కాయ కుళ్ళు తెగులు:
కారకం: ఈ వ్యాధి కొల్లెటోట్రైకమ్ క్యాప్సిన్ అను శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది.
లక్షణాలు: ఈ శిలీంధ్రం గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సామాన్యంగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో లేత కొమ్మలకు మరియు పుష్పాలకు ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు మొదట పుష్పాలకు ఆశించి క్రమంగా కాండం కొమ్మలకు వ్యాపించును. కొమ్మల బెరడు పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడును. ఈ మచ్చలు పెద్దవైన తరువాత మచ్చల మధ్య భాగంలో శిలీంధ్ర బీజాలు వలయాలుగా ఉండును.
Also Read: Phytophthora Blight in Chilli: మిరప పంట లో నారు కుళ్ళుతెగులు యాజమాన్యం.!
తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి క్రిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినపుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడును. తర్వాత కాయలు కుళ్ళి వాడిపోవును. ఈ శిలీంధ్రం ప్రధాన కాండం పై ఆశించి వేరు కాండం పై కూడా వ్యాపించును. వేరు భాగంలో కూడా కాండం పై ఏర్పడునటువంటి మచ్చలు ఏర్పడి మొక్కలు కృశించి చనిపోవును. ఈ విలీంద్రం విత్తనాలలోను నేలలోను మరియు ఇతర మొక్కలపై కూడా వ్యాపించును.
నివారణ:
పొలాన్ని శుభ్రంగా దున్ని మొదట్టును తీసివేయాలి.
కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టస్ / మాంకోజెట్ తో విత్తన శుద్ధి చేయాలి.
ఆరోగ్యవంతమైన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించాలి.
ప్రోపికొనజోల్ 2 మి.లీ. డైఫెన్ కొనజోల్ మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పూత సమయంలో కాయలు పండు బారే సమయంలో పిచికారి చేయాలి.
బూడిద తెగులు:
కారకం: ఈ వ్యాధి లెవెల్యుల టారిక అను శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది.
లక్షణాలు:
ఈ తెగులు ఎక్కువగా నవంబర్ మరియు మార్చి మాసాల మధ్యలో మిరప పైరుకు ఎక్కువగా ఆశిస్తుంది. మొదట మొక్కల క్రింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడును. క్రమేపీ ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి పైకి కూడా విస్తరించును. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగు గా మారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులు సోకటం వలన పూత విపరీతంగా రాలిపోవును మరియు మొక్కలలో పుష్పించే శక్తి క్షీనిస్తుంది. చల్లని పొడి వాతావరణం ఈ వ్యాధి వృద్ధికి అనువైనది.
నివారణ: దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3%, కేరాథెన్ 0.1% మందును పిచికారి చేయాలి.
బాక్టీరియా ఆకు మచ్చ తెగులు:
కారకం: ఈ వ్యాధి జాంతోమొనాస్ కాంపెస్టిస్ ఎసికటోరియా అనే బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది.
లక్షణాలు: ఆకుల పై చిన్న చిన్న గుండ్రని లేదా ఆకృతి లేని నీటితో తడిపినటువంటి మచ్చలు ఆకు అడుగు భాగాన ఏర్పడును. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులో నుండి ఊదా రంగులోనికి మారి మచ్చల మధ్యలో నల్లగా ఉండును. ఈ మచ్చల మధ్యలో గుంతగా ఉండి ఉబ్బి ఉండును. తర్వాత ఈ ఉబ్బిన భాగము గరుకుగా మారును. మచ్చల చుట్టూ చిన్న పసుపు పచ్చని వలయం ఉంటుంది. మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోవును. కొన్నిసార్లు ఆకు తొడిమ మరియు లేత కొమ్మలపై కూడా ఈ వ్యాధి వ్యాపించును. పచ్చి కాయల పై నీటిలో తడిపినటువంటి మచ్చలు కూడా ఏర్పడును. ఈ వ్యాధి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. మరియు పంట అవశేషాల్లో కూడా జీవిస్తుంది. ఉష్ణోగ్రత 22-34 సెం.గ్రే. ఉండి గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు జూలై నుండి సెప్టెంబర్ మాసాల వరకు ఎక్కువగా వస్తుంది.
నివారణ: ఫాంటోమైసిస్ లేక స్ట్రెప్టోసైక్లిస్ 200 మందును ఏదైనా రాగి ధాతువు కల్గిన శిలీంద్ర నాశిని 0.25% కలిపి రెండు లేక మూడు సార్లు పిచికారి చేయవలెను.
Also Read: Chilli cultivation: మిరప పంటకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం