చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Cotton Cultivation: పత్తి పంటలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం

0
Cotton Cultivation
Cotton Cultivation

Cotton Cultivation: రాష్ట్రంలో పండించే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైన పంట. పత్తిలో సుమారుగా 10 రకాల పురుగులు మన రాష్ట్రంలో పైరును ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, పిండినల్లి, ఇవి పత్తి ఆకుల నుండి రసాన్ని పీల్చడం ద్వారా పంటకు అపారమైన నష్టాన్ని కలుగచేస్తున్నాయి. ఈ పురుగులను నియంత్రించడానికి రసాయన మందులు విచక్షణా రహితంగా ఉపయోగించడం వలన పంట దిగుబడి తక్కువ కావడమే కాకుండా, పురుగు ఉధృతి ప్రారంభంలో తగ్గిన తర్వాత ఉధృతి రెట్టింపు అవుతుంది. దీనివలన పంట అధిక నష్టానికి గురి అవుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పురుగుల యాజమాన్యాన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం వలన పురుగుల ఉధృతి తగ్గటమే కాకుండా, పంటకు అయ్యే ఖర్చు కూడా తగ్గించుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను పొందవచ్చు.

Cotton Cultivation

Cotton Cultivation

  • పచ్చ దీపపు పురుగులు మరియు తెల్లదోమ తట్టుకొనే రకాలను సాగుచేయాలి. 2. తెల్లదోమ ఆశించని జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంట పైర్లతో 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.
  • నత్రజని ఎరువుల వాడకాన్ని క్రమబద్ధం చేసి అవసరమైన మోతాదులో మాత్రమే వాడాలి.
  • కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి ఇమిడాక్లోపిడ్ 5 గ్రా॥ లేదా థయోమిథాక్సామ్ 6 గ్రా॥ కలిపి విత్తనశుద్ధి చేసిన
  • యెదల 30-40 రోజుల వరకు రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. 5. కిలో విత్తనానికి పై విధంగా 40-80 గ్రా॥ కార్బోసల్ఫాస్ తో శుద్ధి చేసి విత్తితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది.

Also Read: పశుగ్రాసం ఉత్పత్తి చేయడానికి కంబాలా యంత్రం బాగా ఉపయోగపడుతుంది

  • మోనోక్రోటోఫాస్ లేదా మిథైల్ డెమటాన్ మరియు నీరు మిశ్రమాన్ని 1 4 నిష్పత్తిలో గాని లేదా ఇమిడాక్లోపిడ్ మరియు నీరు1 20 నిష్పత్తిలోగాని కలిపిన ద్రావణాన్ని 20,40, 60 రోజులలో మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తే రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి.
  • ఈ పద్ధతి వలన పురుగు మందుల వాడకం తగ్గడం, ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఈ పద్ధతిని కాండంపై బొట్టు పెట్టుట అంటారు.
  • తెల్లదోమకు ఆశ్రయమిచ్చే తుత్తుర బెండ, కామంచి, అంగి మిరియాలు వంటి కలుపు మొక్కలను పొలాల గట్ల మీద లేకుండావకాలంలో నిర్మూలించాలి.
  • తెల్లదోమ మరియు పచ్చదోమలు పసుపు రంగుకు ఆకర్షించ బడతాయి. అందుచేత పొలంలో అక్కడక్కడ ఆముదం పూసిన పసుపురంగు డబ్బాలను ఎరగా పెట్టాలి.
  • అవసరాన్ని బట్టి 1 లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 2ml లేదా మిథైల్ డెమటాన్ 2 ml లేదా అసిటామిప్రిడ్ ఫ్రైడ్) 2 గ్రా॥ పొడిమందు 1 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ప్రత్యేక సూచనలు :

  • ఇమిడాక్లోపడ్తో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను విత్తటానికి ముందు నీటిలో నానబెట్టరాదు.
  • రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలోనే ఎక్కువ సార్లు పురుగు మందులు పిచికారి చేయరాదు.
  • తెల్లదోమ ఆశించినపుడు సింథటిక్ పైరిత్రాయిడ్లు (ప్రైవర్ మెత్రిన్, ఆల్ఫా మెత్రిన్, డెకా మెర్రిన్) పురుగు మందుల వాడకం వెంటనే ఆపాలి. 4. తెల్లదోమ అదుపులో ఉంచటానికి లీటరు నీటికి ట్రైజోఫాస్ (హోస్టాథియాన్) 2 ml లేదా ప్రొఫెనోఫాస్ (క్యురాక్రాన్)
  • 5 ml మరియు వేప నూనె (NSKE) 5 ml కలిపి ఆకుల అడుగు భాగం భాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Also Read: ప్రసిద్ధ పత్తి రకాలు

Leave Your Comments

Varieties of Chilies: మెరుగైన మిర్చి రకాలు

Previous article

PM Kisan KYC: రైతులందరూ e-KYC త్వరగా పూర్తి చేయండి

Next article

You may also like