Farmer Success Story: నా తోటి అమ్మాయిలు అబ్బాయిలు సైకిళ్లపై కాలేజీలకు వెళ్తుంటే నేను ఇంటింటికీ తిరుగుతూ పాలు అమ్ముతుండేదాన్ని. అలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు రోజుకు 450 లీటర్ల పాలు అమ్మే స్థాయికి ఎదిగాం అంటున్నారు శ్రద్ధ. చిన్న వయసులో పాడిపరిశ్రమ రంగంలోకి ప్రవేశించి, సక్సెస్ సాధించి ఆదర్శంగా నిలుస్తున్న శ్రద్ధ గురించి, తన పాడి పరిశ్రమ గురించి తెలుసుకుందాం.
శ్రద్ధ ఢవణ్… మహారాష్ట్రలోని నీగోజ్ గ్రామంలో ఈమె ఓ పాడి పరిశ్రమను నడుపుతున్నారు. శ్రద్ధ తండ్రి వికలాంగుడు కావడం, ఆమె తోబుట్టువులు అందరూ శ్రద్ధ కన్నా చిన్నవారు కావడంతో కుటుంబ భారాన్ని, పాడి పరిశ్రమ బాధ్యతను శ్రద్ధ తీసుకుంది.18 ఏళ్ళ ప్రాయం నుంచే శ్రద్ధ పాడిపరిశ్రమలో అడుగుపెట్టారు.
శ్రద్ధ మాట్లాడుతూ… నా జీవితంలో పాడిపరిశ్రమ అనేది ప్రత్యేకమైన పని. నాన్న సహాయంతో నేను కూడా ఈ పనిలో దిగాను. నేను రోజు ట్రక్కుల మీద పాలు పోస్తూ ఉంటాను. సాధారణంగా ఇలాంటి ట్రక్కులను అమ్మాయిలు నడపరు. మోటారు సైకిల్ పై పాలను తీసుకెళ్తున్న సమయంలో జనాలు నన్ను వింతగా చూసేవారు. నాతోటి అమ్మాయిలు సైకిల్ పై కాలేజీలకు వెళ్తుంటే నేను ఇంటింటికి తిరుగుతూ పాలు అమ్ముతుండేదాన్ని. నెమ్మదిగా ఈ పనికి అలవాటు పడ్డాను. కానీ ఇప్పుడు అందరు నన్ను చూసి మెచ్చుకుంటున్నారు. కొందరు నన్ను ఆదర్శంగా కూడా తీసుకుంటున్నారు అంటున్నారు శ్రద్ధ.
Also Read: వ్యవసాయ ఉత్పత్తికి గ్రీన్ హౌస్ టెక్నాలజీ
ప్రస్తుతం శ్రద్ధ పాడి వ్యాపారంపై పట్టు సాధించారు. రెండు అంతస్తుల భవనంలో పాడి పరిశ్రమను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆ తరహా ప్రయోగం ఎవరూ చేయలేదు. నాన్నతో కలిసి పనిచేసి పాడి పరిశ్రమలో అనుభవం సంపాదించాను. మా పాడి కేంద్రంలో 75 గేదెలున్నాయి. రోజు దాదాపుగా 450 లీటర్ల పాలను అమ్ముతాము. అయితే కుటుంబ సహకారం వల్లే ఇదంతా సాధ్యమైంది. మా కుటుంబలో అందరం కలిసి పని చేస్తాం. పాలతో వచ్చిన ఆదాయంతో ఈ పాడి కేంద్రాన్ని నిర్మించాము. మొదట్లో మాకు సరైన వసతులు లేనందును చాలా కష్టాలు పడేవాళ్ళము. నేను కాలేజీకి వెళ్తూనే, తమ్ముడు స్కూల్ కి వెళ్తూనే పాడి పరిశ్రమను చేసుకునేవాళ్లం. నాన్న వికలాంగుడు అయినప్పటికీ గేదెల పాలు పితికే సమయంలో ఎంతో సాయం చేసేవారు. అమ్మ , నాన్న, నేను, అందరం కలిసి మా పాడి పరిశ్రమను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నామని చెప్పారు శ్రద్ధ.
శ్రద్ధ..పై చదువుల కోసం నగరాలకు వెళ్లకుండా కుటుంబంతో పాటే ఉంటూ పాడిపరిశ్రమను విస్తరించాలని అనుకున్నారు. అందుకే స్థానిక కాలేజీలోనే బిఎస్సి పూర్తి చేశారు. శ్రీ ముల్కదేవి కాలేజీలో ఆమె విద్యను అభ్యసించారు. చివరిగా శ్రద్ధ తన తోటి అమ్మాయిలకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలి. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి అంటున్నారు శ్రద్ధ.
Also Read: 10వ తరగతి డ్రాపౌట్ కానీ పద్మశ్రీ !