పశుపోషణమన వ్యవసాయం

Silent Heat Detection in Buffaloes: గేదెలలో మూగ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలి.!

2
Heat Detection in Dairy Buffaloes
Heat Detection in Dairy Buffaloes

Silent Heat Detection in Buffaloes: దాదాపు 60 శాతం గేదెలు మూగ ఎదలో ఉంటాయి. ఈ మూగ ఎద వల్ల గేదెల పునరుత్పత్తిలో పెద్ద సమస్యగా ఉన్నది. దాదాపు 50 శాతం గేదెలలో పునరుత్పత్తి సంబంధించిన సమస్యలన్నీ ఎద లక్షణాలు సరిగా గుర్తించకపోవడం వల్లనే కలుగుతున్నవి. గేదెలు ఎక్కువగా ఆగస్టు నుండి మార్చి మాసాలలో ఎదకు వస్తాయి. కాబట్టి, ఈ సమయంలో గేదెల ఎదను గుర్తించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరమున్నది. గేదెలలో ఎదకాలం 24-36 గంటలు.

ఎదలో ఉన్న గేదెలు తరుచుగా మూత్ర విసర్జన చేస్తాయి. కొన్ని అతి తరచుగా ప్రతి 5 నిమిషాలకు 4-5 సార్లు మూత్ర విసర్జన చేస్తాయి. ఈ లక్షణాన్ని అనుసరించి అత్యధిక శాతం గేదెలను మూగ ఎదలో ఉన్నదని గుర్తించవచ్చు. గేదెలు ప్రదర్శించే గుణాన్ని ఎద గుర్తించడానికి ముఖ్యమైన లక్షణంగా పరిగణించవచ్చు.గేదె చికాకుగా ఉండి మేత తినడం తగ్గిస్తుంది. తేలికగా విసుగు చెందిపోవడానికి ప్రయత్నిస్తుంది.ఎదలో ఉన్న గేదె మానం ఉబ్బి తెరచి చూచినట్లయితే లోపలి పొర ఎర్రగా ఉంటుంది. మూగ ఎదలో ఉన్న గేదె అరుపు కీచుగా తగు స్థాయిలో ఉంటుంది.

గేదె మందకొడిగా వుండి, దగ్గరున్న పశువులను, మనుష్యులను కొంచెం బెదురుగా చూస్తుంది. ఎదలో ఉన్న గేదెను వెన్ను తట్టి అదిమితే నడుం వంచి వెన్ను విరుస్తుంది. 6. గేదె మానం నుండి స్రవించే ద్రవ స్వభావాన్ని బట్టి ఎద స్థితిని అంచనా వేయవచ్చు. ఎద తొలి దశలో స్రవించే తీగ ఎక్కువ పరిమాణంలో పలుచగా ఉంటుంది. ఎద గడిచిన కొద్ది పరిమాణం తగ్గి చిక్కగా అవుతుంది. ఎద చివరి దశలో, తీగల పరిమాణం బాగా తగ్గి, ఎక్కవ చిక్తుంది. కొన్ని పశువులకు గేదె తోకకు గాని, మానం పై గాని బంక తీగలు ఆరి పోయి మెరుస్తూ కన్పిస్తాయి. అలాంటప్పుడు గేదె ఎదలో వున్నట్లు భావించవచ్చు.

Also Read: Haemorrhagic Septicemia Disease in Buffalo: గేదెలలో వచ్చే గొంతువాపు వ్యాధి యాజమాన్యం

Silent Heat Detection in Buffaloes

Silent Heat Detection in Buffaloes

గేదెలలో అస్పష్టంగా మూగ ఎద లక్షణాలు గమనించడానికి పశుపోషకులు చాలా శ్రద్ధ చూపాలి. గేదెలను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 15-20 నిమిషాలు శ్రద్ధగా గమనించాలి. గేదెల ప్రవర్తనలో అసాధారణ మార్పును బట్టి ఎదను గుర్తించవచ్చు. గేదెలలో మూగ ఎదను గుర్తించుటకు అన్నింటికన్నా సులభమైన పద్ధతి. దున్నపోతును ఉపయోగించడం.

దున్నపోతు వీర్యనాళికను ఆపరేషన్ ద్వారా కత్తిరించిన దున్నలను టీజర్ అంటారు. ఇవి ఎదకు వచ్చిన పశువులను గుర్తించి దాటుతుంది. అయితే వీర్యాన్ని విసర్జించకపోవడం వల్ల చూలు కట్టవు. కేవలం ఎదలో వున్న గేదెలను గుర్తించుటకు ఉపయోగపడును. గేదెల ఎదను గుర్తించి వాటిని సకాలంలో చూలు కట్టించవచ్చు.

గేదెలు సాధారణంగా వేసవిలో ఎదకురావు. అయితే వాటికి చల్లని వాతావరణము కనిపించినట్లైతే వేసవిలో కూడ ఎదకు వచ్చే అవకాశం వుంది. ఈ సమయంలో గేదెలను రోజుకు రెండు మూడు సార్లు చల్లని నీటితో కడగాలి లేదా అవకాశం వున్న చోట నీటిలో ఈదించాలి. గేదెలకు వేసవిలో ఎక్కువగా పచ్చిమేత మేపాలి.

Also Read: Buffalo Farming in India: గేదెలలో పోషక యాజమాన్యం

Leave Your Comments

Soil and Irrigation Water Tests: భూసార, సాగునీటి పరీక్షలు.!

Previous article

Weeding in Wheat: గోధుమ పంటలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం.!

Next article

You may also like