మన వ్యవసాయం

Crossandra Harvesting: కనకాంబరం కోసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

0
Crossandra Harvesting
Crossandra Harvesting

Crossandra Harvesting: ఆకర్షణీయమైన రంగులతో తేలికగా, ఎక్కువ నిల్వ, శక్తి కలిగిన కనకాంబరం పూలను దక్షిణ భారత దేశంలో తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఇవి సంవత్సరం పొడవునా పూస్తూ ఆదాయాన్ని ఇస్తాయి. వాసన లేకున్నా పలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే ఈ పూలను ఎక్కువగా పూజ సమయంలో దండలు, పూల జడ తయారీల్లో, స్త్రీ శిరోజాంకరణకు విరివిగా వాడతారు.

Crossandra Harvesting

Crossandra Harvesting

ఉద్యానవనాల్లో రాకరీలలోనూ, బార్డర్లలోను పెంచేందుకు ఉపయోగపడతాయి. దీన్ని మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు. కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మార్కెట్‌లో ఎక్కువ ధర పలకడంతోపాటు పూల సాగుచేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తుండడం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు.

Also Read: Water Management in Marigold: బంతి లో నీటి యాజమాన్య పద్ధతులు.!

రకాల ఎంపిక:

కనకాంబరంలో నారింజ, గులాబి, ఎరుపు, పసుపు రంగు రకాలేకాక రెండు రంగు కల గలిపిన నీలి, తెలుపు రకాలు కూడా సాగులో ఉన్నాయి. ఆరెంజ్‌క్రోసాండ్రో ముదురు నారింజ రంగు పూలు ‘‘టిటియాఎల్లో’’ రకం పసుపు రంగు పూలు, సెబకాలిస్‌ రెడ్‌ ఎరుపు రంగు పూలు, లక్ష్మీ రకం నారింజ రకం పూలు పూస్తాయి.

వాతావరణం:

అధిక తేమ, వేడి కల్గిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయడానికి అనుకూలము. ముఖ్యంగా కోస్తా జిల్లాల సాగు చేయుటకు అనువైనవి. పెరుగుదలకు 300 సెం. ఉష్ణోగ్రత చాలా అనుకూలము. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూలు దిగుబడి అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలో పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.

కోత:

నాటిన 2-3 నెలల తర్వాత కనకాంబరం పుష్పిస్తుంది. కనకాంబరం పువ్వులు స్పైక్ బేస్ నుండి వరుసగా తెరుచుకుంటాయి. పుష్పం పూర్తిగా తెరవడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. కాబట్టి పూలను ప్రత్యామ్నాయ రోజులలో తెల్లవారుజామున కోయడం జరుగుతుంది. స్పైక్ యొక్క పొడవుపై ఆధారపడి, ఒక స్పైక్‌లో పుష్పించడం పూర్తి చేయడానికి దాదాపు 15–25 రోజులు పడుతుంది.

పుష్పగుచ్ఛము నుండి బయటకు తీయడం ద్వారా పుష్పం తీయడం జరుగుతుంది. కొన్ని మొక్కలలో మొగ్గల దశ లోను పూలు కోస్తారు.స్థానిక మార్కెట్ కోసం పూలను గుడ్డ లేదా పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేస్తారు. కనకాంబరం పువ్వులు చాలా తేలికగా ఉంటాయి. సగటున ఒక కిలోకు 15,000 పూలు తూగుతాయి.

Also Read: Storage of Cabbage: క్యాబేజీ నిల్వలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Leave Your Comments

Sugar Beet Nutrient Management: షుగర్ బీట్ పంటలో పోషక యాజమాన్యం

Previous article

Water Management in Marigold: బంతి లో నీటి యాజమాన్య పద్ధతులు.!

Next article

You may also like