పాలవెల్లువ

Dairy Farming: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పై దృష్టి పెడితే.. పాల వెల్లువ.!

2
Dairy Farming
Dairy Farming

Dairy Farming: వ్యవసాయం పై పూర్తిగా ఆధారపడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నష్టం వాటిల్లుతోందన్న నేపథ్యంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పై దృష్టి పెడితే ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ, వాతావరణ పరిస్థితుల్లో పాడి పరిశ్రమ రైతులకు అండగా నిలుస్తుంది. పాడి పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయం తో పోలిస్తే నష్టాలు తక్కువేనని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి నెల ఆదాయం వస్తుందని భరోసా పాడి రైతులకు కలుగుతోంది. అంతేకాకుండా పాల ద్వారా వచ్చే వెన్న, నెయ్యి తో కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ నేపథ్యంలో పలువురు యువ రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువుల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు.

పాలతో నెలవారీగా డబ్బులు

వ్యవసాయం తో నష్టపోయిన పలువురు రైతులు పాడి పశువుల పెంపకాన్ని ఉపాధి మార్గం గా ఎంచుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలలో పాడి పశువుల యూనిట్లను మంజూరు చేస్తుండటంతో పలువురు రైతులు దీనిని ఉపాధిగా మలుచుకున్నారు. పాల విక్రయంతో రోజువారీగా, వారం, పక్షం, నెలవారీగా డబ్బులు పొందుతున్నారు. అంతేకాకుండా తమ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా నిలుస్తోందని పాడి రైతులు అంటున్నారు. అదే వ్యవసాయంలో అయితే పంటలు వచ్చిన తర్వాత రేటును బట్టి అమ్ముకునే వరకు ఎదురు చూడాలి. కానీ ఈ రంగానికి కొంచెం కష్టపడితే చాలు రోజువారీ ఆదాయం వస్తుంది.

Also Read: Goat Farming: తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రాబడి..

Milk a cow by hand

Dairy Farming

వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను చేపడితే మనకు వచ్చే ఆదాయం సాగు ఖర్చులకు ఉపయోగపడతాయి. తక్కువ నీటితో పశుగ్రాసం కూడా సాగు చేయవచ్చు. పాలతో పాటు వాటి ఉత్పత్తులు విక్రయించడం తో అదనపు ఆదాయం పొందవచ్చు. పశువుల పేడ, మూత్రాన్ని ఎరువుగా విక్రయించి వాటితో కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఇన్ని రకాలుగా పాడి పరిశ్రమతో మనకు లాభాలున్నాయి. ఈ పరిశ్రమకు నిరుద్యొగులు తోడు అయితే వారికి మంచి ఆదాయ వనరుగా మారుతోంది.

గడ్డి భూములు పరిశ్రమకు ముఖ్యమైనవి

ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం యునైటెడ్ స్టేట్స్ , చైనా మరియు న్యూజిలాండ్‌తో సహా అనేక దేశాలలో పాడి పరిశ్రమలు ముఖ్యమైన పాల ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులుగా పనిచేస్తున్నాయి. పాడి పశువులకు పచ్చిక సహజమైన మేత మరియు పచ్చిక బయళ్ల నుంచి అందిస్తుంది. గడ్డి భూముల పాడిపరిశ్రమకు ముఖ్యమైనవి. పాలు చాలా పాడైపోయే వస్తువు, ఇది రెండు గంటలలోపు 50 °F (10 °C) లేదా అంతకంటే తక్కువకు చల్లబడుతుంది. అది వినియోగదారునికి డెలివరీ అయ్యే వరకు ఆ ఉష్ణోగ్రత వద్ద తప్పనిసరిగా నిర్వహించబడాలి. ఈరంగంను ఎక్కువగా మహిళలు చేపడుతున్నారు. దీనిని మహిశలు ఉపాధి మార్గంగా మలుచుకున్నారు.

Also Read: National Bamboo Mission: 50 శాతం సబ్సిడీ..ఎకరానికి రూ.4 లక్షల ఆదాయం.!

Leave Your Comments

Goat Farming: తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రాబడి..

Previous article

Castor Farming: ఆముదపు పంటను సాగు చేసి రైతులు మంచి లాభాలు ఎలా పొందాలి.?

Next article

You may also like