Milk Factory Raided: వినియోగ దారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలు అందించాలి. కానీ ఈ రోజుల్లో మార్కెట్‌లో దొరికే పాలల్లో స్వచ్ఛత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతుంటారు. మరికొంతమంది రసాయనాలతో కృత్రిమ పాలను కూడా తయారు చేస్తున్నారు.

Milk Factory Raided
పేరుకి పవిత్ర డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్. కానీ లోపలంతా విషమే. అవును.. కల్తీ పాలు, పెరుగు, పన్నీరు.. ఇలా అన్నింటిని కెమికల్స్‌తో తయారు చేస్తూ ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు. అమూల్, హెరిటేజ్, గోవర్ధన్ లాంటి కంపెనీల స్టిక్కర్లు అంటించి మార్కెట్‌లో మాయచేస్తున్నారు. వివరాలు చూస్తే.. తెలంగాణలోని పటాన్‌చెరు పోలీసులు నగర శివార్లలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని పాల ఫ్యాక్టరీపై దాడి చేసి కల్తీ పాల ఉత్పత్తులను కనుగొన్నారు. ప్రధానంగా పెరుగు మరియు చీజ్ (పనీర్)ను స్వాధీనం చేసుకున్నారు. పటాన్‌చెరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమ్‌రెడ్డి మాట్లాడుతూ..ఫ్యాక్టరీ యాజమాన్యం పాలు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, కెమికల్స్ కలిపి పెరుగు తయారు చేస్తున్నట్టు అయన తెలిపారు.

Milk Factory
ఫ్యాక్టరీలో దాదాపు 50 టాప్ బ్రాండ్ ఉత్పత్తులను ఉపయోగించిన పెరుగుతో నింపిన బకెట్లు చూసి ఆశ్చర్యపడ్డాము. వారు దానిని హోటళ్లకు, ఓల్డ్ సిటీకి సరఫరా చేస్తున్నట్టు అధికారి చెప్పారు. ప్రతిరోజు 1,000 కిలోల నుంచి 5,000 కిలోల పెరుగు సరఫరా చేస్తారు. వారు ఉపయోగించే పాలపొడి కూడా బ్రాండెడ్ కాదు అని ఆయన పేర్కొన్నారు. మేము సోదాలు చేయగా పాలు, పెరుగు, కోవా స్వీట్, పనీర్ గురించాము. ఇక నెయ్యి. మెజారిటీ ఉత్పత్తులు మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని చెప్పారు భీమ్‌రెడ్డి.
Also Read: కలోంజీ పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

Milk Factory Products
గ్రేటర్ హైదరాబాద్‌లో పాల ఉత్పత్తుల వివరాలు:
నగర జనాభా: కోటికి పైగా
రోజువారీ పాల అమ్మకాలు: 25 లక్షల లీటర్లు
సహకార, ప్రైవేటు పాల బ్రాండ్లు: 57 అంచనా
సహకార డెయిరీలు విక్రయిస్తున్న పాలు: 7 లక్షల లీటర్లు
ప్రైవేటు డెయిరీలు విక్రయిస్తున్నవి: 18 లక్షల లీటర్లు
లీటర్ పాల ప్యాకెట్ ధర: రూ.40 నుంచి రూ.54 (పాలలో కొవ్వు శాతాన్ని బట్టి)
పాలలో కలుపుతున్న రసాయనాలు: సోడా (నిల్వ ఉండేందుకు), హైడ్రోజన్ పెరాక్సైడ్ (దుర్వాసన రాకుండా ఉండేందుకు)
పాల ప్యాకెట్లలో ఎప్పుడూ బయటపడుతున్న బ్యాక్టీరియా: సాల్మొనెల్లా, ఈ–కోలి (వీటితో ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు, యూరియా ఆనవాళ్లతో మెదడుకు హాని వంటి సమస్యలు)
Also Read: పాలకోవా తయారు చేసే విధానం