Azolla: వ్యవసాయ అనుబంద రంగమైన పాడిపశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్ళు మరియు చేపలకు మేతగా అజోల్లాను అందించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలను పొందవచ్చును. దీనిని పచ్చిరొట్టగా, జీవన ఎరువులుగా మరియు పశువుల మేతగా దీనిని ఉపయోగిస్తారు. అజోల్లాను పశువుల మేతగా రావడానికి ముఖ్య కారణం దీనిలో మాంసకృత్తుల శాతం అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా దీనిలో దొరుకుతాయి. అంతేకాకుండా పశువులు పెరుగుదలకు ఉపయోగపడే కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు దీనిలో ఉంటాయి. ఎండబెట్టిన అజోల్లా లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. అజోల్లాను రోజు పశువులకు దాణాగా పెడితే పాల దిగుబడులు 20 శాతం పెరుగుతాయి. వేరుశనగకు బదులుగా ఈపోడిని వాడితే పాల ఉత్పత్తి మీద ఎటువంటి దుష్ప్రభావాలు చూపకుండా పాల నాణ్యతను వృద్ధి చెందుతాయి.
అధిక పాల ఉత్పత్తి ని పెంచడం
అజొల్లా పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత సూర్యకాంతి లభించే చెట్లు నీడలో ఉత్పత్తి ని చేపట్టాలి. గోతిలో నీటి మట్టం ఒకేలా ఉండేలా చూడాలి. పాడిరైతులు సాధారణంగా పశువుల మేత పైన ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక రేట్లు పెట్టి కొంటారు. అజొల్లాను నిల్వచేసుకొని ఇబ్బందకర పరిస్ధితులలో పాల దిగుబడులు తగ్గకుండా దీనిని ఉపయోగించవచ్చు. ఎండు గడ్డిని నిల్వ చేయడం కంటే సైలేజ్ రూపంలో పచ్చి గడ్డిని నిల్వచేయడం చాలా సులభం. పాడి పశువులకు సైలేజ్ తో ఆహారంగా అందిస్తే అధిక పాల ఉత్పత్తిని ఇవ్వడమే కాకుండా పశువులు ఆరోగ్యంగా ఉంటాయి.
Also Read: Crops Damage: భారీ వానలతో నీట మునిగిన పంటలు.!
హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో పశుగ్రాసం పెంపకం
వేల అవసరం లేకుండా కేవలం నీటితో విత్తనాలు మొలకెత్తించే మొక్కలను పెంచే సరికొత్త పద్ధతినే హైడ్రోఫోనిక్స్ అంటారు. ఈ పద్ధతిలో విత్తనాలు హరిత గృహాలలో, నియంత్రిత వాతావరణంలో కేవలం ఏడు రోజుల వ్యవధిలో మొలకెత్తి పశుగ్రాసంగా మారుతాయి. భూమి మరియు నీటి కొరత ఉన్నప్పుడు సాంప్రదాయ పశుగ్రాసాలు దొరకనప్పుడు పాడి పశువులకు వచ్చి మరి అందించేందుకు హైడ్రోపోనిక్స్ విధానం ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. కానీ పశువుల దాణా కి బదులుగా, సాంప్రదాయ పశుగ్రాసాలకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం వాడటం లాభసాటి కాదు, తక్కువ పాడి పశువుల ఉన్న రైతులు చౌకగా హరిత గృహాలను నిర్మించుకొని హైడ్రోపోనిక్ పశుగ్రాసం సాగు చేసుకుని లాభ పడవచ్చు కానీ అధిక పశువులున్న రైతులు హైటక్ హరిత గృహాలలో హైడ్రోపోనిక్ పశుగ్రాసం పెంచడం లాభదాయకమని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పాడి రైతులందరూ పశుగ్రాస లభ్యత, భూమి, నీరు, కూలీల ఆదా. పాల దిగుబడి పెరగడం, పశువులకు వాడి దాణా పరిమాణం తగ్గడం, హైడ్రోపోనిక్ పశుగ్రాస సాగుకు అయ్యే ఖర్చు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని లాభనష్టాలను బేరీజు చేసుకున్న తర్వాత హైడ్రోపోనిక్ పద్ధతిలో పశుగ్రాస సాగు చేపట్టాలి..
Also Read: Best Farmer Award: జమ్మికుంట రైతుకు బెస్ట్ ఫార్మర్ అవార్డు