నేలల పరిరక్షణమన వ్యవసాయం

C:N Ratio Importance: మొక్కల పెరుగుదల లో కర్బన నత్రజని నిష్పత్తి పాత్ర.!

0
C:N Ratio Importance
C:N Ratio Importance

C:N Ratio Importance: పైరుకి కావలసిన అన్ని రకాల పోషకాలు కొంత పరిమాణములో నేలలో సహజంగానే ఉంటాయి ఇది తయారై పైర్లకులభ్యం కావడం అనేది నేల భౌతిక రసాయనిక లక్షణాలు సూక్ష్మజీవుల చర్య వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వీటిలో ఎంతో తేడాలు ఉంటే అవకాశం ఉంది. ఇవి ఎంత వరకు లభ్యమౌతునయో వేయదలిచిన పైరుకు ఎంత తక్కువ పడుతుందో నిర్దారించి ఎరువులు వాడాలి. పోషకాల సమతుల్యత పాటించడానికి రసాయనిక ఎరువులు సక్రమ వినియోగానికి భూసార పరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నెలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకోవచ్చు. వేసిన పంటకు నెలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్షల ద్వారా తక్కువగా ఉన్న పోషకాలను మాత్రమే నెలకు అందించడం వలన మంచి దిగుబడులు సాధించ డమే కాక నేలకు అందించే పోషకాలు కూడా బాగా తగ్గుతుంది.

C:N Ratio Importance

C:N Ratio Importance

Also Read: Citrus Gummosis Managment: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!

కర్బన నత్రజని నిష్పత్తి (C:N RATIO)

  • మొక్కల పెరుగుదలకు పంట పండడానికి కర్బనము, ఉదజని, ప్రాణ వాయువులతో బాటు నత్రజని ముఖ్య పోషకాహారము.
  • నేలలో సేంద్రియ పదార్ధము (humus) మొక్కలకు కావలసిన నత్రజనిని క్రమంగా అందిస్తుంది. కనుక నేలల్లో గల సేంద్రియ పదార్ధము, నత్రజనికి గల సంబంధము చాల ముఖ్యమైనది.
  • . హ్యూమస్ లో గల వివిధ పదార్థాలను బట్టి దానిలో కర్బన నత్రజని నిష్పత్తి సాధారణం 10:1 నుండి 12:1 వరకూ ఉంటుంది.
  • నేలలో సేంద్రియ పదార్ధము వేసిన వెంటనే కర్బనము పెరిగి CIN నిష్పత్తి చాలా ఎక్కువగా ఉండును. (100:1)
  • తగినంత ఆహార లభ్యత వల్ల సూక్ష్మ జీవుల సంఖ్యా అత్యధికం గా పెరిగి సేంద్రియ పదార్ధం కుళ్ళే ప్రక్రియ పూర్తవగానే కర్బన పరిమాణం తగ్గడం వల్ల సూక్ష్మ జీవుల సంఖ్య కూడా తగ్గును..
  • ఆహారం లేనందువల్ల, మరియు సూక్ష్మ జీవుల జీవిత చక్రం ముగియడం వల్ల సూక్ష్మ జీవుల దేహాలు కూడా విచ్చిన్నమై హ్యూమస్ లో భాగమవుతుంది.
C:N Ratio

C:N Ratio

  • మొదట్లో 100:1 CEN నిష్పత్తి గల సేంద్రియ పదార్థం పూర్తిగా చివకడం వల్ల “హ్యూమన్ ” గా మారేసరికి నిష్పత్తి 10:1 కి తగ్గుతుంది.
  • ఈ నిష్పత్తి ఎక్కువగా ఉన్నపుడు సూక్ష్మ జీవులు అత్యధిక సంఖ్య లో పెరగడం వల్ల భూమిలో గల నత్రజనిని వాటి శరీర నిర్మాణానికి ఉపయోగించుకోవడం వల్ల మొక్కలకు కావలసినంత నత్రజని లభించక మొక్కలలో ఎదుగుదల తగ్గును.
  • నిష్పత్తి తక్కువ అవగానే (10:1) పోషకాలు విడుదలై (mineralization) మొక్క కు అందజేయబడతాయి.
  • C:N నిష్పత్తి < 20:1 ఉన్నపుడు పోషకాల విడుదల జరుగుతుంది. జరుగుతుంది >30:1 ఉన్నపుడు పోషకాల స్థిరీకరణ
  • నేలలో సేంద్రియ నిల్వలు పెంచడానికి వివిధ రకాలైన మొక్కల, జంతువుల, మానవుల విసర్జనలు, అవశేషాలను నేలలో వేసి కలియ దున్నాలి. వీటిలో C:N నిష్పత్తి ని బట్టి పోషకాల లభ్యత ఆధారపడి ఉంటుంది.
  • సేంద్రియ పదార్దాలు వేగవంతం గా / నెమ్మదిగా కుళ్ళే ప్రక్రియ C: N నిష్పత్తి మరియు ఉష్ణోగ్రత లపై ఆధారపడి
  • మొక్కల పోషకాల నిఖర లభ్యత నిర్ధారించునది ఈ నిష్పత్తే (ఉదా: పప్పు జాతి పంటలు, ధాన్య జాతి పంటలు)
  • నత్రజని, భాస్వరం, గంధకం, వంటి పోషకాలు అందుబాటును C: N నిష్పత్తి నిర్ధారిస్తుంది.

Also Read: Farm Yard Manure: పశువుల ఎరువులతో పంటకు మేలు

Leave Your Comments

Weed Management in Direct Seeded Paddy: నేరుగా విత్తిన వరి పొలంలో కలుపు యాజమాన్యం.!

Previous article

Nutrient Management in Mango: మామిడి పంట లో ఎరువుల యాజమాన్యం.!

Next article

You may also like