Damage Symptoms of Pests: చీడపురుగులు వాటి ఆహారము కొరకై మొక్కలను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గాయపరుస్థాయి. చీడపురుగులు మొక్కల ప్రతి భాగాన్ని అనగా వేళ్ళు, కాండం, బెరడు, కొమ్మలు, ఆకులు, మొగ్గలు, పువ్వులు మరియు పండ్లను ఆశించి నష్టపరస్థాయి.
వేరుపురుగులు:
కొన్ని రకాల లద్దె పురుగులు మొక్కల వేర్లను తిని కొన్ని రకాల శాభకాలు ( Nymphs ) మరియు ప్రౌడపురుగులు వెళ్ళనుండి రసాన్ని పీల్చి మొక్కలకు నష్టంను కలిగిస్థాయి .అందువల్ల మొక్కల ఎదుగుదల తగ్గుట లేక మొక్కలు పిలకలు తొడగక పోవుటము లేదా పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎండిపోవటం జరుగుతుంది.
ఉదా: చెద పురుగులు, వరివేరు ముక్కు పురుగు, జొన్న, రాగి, వేరుశనగల నాశించే వేరుపురుగు (Root Grub) అపరాల వేరు బుడిపెలను ఆశించు పురుగు.
కాండం తొలచు పురుగులు:
లద్దె పురుగులు కాండం లేక పిలకలలోనికి ప్రవేశించి లోపలి భాగంలను తిని గాయపరుస్థాయి. అందువలన గాయపడిన భాగం కాండం నుండి వేరు పరచబడు తుంది. తత్ఫలితంగా గాయపడిన భాగం వడలి ఎండిపోతాయి. ఆ లక్షణాలనే మువ్వు ఎండటం / మొవ్వు చావటము / తెల్లకంకి / విసనకర్ర (Bunchy top) అంటారు.
ఉదా: వరి, చిరుధాన్యాలు, చెఱకు, వంగ, కాండం తొలుచు పురుగులు.
Also Read: Wild Brinjal Pests: అడవి వంకాయ తెగుళ్ల యాజమాన్యం
కొమ్మ తొలచు పురుగులు:
లద్దె పురుగులు లేత కొమ్మలను ఆశించి మొక్కల ఎదుగుదల దశలో కొమ్మలోనికి ప్రవేశించి నష్ట పరుస్థాయి. దీని వలన లేత కొమ్మలు వాడి వంగి తదుపరి ఎండిపో తాయి.
ఉదా: వంగ, బెండ, ప్రత్తి, ఆముదం, కొమ్మతొలుచు పురుగులు, జొన్నను ఆశించు ఈగ, మినుమును ఆశించు కాండపు ఈగ.
చెట్టు తొలుచు పురుగులు:
లద్దె పురుగు చెట్టు కాండం లోనికి లోతుగా ప్రవేశించి వంకర టింకరగా దారులను చేసి లోపలి కణాలను తిని వే స్థాయి. తత్ఫలితంగా పోషక పదార్థంలు మరియు నీరు చెట్టు మొదలు నుండి చెట్టు పై భాగంనకు చేరకుండా అరికట్ట బడుతుంది. దానివల్ల చెట్ల ఆకులు పసుపు పచ్చగా మారి వాడిపోవటం,కొమ్మలు ఎండి పోవటం మరియు చెట్టు పూర్తిగా ఎండిపోవటం జరుగుతుంది. కొన్ని సమయం లో పురుగులు ఆశించిన చెట్టు కాండం నుండి జిగురు లాంటి పదార్థం వెలుపలికి వస్తుంది.
ఉదా: మామిడి, జీడిమామిడి ఆశించు చెట్టు తొలుచు పురుగులు, కొబ్బరిని ఆశించు ఎర్రముక్కు పురుగు.
బెరడును ఆశించు పురుగులు:
అద్దె పురుగులు కొమ్మల సందులలో బెరడు క్రింద చిన్న దారులను ఏర్పరుచుకుని సిల్కు దారంలతో గూడును ఏర్పరుచుకొని బెరడును తొలచుకొని తిoటాయి.
ఉదా: నిమ్మ, మామిడి, జామ మొక్కల బెరడును ఆశించు పురుగులు.
కణతలను ఏర్పరచు పురుగులు:
లద్దె పురుగులు కాండం ,ఆకు పూలమొగ్గలను ఆశించి తినుట వలన ఆశించినభాగంలో భాగంలో ఎక్కువగా కణములు అభివృద్ధి చెందుతుంది. అందువలన మొక్కల సాధారణ వృద్ధికుంటు పడుతుంది. తత్ఫలితంగా మొక్కలు ఎక్కువగా పిలకలు తొడగటం, ఉల్లి కాండం లాగా పొడవుగా పెరగటం, కాండం / ఆకు మొగ్గల మీద కణుతులు ఏర్పడటం జరుగుతుంది.
ఉదా: వరి, ఉల్లికోడు, పొగాకు కాండం పురుగు, ప్రత్తి కాండం, ముక్కు పురుగు, మామిడి మరియు మిరప నాశించు పురుగులు ( Inflorescence Midge).
ఆకు ముడత పురుగులు:
లద్దె పురుగులు ఆకులను చివరినుండి మొదలుకు లేదా పొడవుగా గాని అంచులను సన్నని ఊలు దారంతో మడచి లోపలినుండి ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తిని వేస్థాయి.
ఉదా: వరి నాము, ప్రత్తి, ఆకు ముడత పురుగు
Also Read: Pomegranate: దానిమ్మలో పీల్చే పురుగుల నివారణ