Citrus Leaf Miner: ఈ పురుగు AP లో డిశంబర్ నుండి జనవరి, జూన్ నుండి జూలై, సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలలో బత్తాయి, నిమ్మ తోటలలో లేత చిగురు వచ్చే సమయంలో ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది లేత ఆకులను మాత్రమే ఆశిస్తుంది.
గుర్తింపు చిహ్నాలు:
రెక్కల పురుగులు తెలుపు వర్ణంలో ఉండి ముందు జత రెక్కల పైన ఊదారంగు చారలుంటాయి.
ఈ లద్దెపురుగు గులాబి రంగులో ఉంటుంది.
గాయపర్చు విధానం మరియు గాయం లక్షణాలు:
పిల్లపురుగులు ఆకు రెండు పొరలలోనికి తొలుచుకునిపోయి వంకరటింకరగా సొరంగాలు చేస్తుంది.
ఈ సొరంగాలు ఉన్నచోట తళతళ మెరుస్తున్న ఎండిపోయి నటువంటి సన్నని గీతలు కనిపిస్తాయి.
ఈ పురుగు ద్వారా గజ్జితెగులు వ్యాపిస్తుంది.
ఈ పురుగు ఉదృతంగా వ్యాపించినప్పుడు ఆకులన్ని ముడతపడి ఎక్కువ గజ్జితెగులు వచ్చి తొందరగా రాలిపోతాయి.
యాజమాన్య పద్ధతులు:
పురుగు ఆశించిన భాగాలను కత్తిరించి తగుల బెట్టాలి.
వేపగింజల కషాయాన్ని 5% కొత్త చిగుళ్ళు వచ్చే సమయంలో కొట్టవలెను.
1.5 మి॥లీ॥ మోనోక్రోటోఫాస్ 2మి॥లీ॥ డై మిథోయేట్ 2మి॥లీ॥ ప్రొఫెనోఫాస్ 1మి॥ ॥ ఫెన్వల్ట్ లేత చిగురు వచ్చేటప్పుడు ఒకసారితరువాత వారం రోజులకు రెండవసారి పిచికారి చేయాలి.
బెరడు తొలుచు పురుగు
గుర్తింపు చిహ్నాలు:
ఈ పురుగులు అన్ని చెట్లను ఆశిస్తుంది.
పిల్ల పురుగులు లేత గోధుమరంగులో ఉండి ఎర్రని తల కలిగి ఉండును.
రెక్కల పురుగు మధ్యస్థ పరిమాణంలో ఉండి లేత గోధుమరంగులో ఉండి, అడ్డంగా చారలుండును.
గాయపర్చు విధానం మరియు గాయం లక్షణాలు:
కాండంపై పొరల బెరడులో ఈ పురుగు లోపలి ప్రవేశించి అక్కడ తింటూ పెరుగుతుంటాయి.
జాయింట్ల దగ్గర ఎక్కువ రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తుంటాయి.
బెరడును తినడం వల్ల కాండంపైన గీతలు కనిపిస్తుంటాయి.
ఈ పురుగులు తినడంవల్ల అవి విసర్జించే మలము, లాలాజలం కలిసి గీతలపై తుట్టెలు తుట్టెలుగా ఏర్పడి పిల్లపురుగులకు కవచంలా రక్షణ కల్పిస్తుంటాయి.
పురుగు తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు ఆశించిన భాగం అంతా ఎండిపోయి కాండం దెబ్బతింటుంది.
ఈ పురుగు ఉదృతి అక్టోబర్, నవంబర్ మాసాలలో ఎక్కువగా ఉండును.
నివారణ:
బెరడును మరియు కాండాన్ని గమనిస్తూ పురుగు ఉనికిని కనుక్కొని అందులో నుండి పిల్లపురుగులును ఇనుప కడ్డీతో తీసేసి చంపేయాలి.
రంధ్రం దగ్గర ఉన్న మలం తీసేసి డైక్లోరోవోస్, పెట్రోల్, డీజిల్తో అద్దిన దూదితో అద్దె ముంచేయాలి. అంతేకాకుండా అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను వేసి బంకమట్టితో రంధ్రాన్ని మూయాలి.
Also Read: Citrus Crop Protection: నిమ్మలో సీతాకోక చిలుక మరియు చెదలు పురుగు నివారణ చర్యలు.!