Citronella Cultivation: భారతదేశములో సిట్రోనెల్లా తైలానికి అత్యధిక డిమాండున్నది. దీనినే జావా సిట్రోనెల్లా అంటారు. సిట్రోనెల్లా రెండురకాలుగా కనిపిస్తుంది. సిలోను సిట్రోనెల్లా, జావా సిట్రోనెల్లా, వీనిలో జావా సిట్రోనెల్లాలో ఆల్కహాలు ఎక్కువ శాతము నుండి ఎక్కువ డిమాండు కలిగువున్నది. ఈ రెండు జాతులు కూడా సిలో నుండి వచ్చినవే. సిలోను సిట్రోనెల్లా నుండి అభివృద్ధి చేయబడిన రకమే ఈ జావాసిట్రోనెల్లా, ప్రస్తుతము ఇండియా, తైవాన్, గ్వాటిమాలా, పాండూరాస్, మలేషియా, బ్రెజిల్ మొద లైన దేశాలలో సేద్యము చేయబడుతుంది. ఈ పంటను నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్సిస్టూట్, లక్నోవారు మొదట మనదేశంలో ప్రవేశపెట్టారు. జువాసిట్రోనెల్లా సుగంధ తైలాన్నిచ్చు బహువార్షిక గడ్డిజాతికి చెందిన మొక్క.
ఉపయోగాలు:
తైలాన్ని అనేక పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా సబ్బులకు సువాసనలను కలిగించడానికి, దోమలు పారద్రోలే క్రీములలో, సువాసన ద్రవ్యములలో ఎక్కువగా వాడతారు. అత్తరులలోను, కాస్మెటిక్స్ లోను దీనిని ప్రధానంగా వాడతారు. భవిష్యత్తులో ఈ తైలానికి ప్రపంచ మార్కెట్లొ మంచి డిమాండు పెరుగుతుంది.
సిట్రోనెల్లా దాదాపు అన్ని రకాలైన భూములలో పెరుగుతుంది. ముఖ్యంగా సారవంతమైన ఇసుక ప్పొరలుగల మెత్తటి భూములలో ఎక్కువగా పెరుగుతుంది. పి.హెచ్. 5.8 నుండి 8.0 వరకు గల భూములలో ఇది పెరుగు శక్తి ఉన్నప్పటికి .పి.హెచ్.6.0 గల భూములు యోగ్యమైనవి. సముద్రపు మట్టానికి 1000 నుండి 1500 మీటర్ల ఎత్తువరకు గల భూములలో ఇది పెరుగుతుంది.
ఎరువులు:
4 టన్సుల బాగుగా చివికిన పశువుల ఎరువును ఒక ఎకరం భూమిలో వేసుకోవాలి. రసాయనిక ఎరువులను 80 కిలోల నత్రజని, 32 కిలోల సూపర్ ఫాస్పేట్, 16 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను ఎకరంలో కలుపు తీసి వేసుకోవాలి.
సిట్రోనెల్లా వేయదలచిన భూమిని తొలకరికి ముందే ఒకసారి లోతుగా, మెత్తగా దున్నుకొని ఎరువులను చల్లుకోవాలి. తిరిగి బాగుగా కలియదున్నుకొని నాట్లకు ముందు రసాయనిక ఎరువులను వేసుకోవాలి. బెడ్డుగాని, నాగటితో సాళ్లుగాని తోలుకొని తయారుచేసుకోవాలి. 2 అడుగుల అంతరంతో సాళ్లు తోలుకోవాలి.
Also Read: Aloe vera Cultivation: కలబంద సాగులో మెళుకువలు.!
సిట్రోనెల్లా నాటు:
సిట్రోనెల్లా నాటు వేయటానికి మే-జూన్ మాసాలు అనుకూలం. జులై తరువాత వేసిన నాటులో ఎక్కువగా మొక్కలు చనిపోయే అవకాశం ఉంన్నది. 2*2 అడుగుల అంతరంతో మొక్కలను నాగటి సాలుగడ్డలపై నాటుకోవడం మంచిది. వర్శాకాలం ప్రారంభం కనుక నీరు సాళ్లలో నిలిచే ప్రమాదముoది. వెంటనే నీరు కట్టాలి.
నీరు యొక్క ఆవశ్యకత:
సిట్రానెల్లా నాటిన తరువాత ఒక నెలవరకు వారానికి రెండుసార్లు, నీరు కట్టాలి. ఆ తరువాత 8 – 10 రోజులకొకసారి నీరు కడితే సరిపోతుంది. సాధారణంగా పరాకాలంలో నీటి అవసరం ఉండదు.
పైరు నాటిన తరువాత ఒకటి రెండుసార్లు కలుపు తప్పని సరిగా తీయాలి. వైరు దుబ్బులు కట్టిన తరువాత కలుపు రావడానికి అవకాశం ఉండదు. పంట వేర్లు తేలినట్లైతే మట్టిని ఎగదోయాలి. నత్రజనిని రెండు మూడు సార్లు వేయాలి. పంట కోత తరువాత కలుపు లేకుండా చేసుకోవాలి. పువ్వులను తీసివేయాలి.
దిగుబడి ఆదాయం:
ఎకరానికి సంవత్సరానికి 8000 కిలోల పంటమిర్చి, 0, 8 శాతము తైలం కలిగివుండి సగటున 50 కిలోల తైలము దిగుబడి వస్తుంది. మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే సంవత్సరానికి 10,000 నుండి 13,000 కిలోల అధికదిగుబడి వచ్చి 80 నుండి 100 కిలోల తైలము లభిస్తుంది.
Also Read: Citronella: సిరుల- సిట్రోనెల్ల