Home Made Palakova: పాలకోవా ఇది ఇష్టపడని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పాలకోవా అంటే చాలా ఇష్టం. అయితే మనం పాలకోవాను ఎక్కడో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే, క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. పాలకోవా తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం మన ఇంట్లో వున్న పదార్ధాలతో చాలా రుచికరమైన పాలకోవా తయారు చేసుకోవచ్చు.ఎక్కువ ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో వుండే వస్తువులతోనే పాలకోవా తయారు చేసుకోవచ్చు.అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
Also Read: పాలిచ్చే ఆవులలో సంరక్షణ మరియు నిర్వహణ
పాలకోవా తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలు:
గట్టిపడిన పాలు – 200గ్రాములు
పాలపొడి – 3/4వ
కప్పి నెయ్యి – ½
చెంచా ఏలకుల పొడి -1
చెంచా న్యూట్
మెగ్ పొడి – చిటికెడు
కుంకుమపువ్వు రేకులు -3-4
పాలకోవా తయారు చేసే విధానం: కొంచెం వేడిచేసిన పెనంలో నెయ్యి వేసుకుని అందులో పాలపొడి, గట్టిపాలను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని 2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి కలిపి బాగా కలిపి పక్కల నుంచి పొంగేవరకూ ఉడకనిచ్చుకోవాలి. తర్వాత 5-10నిమిషాలు చల్లబడనిచ్చి కుంకుమరేకులను మిక్స్ చేసుకోవాలి. తర్వాత చేతితో ముద్దలా బాగా కలిపి చిన్న చిన్న బంతుల్లా చేసుకుని వాటిని చేతి మధ్య వత్తి పేడాలలాగా చేయండి. కోవాలమీద మీ బొటనవేలి గుర్తు డిజైన్ లాగా చేసుకుంటే నోరూరించే పాలకోవా రెడీ అయిపోయినట్టే.
Also Read: పాలకూర సాగులో మెళుకువలు