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ 1 మి.లీ. లేదా కెరాథేన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పసుపుపచ్చ ఈనెల తెగులు (పల్లాకు తెగులు):

కారకం: ఈ తెగులు ఎల్లోవీస్ మొసాయిక్ వైరస్ (YMV) వలన కలుగుతుంది.

లక్షణాలు: టెండ పైరుకు వచ్చు తెగుళ్ళలో ఇది చాలా ముఖ్యమైనది. వర్షాకాలపు పంటను ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వలన ఆకులలోని ఈనెలు పసుపు పచ్చగా మారుతాయి. తెగులు తీవ్రమైనపుడు ఆకులన్నియు పసుపు రంగుకు మారును. ఈనెలు మందంగా తయారగును. ఈ తెగులు వలన చెట్లలో కాపు తగ్గిపోతుంది. ఒకవేళ కాయలు ఏర్పడినా అవి మామూలు కాయల కంటే గట్టిగాను చిన్నవిగాను ఉంటాయి. తెగులును కలుగజేసే వైరస్ మొక్కల రసం ద్వారా కాని విత్తనం ద్వారా కాని వ్యాపించదు. తెల్లదోమ మరియు

దీపపు పురుగుల ద్వారా తెగులు వ్యాప్తి చెందును. వైరస్ అడవి జాతి మొక్కల మీద జీవించి ఉండును.

నివారణ:

• తగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి.
• వైరస్ జీవించే అడవి జాతి మొక్కలను, గడ్డి మొక్కలను తీసివేయాలి.

తెగులు వ్యాప్తికి దోహదం చేయు తెల్లదోమ మరియు దీపపు పురుగులను అరికట్టుటకు మిథైల్ పరాథియాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో లేక డిమిక్రాస్ మరియు నువాస్ ల మిశ్రమాన్ని (ప్రతిది 1 మి.లీ.) 3 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తిమ్మెట్ మందు గుళికలను విత్తనం వేయుటకు ముందు మరియు విత్తనం వేసిన 40-50 రోజుల తరువాత పొడి ఇసుకలో కలిపి భూమిలో వేసినట్లయితే ఈ తెగులు అంతగా వృద్ధి చెందదు.

తగులును తట్టుకునే పూస సవాని, సెలక్షన్ -4, సెలక్షన్ – 10 వంటి రకాలు తీవ్రత వలన మచ్చలు నలుపు రంగుకు మారి ఆకులు రాలిపోవును. తెగులు సోకిన మొక్కల నుండి పువ్వుల సంఖ్య చాలా వరకు తగ్గిపోవును.

Also Read: Bhendi shoot and fruit borer: బెండ పంట లో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం

Leave Your Comments

Minister Niranjan Reddy: సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారు.!

Previous article

Haemorrhagic Septicemia Disease in Buffalo: గేదెలలో వచ్చే గొంతువాపు వ్యాధి యాజమాన్యం

Next article

You may also like