Rubber Price: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి దెబ్బతినడంతో రబ్బరు ధర కిలో రూ.200కి చేరుకోనుంది. గతంలో రబ్బరు ధర రూ.191 ఉండగా ప్రస్తుతం రూ.200కు చేరుకోనుంది.
ధర పెరగడానికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి.
- భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి దెబ్బతినడంతో మార్కెట్లో రబ్బరు లభ్యత తగ్గింది.
- రబ్బరు ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉన్న దేశాల్లో ఇది ఆఫ్-సీజన్. దీంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ లభ్యత పడిపోయింది
- రబ్బరు ప్రధాన మార్కెట్ అయిన బ్యాంకాక్‌లో ఇప్పుడు ధర రూ.150. కాబట్టి దిగుమతి లాభదాయకం కాదు
- రబ్బరు రబ్బరు పాలు రూ.190-195 పలుకుతుండడంతో ప్రజలు రబ్బరు షీట్ల తయారీకి ఆసక్తి చూపడం లేదు.
ఇక ఇప్పటికే రిజర్వ్ స్టాక్‌ను తయారీకి వినియోగించుకోవడంతో పారిశ్రామికవేత్తలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని భర్తీ చేయడంతో పాటు, ఉత్పత్తి కోసం మరిన్ని కొనుగోలును ప్రారంభించనున్నారు. అయితే లభ్యత పెరిగినా, ధర మాత్రం తగ్గే అవకాశం లేదని చెప్తున్నారు నిపుణులు.
Also Read: రంగు రంగుల క్యాలీఫ్లవర్ పంటల సాగు..లాభదాయకం
కాగా.. రబ్బరు తయారు విధానం చూస్తే.. రబ్బరు చెట్ల నుంచి సేకరించిన పాలను ప్రొసెసింగ్ యూనిట్లకు తీసుకువస్తారు. అక్కడ రెండు లీటర్లు నీళ్ళు, రెండు లీటర్లు పాలు కలిపి ఒక ట్రేలో వేస్తారు. అంతకుముందే 5 లీటర్ల నీళ్ళలో 50 మిల్లీలీటర్ల ఫార్మిక్ యాసిడ్‌ను కలిపి ఒక ట్రేలో ఉంచుతారు. అందులో 200 నుంచి 250 మిల్లీలీటర్ల ఫార్మిక్ యాసిడ్ కలిపిన నీళ్ళను పాలలో కలుపుతారు. ఒక రోజంతా ఆ ట్రేలోనే ఉంచుతారు. తెల్లవారేసరికి పెరుగులా తోడుకుంటుంది. ఒక తెల్లటి షీట్ వస్తుంది. దాన్ని మిషన్‌లో రోలింగ్ చేస్తారు. తరువాత ఒకరోజు ఆరబెడతారు. ఆ షీట్‌ను నాలుగు రోజుల పాటు స్మోక్ హౌస్‌లో పెడతారు. తరువాత అది తేనె కలర్లోకి మారుతుంది. షీట్‌ను వేరు చేసి మార్కెట్‌కు తరలిస్తారు. దాన్ని ఫ్యాక్టరీ వారు కొనుక్కొని రబ్బరు వస్తువులు తయారు చేస్తారు. దీన్ని సియట్, ఎంఆర్ఎఫ్ వంటి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
Also Read: బెండ సాగులో మెళుకువలు..