Davanam Cultivation: ప్రపంచ దేశాలు అడవిని తల్లిగా భావిస్తారు. అడవి భద్రంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం అవుతుంది. అడవి లేనిదే వర్షపాతం లేదు. వర్షపాతం లేనిదే మానవ మనుగడ లేదు. నిజానికి మనిషికీ, మొక్కకూ ఉండేది పేగు బంధం లాంటిది. మనిషి పుట్టుక మరియు మరణం వరకు అనుక్షణం సుఖసంతోషాలతో ముడిపడి, ఎడతెగని బంధంగా నిలిచేది ప్రకృతే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఎడాపెడా అడవులు నరకడమంటే పుడమి తల్లికి కడుపు కోతను మిగల్చడమే.మానవాళి మనుగడకు అడవి చాలా ముఖ్యమైనది. నేటికీ అనేక మంది అడవులలో జీవనోపాధి కోసం జీవిస్తున్నారు.
Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!
దవనము 30 – 60 సెం.మీ ఎత్తువరకు పెరిగే సుగంధ మొక్క ఇది దక్శిణ భారతదేశంలో మాత్రమే పండింపబడుచున్నది. దీనిని శీతాకాలంలోనే సేద్యం చేసి పండిస్తారు. దీనిని పూలమాలలలోను, దీని ఆకులు పూవులనుండి లభించు సుగంధ తైలాన్ని ఆహార పరిశ్రమలలొను సుగంధ స్ప్రేలలోను వాడుతారు.
ఉపయోగాలు:
- నిత్యం పూలమాలలో ఎక్కువగా వాడతారు.
- సౌందర్య సాధనాలలో యితర ఔషదాల తయారీలో కూడా వాడాతారు.
- ఆహార పరిశ్రమలలో వివిధ సువాసనలు కల్గించు స్ప్రేలలో
- పొగాకు పరిశ్రమలో, దానికి సుగంధాన్ని కల్గించడానికి వాడుతారు.
- శీతల పానీయాలలో, కేకులలో సుగంధద్రవ్యాలలో
శక్తి వర్ధకంగా, ధాతువర్ధకంగా, చెవి నొప్పి, కీళ్లనొప్పులు, జీర్ణవ్యాదులలో దీనిని పుపయోగిస్తారు.
వాతావరణం:
ఎక్కువగా మంచుకురినే శీతాకాలపు వాతావరణం యీ పంటకు అనుకూలించదు.ఊష్ణ వాతావరణం యీ పంటకు అనుకూలిస్తుంది. పూలదండలకై ఎప్పుడైనాసేద్యము చేయవచ్చును. కాని సుగంధ తైలానికై నవంబరు మాసంలో వేయడం మంచిది. నవంబరు నుండి ఫిబ్రవరి మాసం వరకు విత్తుకోవడానికి వాతావరణం అనుకూలం.
నర్సరీ: క్రొత్తగా సేకరించిన విత్తనంతో పంటను ప్రవర్ధనం చేస్తారు. ఎకరానికి 0.6 కిలోల విత్తనం అవసరమౌతుంది. విత్తేముందు 1 కిలో విత్తనాన్ని 3 గ్రాముల క్యాఫానుతో శుద్ధిచేసి విత్తుకోవాలి. విత్తనాన్ని 10 రెట్ల ఇసుకతో కలిపి నాలుగు గంటలు నీటిలో నానబెట్టి, తడివెన గోనెపెట్టలోగాని, దళసరి బట్టలోగాని మూటగట్టి 2,3 రోజులు మధ్య నీరు చల్లుతూ ఉండాలి. మొలక ప్రారంభించగానే 10*6 అడుగుల నారుబెడ్లపై 10 నుండి 12 కిలోల ఎరువు వేసుకొని నవంబరునెలలో చల్లుకోవాలి. క్రమంగా నీరిస్తుండాలి. 4 వారాల తదుపరి యూరియా ద్రావణాన్ని స్ప్రే చేసినట్లయితే నారుబాగుగా పెరుగుతుంది. 6 నుండి 8 వారాలలో 10-12 సెం.మీ. పెరిగి నాటడానికి సిద్ధమౌతుంది.
Also Read: Saffron Flowers: కుసుమ పువ్వులతో అధిక ఆదాయం.!