Raw rice vs Boiled rice: ప్రపంచంలో బియ్యం అత్యధికంగా వినియోగిస్తున్న రెండవ అతిపెద్ద దేశంగా భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది దేశంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమైన పంట. అలాగే రోజువారీ భారతీయ ఆహారంలో తప్పకుండా ఉండే వంటకం.ప్రస్తుతం దేశంలో ముడి బియ్యం మరియు బాయిల్డ్ రైస్ పైన ఎక్కువ చేర్చ నడుస్తుంది.చాలా మంది ప్రజలకు ముడి బియ్యం మరియు ఉడకబెట్టిన బియ్యం మధ్య ప్రధాన వ్యత్యాసం కోసం అన్వేషిస్తున్నారు.
ముడి బియ్యం: వరిని 11% లేదా అంతకంటే తక్కువ తేమ ఉండేలా ఎండబెట్టడం వలన వచ్చే బియ్యాన్ని ముడి బియ్యం అంటారు.దీని నుండి బ్రౌన్ రైస్‌ని తీయడానికి మిల్లింగ్ చేయాలి.దీని నుండి వచ్చిన బియ్యాన్ని పాలిష్ చేయగా వైట్ రా రైస్ వస్తుంది. శాస్త్రీయంగా, ముడి బియ్యంలో కంటే ఉడికించిన బియ్యంలో తక్కువ పోషక విలువలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ ముడి బియ్యం నీరుతో కడిగినట్లైతే నీటిలో కరిగే విటమిన్లలో (బి, సి ), ఖనిజాలలో దాదాపు 60% వరకు కోల్పోతుంది. మన దేశంలో, రాష్ట్రములో దాదాపు అన్ని ఇళ్లలో, బియ్యాన్ని నీటిలో వండడం, అన్నం ఉడికిన తరువాత అదనపు నీటిని (గంజి) తీసివేయడం సర్వ సాధారణం, బి-గ్రూప్ విటమిన్లు నీటిలో కలిసి కోల్పోయేలా చేస్తుంది. కావున పోషక విలువలు తగ్గిపోతాయి.
Also Read: పెరట్లో మొక్కలను నాశనం చేసే మీలీబగ్స్ కీటక నివారణ
ఉడికించిన బియ్యము (బోయిల్డ్ రైస్): పచ్చి బియ్యాన్ని పెద్ద నీటి డ్రములలో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, చాలా సమయం పాటు నానబెట్టుట వలన తయారవును. బియ్యాన్ని నానబెట్టే సమయం వరిలో తేమ స్థాయిని బట్టి మారుతుంది. ప్రెజర్ బాయిలర్స్ లో నీరు ఆవిరిగా చేసి ప్యాడీ కుక్కర్ లోకి పంపుతారు. ఈ వేడి ఆవిరి వలన బియ్యం ఉడుకుతాయి. ఉడకబెట్టిన బియ్యంలో 35% వరకు తేమ స్థాయి ఉంటుంది. దీనిని 10% వరకు తగ్గించి ఎండబెడుతారు.చిట్టచివరగా,దానిని మిల్లింగ్ చేసి పాలిష్ చేయగా వైట్ బాయిల్డ్ రైస్ వస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా, బియ్యంలో అల్యూరోన్ పొరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఎండోస్పెర్మ్‌లో నిల్వ చేయడం వలన పోషకాలను కోల్పోదు.
దీని వలన ఉడకబెట్టిన బియ్యం మిల్లింగ్ తదుపరి కూడా దాని పోషకాలను కోల్పోదు. వేడి తగలడం వలన వరి ధాన్యం గట్టిపడి, కీటకాల దాడి తట్టుకోగలదు,అలాగే నిల్వ సమయం ఎక్కువ ఉంటుంది. అందువలన ఉడకబెట్టిన అన్నంలో అధిక పోషక విలువలు ఉంతటాయి, కడిగినా లేదా ఉడకబెట్టినా దానిలోని పోషకాలు తగ్గవు.
Also Read: బీటెక్ చదివి వానపాముల ఎరువుల వ్యాపారంలో విజయం సాధించిన పాయల్