చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

మిరపలో పూతను ఆశించు తామర పురుగులు – యాజమాన్య పద్దతులు

0

1) సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. మిరప పరిశోధనా స్థానం సిఫారసు చేసిన ఎరువుల మోతాదు (120 : 24: 48) కేజీల నత్రజని, భాస్వరం : పోటాష్ ఎరువులను వేసుకోవాలి. అంటే 260 కేజీల యూరియా , 150 కేజీల భాస్వరం మరియు 48 కేజీల మ్యూరెట్ ఆఫ్ పోటాష్ రూపంలో ఇవ్వాలి.

2) 150 కేజీల భాస్వరం చివరి దుక్కిలో వేసుకోవాలి.

3) నత్రజని మరియు పోటాష్ ఎరువులను పంట కాలంలో 5 దఫాలుగా వేసుకోవాలి.

4) ఈ పురుగు యొక్క కోశస్థ దశలు భూమిలో వుంటాయి. కాబట్టి ఎకరానికి 200 కేజీల వేప చెక్క వేసుకోని చివరి దుక్కిలో కలియదున్నాలి.

5) చివరి దుక్కిలో వేసుకునే అవకాశం లేనట్లయితే పై పాటుగా చల్లుకోవాలి.

6) పురుగు ఉదృతి ఎక్కు వగా గమనించిన పొలంలో నత్రజని ఎరువులను సిఫారసుకు మించి వాడరాదు.

7) పంట మార్పిడి చేయాలి

chilli cultivation

chilli cultivation

8) పచ్చి రొట్ట పైరును వేసి భూమిలో కలియదున్నాలి.

9) తెలుపు రంగు, నీలి రంగు మరియు పసుపు రంగు జిగురు అట్టలను 20 నుండి 30 పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగును ఆకర్షింపచేయవచ్చు.

10) వేప నూనె  (అజాడి రక్టిన్ 10, 000  పి. పి.యం) 1  మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

11) వేపనూనె 10,000 పి.పి.యం 1 మి.లీ లేదా వేప నూనె 15,000 పి.పి.యం/3000 పి.పి.యం 2  మి.లీ ఇతర మందులతో  కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా వేప నూనెను సిఫారసు చేసిన ఇతర మందులతో కలిపి పిచికారి చేయాలి.

12) సిఫారసు చేసిన పురుగు మందులు :

  • ఫిప్రో నిల్ 80 wG @ 40 గ్రా / ఎకరానికి
  • సమా  ట్రానిలిప్రోల్  40 % + ఇమిడా క్లోప్రిడ్ 40 గ్రా / ఎకరానికి )
  •  సమాం ట్రానిల్ పోల్ 10 గ్రా @ 240 మి.లీ ఎకరానికి

Also Read : వెంకయ్య…కేంద్రం వడ్లు తీసుకోమంటుంది ఏం చేద్దాం మరి!

స్పెరో టెట్రామాట్ :

13) పురుగు మందులను పిచికారి చేసుకునేటప్పుడు పూత లోపల కూడా తడిచేటట్లు మొక్క అడుగు భాగం నుండి పై వరకు తడిచేటట్లు పిచికారి చేయడం ద్వారా సిఫారసు చేసిన మందుల ద్వారా ఆ పురుగును సులువుగా నివారించవచ్చు.

14) పొద్దు తిరుగుడు పూల మొక్కలను పొలంలో అక్కడక్కడా ఈ పురుగుకు ఆకర్షక పంటగా వేసుకోవాలి.

15 ) మార్కెట్టులో లభించు బయో మందుల వినియోగాన్ని తగ్గించుకోవాలి.

chilli diseases

chilli diseases

16) ప్రస్తుతం ఈ పురుగు ఆశించిన పొలంలో రైతులు భయాందోళనలో విపరీతమైన మరియు విచక్షణా రహితంగా పురుగు మందులను కొట్టడం ద్వారా పురుగు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున సిఫారసు చేసిన పురుగు మందులను మాత్రమే వేప నూనెతో కలిపి పిచికారి చేయటం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చు.

17) ప్రస్తుతం రైతులు ఈ తామర పురుగులను ఎర్ర నల్లి గా భావించి, నల్లిని సంబంధించిన పురుగు మందులను కొట్టడం ద్వారా ఎలాంటి ఫలితము వుండదు.

18) అంతే కాకుండా మన ప్రభుత్వాలు మరియు విత్తన సంస్థలు దిగుమతుల విషయంలో మరియు విత్తన సంస్థలు దిగుమతుల విషయంలో మరియు ఒక విత్తనం మరియు మొక్కలను ఒక ప్రాంతం, నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది.

 

డా. కె .శిరీష, సీనియర్ శాస్త్ర వేత్త ( ఎంట మాలజీ ) లాం, గుంటూరు ఉద్యాన పరిశోధనా స్థానం

డా. ఆర్.ఎస్.కె. రెడ్డి, పరిశోధన సంచాలకులు, డా. వై.యస్.ఆర్.ఉద్యాన విశ్వ విద్యాలయం

 

Also Read : బోగస్ కంపెనీ చేతుల్లోకి రైతులు…

 

 

 

Leave Your Comments

బోగస్ కంపెనీ చేతుల్లోకి రైతులు…

Previous article

జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం…

Next article

You may also like