Coriander ఆంధ్రప్రదేశ్ లో పండించబడే విత్తన సుగంద ద్రవ్యాల పంటల్లో ధనియాలు ముఖ్యమైనది. చల్లని వాతావరణంతోబాటు తక్కువ ఉష్ణోగ్రత తగినంత మంచు అనుకూలం.
నేలలు : వర్షాధారం కింద నల్లరేగడి భూములు, నీటి వసతి కింద గరప నేలలు, ఎర్రనేలలు మరియు ఇతర తేలిక పాటి భూములు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల, క్షార లక్షణాలు గల భూములు పనికి రావు.
విత్తే కాలం : అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు, నీటి సదుపాయం వున్నచోట నవంబరు నెలాఖరు వరకు విత్తుకోవచ్చు.
కొత్తిమీర ఆకు కొరకు :ధనియాలను ఆకుకోసం సంవత్సరం అంతాసాగు చేసుకోవచ్చును. అయితే వేసవిలో కొత్తిమీర కొరకు చెట్టు నీడలో కాని, తాటాకు పందిరి కిందకాని షేడ్ నెట్ క్రిందకాని నీటి వసతికల ప్రాంతంలో సాగుచేసుకోవచ్చును.
నేల తయారి, విత్తటం :మెత్తటి పదును వచ్చే వరకు 3-4 సార్లు దుక్కిదున్నాలి. అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోపు నేలలోని తేమను బట్టి విత్తుకోవాలి.
సాలుకు సాలుకు 30 సెం.మీ., మొక్కకు మొక్కకు 10 సెం.మీ. ఎడం వుండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి.
విత్తనాలను బద్దలుచేసి విత్తితే విత్తనం ఆదా అవటమేకాకుండా, మొలక కూడా 2 – 3 రోజులు ముందుగా వస్తుంది. విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి, ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది.
నేల తయారి, విత్తటం :ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం (బెయోఫర్టిలైజర్)ఎకరానికి 600 గ్రా.మోతాదు చొప్పున విత్తనానికి కలిపి శుద్ధి చేసినట్లయితే, దిగుబడి పది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతుంది.
ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాల సాగు చేయరాదు. తప్పని సరిగా చేయవలసి వస్తే, 2 – 3 సంవత్సరాలు పంట మార్పిడి చేసి ఉండాలి. వేసవిలో లోతు దుక్కి దున్నుకోవడం వలన తెగులును కలుగజేసే శిలీంధ్రాన్ని నేలలో అదుపు చేయవచ్చు.
విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి, ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది.
అలాగే ఒక గ్రా. కార్బండైజిమ్ న ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా కూడా తెగులు రాకుండా కాపాడవచ్చు. బయోఫర్టిలైజర్ మరియు శిలీంద్ర నాశనులతో విత్తనశుద్ధి చేయవలసినపుడు శిలీంద్రనాశనితో రెండు మూడు రోజుల ముందు విత్తనశుద్ధి చేయాలి. బయోఫర్టిలైజర్ తో మాత్రం విత్తే ముందే విత్తనశుద్ధి చేయాలి.