మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

Castor Farming Techniques: ఆముదం సాగు యాజమాన్య పద్దతులు

1
Castor Plant
Castor Plant

Castor Farming Techniques: తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారపు సాగు చేసే నూనే గింజల పంటల్లో ఆముదం ముఖ్యమైన పంట .ఆముదం మన రాష్ట్రంలో 80-85 వేల హెక్టార్లలో సాగు చేయబడుతు హెక్టారుకు 633 కిలోల దిగుబడి నమోదు అవుతున్నది.అన్ని జిల్లాలోనూ ప్రత్యేకించి యసంగిలో తక్కువ సాగు ఖర్చుతో ఈ పంటను ఆరుతడి పంటగా పండించడానికి చాల ఆవకాశం ఉంది.

Castor Plant

Castor Plant

విత్తే సమయం : యాసంగిలో అక్టోబర్ రెండవ పక్షం లోపు విత్తుకోవాలి.

నేలలు :ఈ పంటను ఎర్ర నేలలు , నల్ల రేగడి నేలలు , గరప నేలల్లో సాగు చేయవచ్చు.చవుడు నేలలు , నీరు నిలువ ఉండే నేలల్లో ఈ పంటను పండించరాదు.

విత్తన మోతాదు:2.0-2.5 కిలోల విత్తనాలు ఒక ఎకరానికి విత్తుకోవాలి.

విత్తే దూరం :90*60 లేక 120*45 సెం.మీ.,యాసంగి (నీటిపారుదల కింద) 120*90 సెం.మీ.ల దూరం లో విత్తుకోవాలి.

విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టన్ కలిపి విత్తన శుద్ధి చేయటం వలన మొలకకుళ్ళు తెగులును ఆరికట్టవచ్చు . ఎండు తెగులు ఉన్నా ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రా. కార్బన్డాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మవిరిడితో విత్తన శుద్ధి చేయాలి.

రకాలు :ప్రగతి , హరిత , అరుణ ,GAUCH-4, TMVCH.

Also Read: ఆముదం విత్తన నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుపు నివారణ: ఆముదాన్నీ 120*45 సెం.మీ దూరంలో విత్తినట్లయితే -మినీ ట్రాక్టర్కు అనుసందానం చేసిన రోటావెటర్ లేక సాదారణ ట్రాక్టర్ను అనుసందానం చేసిన గుంటక సహాయంతో అంతరకృషి చేసి కలుపు నివారించుకోవచ్చు.

నీటి యాజమాన్యం : బెట్ట పరిస్థితుల్లో నీటి వసతి ఉంటె 1-2 తడులను ఇస్తే 15-20 % దిగుబడి పెరుగుతుంది. యాసంగిలో ఆముదంను విత్తిన తర్వాత  నేలను తడపాలి. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు తక్కువ ఉష్నోగ్రతల వలన 12-15 రోజులకొకసారి తడి ఇవాలి.

యాసంగిలో ఆముదాన్ని పండిచడం వలన లభాలు :

బూజు తెగులు సమస్య ఉండదు

పంట బెట్టకు గురి కాదు

చిడపిడల సమస్య తక్కువ

ఒక ఎకరా వరి పండించే నీటి తొ 2.5-3.0 ఎకరాలు ఆముదం పండించవచ్చు.

Also Read: వర్షధార వ్యవసాయంలో నూనె గింజల సాగు – ప్రాముఖ్యత 

Leave Your Comments

Rythu Bandhu: ఆన్లైన్లో రైతు వారిగా పంటల సాగు విస్తీర్ణం

Previous article

Pulses Cultivation: అపరాల సాగు

Next article

You may also like