పాలవెల్లువ

Dodla Dairy: శ్రీకృష్ణ మిల్క్ ను కొనుగోలు చేసిన దొడ్ల డెయిరీ లిమిటెడ్

1
dodla dairy

Dodla Dairy: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దొడ్ల డెయిరీ మిల్క్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎన్నో కుటుంబాలు దొడ్ల డెయిరీ లిమిటెడ్ మిల్క్ నే వినియోగిస్తున్నాయి. అయితే తాజాగా దొడ్ల డెయిరీ లిమిటెడ్ మరో ముందడుగేసింది. దొడ్ల డెయిరీ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన శ్రీకృష్ణ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీ కృష్ణ మిల్క్స్ మార్చి 1989లో స్థాపించబడింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో మొదటి ప్రైవేట్ రంగ డెయిరీ కంపెనీ. అయితే కంపెనీ వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో ఈ కొనుగోలు జరిగింది.

Srikrishna Milk

Srikrishna Milk

Also Read: వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు

పాల సేకరణ, తయారీ మరియు పాల ఉత్పత్తుల విక్రయాలలో ప్రధానంగా పాలుపంచుకున్న శ్రీకృష్ణా మిల్క్స్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 67.27 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది, 2019-20లో రూ.76.27 కోట్లు కాగా దీని విలువ రూ.90.20 కోట్లకు తగ్గిందని దొడ్ల డెయిరీ నివేదించింది. దొడ్ల డెయిరీ కొనుగోలు ఒప్పందం తేదీ పూర్తి కావడానికి సుమారు రెండు నెలల సమయం పడుతుందని కూడా పేర్కొంది.

Dodla Dairy

Dodla Dairy

దొడ్ల డెయిరీ లిమిటెడ్ అనేది భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, దాని రిజిస్టర్డ్ మరియు కార్పొరేట్ కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. సంస్థ 1995లో స్థాపించబడింది మరియు 1997లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీని సేకరణ ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ఉత్పత్తులు 11 రాష్ట్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొత్తం 94 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి.

Also Read: ఉల్లి పంటలో త్రిప్స్‌ దాడి – సస్యరక్షణ

Leave Your Comments

Muskmelon Health Benefits: వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు

Previous article

Smart Farming Data: వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ‘స్మార్ట్ ఫార్మింగ్ డేటా’

Next article

You may also like