Quality Milk – పాల యొక్క రుచి మరియు వాసన:- పాల యొక్క సహజమైన రుచి మరియు వాసన అనేది ఆ పాల యొక్క షుగర్ మరియు క్రొవ్వు మీద ఆధారపడి ఉంటుంది. పాలను అపరిశుభ్రమైన వాతావరణంలో కనుక తీసినట్లైతే పాల యొక్క వాసన మరియు రుచి మారిపోతుంది.
పాల యొక్క రంగు:- సాధరణంగా పాలు తెల్లగా ఉంటాయి. పాలల్లో ఉండే ఘన పదార్థాలు కాంతిని పరావర్తనం చేయడం వలన తెల్లగా కనిపిస్థాయి. పశువు ఈనిన తర్వాత పాలు కొద్దిగా పసుపు రంగులో ఉంటాయి. ఈ పసుపు రంగు కెరోటిన్ అను వర్ణకo ద్వారా వస్తుంది.
పాల యొక్క సాంద్రత:- పాలు యొక్క సాంద్రత నీటి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆవు పాలలో ఇది 108 నుండి 1.08 వరకు, గేదె పాలలో ఇది 1.030-1.032 వరకు ఉంటుంది.
పాలు మరుగు స్థానం:- పాల యొక్క మరుగు స్థానం సుమారు 100.2 డిగ్రీల నుండి 101 డిగ్రీల వరకు ఉంటుంది. సరాసరిన ఇది 100.5 డిగ్రీలు ఉండవచ్చు.
పాలు గడ్డ కట్టు స్థానం:- పాలు నీటి కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టుతుంది. ఆవు మరియు గేదె పాలలో ఫ్రీజింగ్ పాయింట్ సుమారు 0.535 నుండి 0.55 డిగ్రీల వరకు ఉంటుంది.
Also Read: Quality Milk Production: నాణ్యమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
పాల యొక్క తలతన్యత:- పాలలోని కణాల మధ్య ఉండు బంధకాలను తగ్గించుటకు కావలసిన శక్తిని పాల యొక్క తలతన్యత అని అంటారు. పాలల్లో సరాసరి తలతున్యత 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 54.5 డైయిస్/సెంటీమీటర్ ఉంటుంది.
పాల యొక్క విస్కాసిటి:- పాల యొక్క విస్కాసిటీ సుమారు 1.5 నుండి 2 సెంటిపాయిస్ వరకు ఉంటుంది. పాల యొక్క విస్కాసిటి నీటి యొక్క విస్కాసిటి కన్నా ఎక్కువ.
పాల యొక్క గాఢత:- స్వచ్చమైన పాల యొక్క గాఢత 6.4 నుండి 6.8 వరకు ఉంటుంది. ఇది కొద్దిగా క్షారం వైపు ఉంటుంది. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం సహజంగా చాలా తక్కువ పరిమాణంలో 0.14 -0.20 ఉంటుంది.
పాల యొక్క ఆమ్ల మరియు క్షార గుణం:- అప్పుడే తీసిన పాలు క్షార లేదా ఆమ్ల గుణం కాని లేక ఆంఫోటెరిక్ గా కాని ఉంటాయి. కాని మనం ఏదైన క్షారంతో కనుక టైట్రేషన్ చేసిన యెడల, అది కొద్దిగా ఆమ్ల గుణంను చూపుతాయి. దీనినే న్యాచురల్ లేదా అపరెంట్ అసిడిటీ అని అంటారు. ఇది పాలలోని కేసిన్,ఆసిడ్ పాస్పిటేజెస్, సిట్రేట్స్ వంటి వాటి వలన కలుగు తుంది. ఇది పశువు యొక్క జాతి, రకం, పాల దిగుబడి కాలం మరియు పొదుగు యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.
పాలలో సాలిడ్ నాట్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే నేచురల్ లేదా అపరెంట్ అసిడిటి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆవు పాలలో సాధారణంగా 0.13-0.14 శాతం, గేదె పాలలో 0.14-0.15 శాతం వరకు ఉంటుంది. డెవలప్ అసిడిటీ లేదా రియల్ అసిడిటీ అనేది పాలలోని బ్యాక్టీరియాలు లాక్టోజ్ తో చర్య జరిపి, లాక్టిక్ ఆమ్లం తయారు చేయుట వలన ఏర్పడుతుంది. నిలువ ఉంచిన పాల యొక్క టైట్రబుల్ అసిడిటీ అనేది పాలలోని నాచురల్ మరియు డెవలప్ అసిడిటీల యొక్క సగటు మీద ఆధారపడి ఉంటుంది.
జున్ను పాలు:- పాడి పశువులు ఈనిన తరువాత వచ్చే మొట్టమొదటి పాలను జున్ను పాలు అని అంటారు. ఈ జున్ను పాలు కొంచెం పసుపు రంగులో ఉంటాయి.
Also Read: Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు