Fertilizers ఎరువుల సామర్ధ్యం పెంచ డానికి, ప్రతికిలో పోషక పదార్ధం నుండి గరిష్ట వ్యవసాయోత్పత్తి సాధించడానికి దిగువ తెలిపిన చర్యలు, సాగు పద్ధతులు దోహదం చేస్తాయి.
- ప్రాంతానికి అనువైనవి. వేసిన ఎరువులకు అత్యధికమైన ప్రతి ఫలం ఇవ్వగలిగే పంటలు, వంగడాలను ఎంపిక చేయాలి.
- దేశవాళీ రకాల కంటే అధిక దిగుబడి ఇచ్చే రకాలు రసాయనిక ఎరువులు వేయక పోయినా ఎక్కువ దిగుబడి ఇస్తాయి. రసాయన ఎరువులు చాలినంత వేసినప్పుడు, తక్కువ వేసినపుడు కూడా ప్రతి కిలో పోషక పదార్ధానికి ఎక్కువ ప్రతి ఫలం ఇస్తాయి. అందుచేత అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు పండించాలి.
- ఎరువుల నుండి పూర్తి ప్రతి ఫలం రావడానికి, ఆ ప్రాంతానికి తగిన సమయం లో విత్తడం లేక నాటు వేయడం చేయాలి.
- మొక్కల మధ్య దూరం, రకాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి మార్పు కోవాలి. ఉదా: ఖరీఫ్ లో వరి వరుసల మధ్య 15 సెం.మీ వరుసలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేటట్లు (చదరపు మీటరుకు 70 కుదుళ్ళు) నాటు కోవాలి. రబీ లో 10 సెం. మీ x 10 సెం.మీ ఎడంగా (చదరపు మీటరు కు 100 కుదుళ్ళు) ఉండేటట్లు నాటాలి.
- ఏ పంట పండించినా, ఏ నెలలోనైనా, ఏ కాలం లో చైనా సింద్రియ ఎరువు పొలానికి వేస్తే మినిరలైజేషన్ వల్ల అత్యధిక మోతాదుల్లో పోషకాలను తీసుకోవడమే కాకుండా అన్ని పోషకాలు సమతూకం లో లభిస్తాయి.
- భాస్వరపు ఎరువు వలన ప్రతి ఫలం ఖరీఫ్ లో కంటే రబీ లో ఎక్కువ గా ఉంటుంది. భూసార పరీక్ష ను అనుసరించి రబీలో భాస్వరపు ఎరువును వేయుట మంచిది.
- భూసార పరీక్ష తప్పక చేసుకోవాలి. దీనివల్ల పోషకాల లభ్యత ఎంత వున్నదీ తెలుస్తుంది. వాటిని ఆధారం గా చేసుకొని వేసుకోవలసిన రసాయన ఎరువుల మోతాదు లను నిర్ణయించు కోవాలి. ఒక పొలం లో ఒక సంవత్సరం వేసే పంట లు అన్నిటినీ దృష్టి లో పెట్టుకొని ఎరువులు సిఫారసు చేయాలి. అంటే గాని ఒక్కొక్క పంటకు వేరు వేరు గా ఎరువుల మోతాదు నిర్ణయించ కూడదు.
- మొత్తం భాస్వరాన్ని విత్తనం వేయక ముందు లేక నాట్లు వేయకముందు ఆఖరి దుక్కి లో వేసుకోవాలి. తేలిక నేలల లోనూ, పొటాషియం లోపం ఎక్కువగా వుండే నేలల్లోనూ, ఇసుక నేలల్లోనూ, చౌడు భూముల్లోనూ, వర్షపాతం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ, దీర్ఘకాలిక పంటలకు పొటాషియం రెండు దఫాలు గా వేయడం మంచిది. నత్రజనిని పంట కాలం లో వివిధ పెరుగుదల దశలలో పైరు అవసరాలు, నేలలో తేమను దృష్టి లో పెట్టుకొని 2-3 దఫాలు గా వేయాలి.
- I 10. భాస్వరపు ఎరువులను విత్తనం వరుసకు 2 x 5 సెం.మీ క్రింద విత్తనాలకు 5-6 సెం. మీ దూరం గా పడే టట్లు. వేయాలి. పొటాషియం ను భాస్వరపు ఎరువుతో పాటు ప్లేస్ మెంట్ పధ్ధతి లో వేయవచ్చును. రసాయన ఎరువులు తేమ ఉండే ప్రదేశం లో వేయాలి.
- యూరియా ఒక భాగం, తడి మట్టి 5-10 భాగాలు బాగా కలిపి 25 గంటల సేపు నిలువ చేసిన తర్వాత పైరు మీద – చల్లితే నత్రజని నష్టం తగ్గుతుంది.
Leave Your Comments