Characteristics of Domestic Cows:
హల్లికార్ జాతి ఆవులు:- ఈ జాతి ఆవులు విజయనగరపు కాలం నందు అభివృద్ధి చెంది, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ జాతి పశువులు ఉన్నాయి. ఇటి శరీరం మధ్యరకంగా ఉండి, పటిష్టంగా ఉంటాయి. ఈ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమనగా తల మరియు కొమ్ములు చాలా పదునుగా ఉంటాయి.
Also Read: Bacillary Haemoglobinurea in Cows: పశువులలో వచ్చే భాసిల్లరీ హిమోగ్లోబిన్యూరియా వ్యాధి లక్షణాలు.!
గంగడోలు మధ్యస్థంగా అభివృద్ధి చెంది ఉండును. వీటి యొక్క శరీరం ముందరి భాగము బలమైన కాళ్ళు దళసరి గిట్టలతో మంచి పని చేయు శక్తిని కలిగి ఉంటాయి. వీటి శరీరపు రంగు తెలుపు, గ్రే లేదా డార్క్ గ్రే రంగులో ఉండును. ఈ జాతి పశువులు ప్రపంచంలోనే బాగా పని చేయు సామర్థ్యం కలిగి యుంటాయి. ఈ జాతిని టిప్పు సుల్తాన్ యుద్ధ భూమిలో పరికరాలు రవాణా చేయుటకు ఉపయోగించారని, చరిత్ర ఆధారాలు కలవు. పాల దిగుబడి చాలా తక్కువ. ఇవి ఒక పాడి కాలంలో ఇవి సుమారు 1300 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తాయి.
అమృత మహల్ జాతి ఆవులు:- ఈ జాతి యొక్క స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. వీటి యొక్క జాతి కృష్ణా, కావేరి నదుల మధ్యన విస్తరించి యున్నది. వీటి శరీర వర్ణం గ్రే రంగులో ఉండి, తల, మెడ గంగడోలు డార్క్ కలర్లో యుంటాయి. ఈ జాతి పశువుల్లో తల భాగం పెద్దదిగా ఉండి, గంగడోలు పలుచగా ఉంటుంది. ఈ జాతి పశువులు హల్లికార్ జాతి పశువులను పాలి యుంటాయి. ఇవి మంచి పని చేయు సామర్థ్యం గల జాతి. పాల దిగుబడిచాలా తక్కువ.
కంగాయమ్ జాతి ఆవులు:- ఇది తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరు జిల్లాలో గల ధర్మపురం తాలుకాకు చెందిన జాతి. ఇవి మైసూర్ జాతి ఆవులను పోలి యుంటుంది. వీటి కొమ్ములు బలంగా ఉండి, కొనలు మొనదేలి ఉంటాయి. శరీరం పొడవుగా ఉండి, మెడ చిన్నదిగా, బలంగా ఉంటుంది. మూపురం మధ్యస్థంగా ఉండి, గంగడోలు చిన్నదిగా ఉంటుంది. ఇవి గ్రే, డార్క్ గ్రే లేదా నలుపు రంగులో ఉంటాయి. ఆవులలో ఫెటాక్ జాయింట్ కి పైన తెలుపు, నలుపు చారలుండును. ఇది ఈ జాతి ప్రత్యేక లక్షణం.
ఉత్పాదక లక్షణములు:- ఇవి 3.5 సంవత్సరాల వయస్సులో మొదటి సారి ఎదకు వస్తాయి. ఒక పాడి కాలంలో 600-700 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఎద్దులు మంచి పని చేయు సామర్ధ్యం కలిగి యుంటాయి.
మాల్వి జాతి ఆవులు:- మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మాల్వా ప్రాంతానికి చెందిన జాతి. వీటిలో రెండు రకాలు కలవు.
1. అగార్ రకం – ఇవి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉంది.
2. మాన్దా సార్ ఆఫ్ భుఫాల్ రకం – ఇవి మహారాష్ట్రా రాష్ట్రంలోని భుపాల్ ప్రాంతానికి చెందినది.
Also Read: Murrah Buffalo: ముర్రా జాతి గేదెలను ప్రోత్సహించాలి