Soils in Andhra Pradesh: శిలలు, ఖనిజ పదార్దము, సేంద్రియ పదార్ధము లతో కూడిన మిశ్రమమే నేల. వివిధ వాతావరణ (ఉష్ణోగ్రత, వర్షపాతం) ప్రభావం వల్ల మాత్రు శిలలు విచ్చిన్నమై ఖనిజ పదార్ధం, సేంద్రియ పదార్ధాలుగా మార్పు చెంది సహజ, జల, వాయు, సూక్ష్మ జీవ రాశులను సంతరించుకుని భూమి పై ఏర్పడు సన్నని పొరను “నేల” అంటాము. ఈ సన్నని పొరను ఆధారంగా చేసుకొని పంటలు పండించుచున్నాము. ఈ పొర ఏర్పడడానికి వేల సంవత్సరాలు పడుతుంది. కనుక భూమి పై పొరను పరిరక్షించుకోవడం ప్రతి మానవుని కర్తవ్యం గా గుర్తించాలి.
Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!
ఎర్ర బంక నేలలు :
- 180 సెం.మీ కన్నా లోతైనవి
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, జిల్లా లలో ఉన్నాయి.
- మురుగు నీరు పోవు సౌకర్యం కల్పించాలి.
- సేంద్రియ ఎరువులు విరివిగా వాడాలి.
- ఆమ్ల గుణాన్ని మిగిల్చే రసాయన ఎరువులు వాడాలి.
- పసుపు, అల్లం, పొగాకు పైర్ల కు అనుకూలం
- మామిడి, జీడి మామిడి తోటలకు అనుకూలం
బొంత రాతి నేలలు:
- సాధారణంగా 45-90 సెం. మీ లోతు గల నేలలు.
- మెదక్, జహీరాబాద్, నారాయణ ఖేడ్ ప్రాంతం, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, నెల్లూరు-కావలి ప్రాంతాలు
- ఆమ్ల స్వభావం కలవి
- పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు నేలలో వేసి కలియ దున్నాలి.
- ముఖ్య పోషకాలు తగినంత వేయాలి.
చవిటి నేలలు:
- సాధారణం గా లోతైన, మధ్యస్థ నేలలు
- నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉన్నాయి.
- చౌడు లవణాలను బయటకు పంపాలి. దీని కోసం మంచి నాణ్యత గల నీరు ఉండాలి.
- మురుగు నీరు పోవు సౌకర్యం కలిగించాలి.
- నల్ల చౌడు కు జిప్సం వేయాలి.
- చౌడు భూములు బాగు చేసాక వరి పైరును మొదటిపంట గా పండించడం మంచిది.
- మామూలుగా వేసే రసాయన ఎరువుల కంటే 25% అధికం గా వేయాలి.
- సూక్ష్మ పోషక లోపాలను గమనిస్తూ సరిదిద్దాలి
- సేంద్రియ ఎరువులను విరివిగా వాడడం, మురుగు నీరు పోవు సౌకర్యం కల్పించడం
- చౌడు తట్టుకొనే రకాలు ఎంపిక చేయాలి.
లోతైన నల్ల రేగడి నేలలు:
- 120 సెం.మీ కన్నా లోతు కలవి
- కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, నెల్లూరు జిల్లాలలో కలవు.
- నీటిని పట్టి ఉంచే శక్తి అధికం
- మురుగు నీరు పోయే సమస్య ఎక్కువ
- భూమి గుల్ల బారడానికి సింద్రియ ఎరువులు అధికం గా వాడాలి.
- నీటిని పట్టి ఉంచే శక్తి అధికం
- మురుగు నీరు పోయే సమస్య ఎక్కువ
- భూమి గుల్ల బారడానికి సేంద్రియ ఎరువులు అధికం గా వాడాలి.
- భాస్వర లోపాన్ని సరిదిద్దాలి.
- నీటి వసతి తో పండించే పైర్లు అన్నింటికీ అనుకూలం
- మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం పట్ల శ్రద్ధ వహించాలి.
తీర ప్రాంత ఇసుక నేలలు:
- నిస్సారమైనవి. లోతైనవి, తేలికపాటివి, ఇసుకతో కూడుకొన్నవి.
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తీర ప్రాంతాలు.
- తేమను నిలుపుకొనే శక్తి చాలా తక్కువ
- ఎక్కువ తడులు పెట్టాలి.
- . స్ప్రింక్లర్లు డ్రిప్ పద్ధతుల ద్వారా నీరు పెట్టుట అనుకూలము
- మల్చింగ్ పాటించుట మంచిది.
- సేంద్రీయ ఎరువులు విరివిగా వాడాలి.
- వరి, పొగాకు వార్లను పెంచడానికి అనుకూలం
- కూరగాయలు, పూలతోటలు పెంచవచ్చు.
- జీడిమామిడి సరుగుడు తోటలకు అనుకూలము
డెల్టా ప్రాంతపు ఒండ్రు నేలలు:
- మంచి సారవంతమైన నేలలు
- లోతైన బరువైన నేలలు
- ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో నదీ ముఖ ద్వారానికి ఇరువైపులా ఉన్నాయి.
- మురుగు సౌకర్యం కల్పించాలి.
- పచ్చి రొట్ట ఎరువులు అధికం గా వాడాలి.
- ఆమ్ల గుణాన్ని మిగిల్చే రసాయన ఎరువులు వాడాలి.
- కొద్ది మోతాదు లలో జిప్సం వాడితే నీరు చొరబడే గుణం పెరుగుతుంది.
- వరి, పసుపు, చెరకు, అరటి, మిరప, కూరగాయలు, మొక్కజొన్న, ప్రత్తి మొదలైన పంటలు పండించవచ్చు.
ఎర్ర ఇసుక నేలలు :
- మీ లోతు కలిగినవి.
- తేలిక లేక మధ్యస్థ నేలలు
- రంగారెడ్డి, మెదక్,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో ఉన్నాయి.
- వీటిని మూడు ఏళ్ల కు ఒకసారి లోతుగా దుక్కి చేయాలి. దీనివల్ల నేలలో నీటిని నిలుపు కొనే శక్తి పెరుగుతుంది.
- నాణ్యత గల ఒండ్రు మట్టిని పొలానికి తోలడం మంచిది.
- జొన్న, సజ్జ, కంది, ఆముదాలు, వేరుశనగ (వర్షాధారంగా)
- వరి (నీటి ఆధరవు మీద)
Also Read: Mango Cultivation: మామిడిలో నేల తయారీ మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!