ఉద్యానశోభమన వ్యవసాయం

Cassia Angustifolia Cultivation: నేలతంగేడు సాగులో మెళుకువలు.!

1
Cassia Angustifolia
Cassia Angustifolia

Cassia Angustifolia Cultivation: నేల తంగేడు ఆకులు మరియు కాయలు వించనకారిగా ఉపయోగపడుతాయి. నెన్నోసైడ్ అనే రసాయన పదార్థములను కలిగి ఉండును.

నేలలు: ఎక్కువగా గరప నేలల్లో, రేగడి మరియు వరి సాగు చేసే బంక నేలల్లో కూడ సాగుచేస్తారు.

వాతావరణం: అతి వర్షపాతపు ప్రాంతాలు పనికి రావు. వెచ్చటి పొడిగా ఉండే వాతావరణం అనుకూలం. మిక్కిలి చలి వాతావరణం కూడ పనికి రాదు. దీనిని వర్మాధరము మరియు నీటి ఆధారము క్రింద సాగు చేయవచ్చు.

పంటకాలం: జులై-ఆగష్టు, అక్టోబరు మరియు ఫిబ్రవరి/మార్చి నెలల్లో విత్తుకోవచ్చు (150-180 రోజులు) నీటిపారుదల ఉంటే ఏ కాలంలోనైనా నాటుకోవచ్చు. వర్శపాతం ఎక్కువగా ఉంటే విత్తనం, మొక్కలు కుళ్ళిపోతాయి. కనుక వర్మపు ఉధ్రుతి తగ్గిన తరువాత (ఖరీఫ్లో ఆలస్యంగా) విత్తుకోవాలి.

విత్తనమోతాదు: ఎకరాకు 5-6 కిలోలు. ఎడంగా చేసి బైలకు ఒకవైపు 30 నెం. మీ. దుఉరంలో వెత్తాలి. విత్తేముందు 6-8 గంటలు నానబెట్టలి.

ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల చొప్పున నత్రజని, భస్వరం మైరియు పొటాష్ వేసుకోవాలి. నాటిన 90-95 రోజులకు మరియు 120-125 రోజులకు ఒకసారి 3 కిలోల చొప్పున నత్రజని ఎకరాకు వేయాలి (అనగా మొదటి మకెయు రెండవ దఫా ఆకులు కోసిన తరువాత).

అంతరక్రుషి: తొలిదషలో 6-7 రోజులకొకసారి తేలికపాటిగా నీరివ్వాలి. మదుల్లో కలుపు లేకుండా చూడాలి.

సస్యరక్షణ: నారు కుళ్ళు, నారు ఎండు తెగులు, ఆకుమచ్చ, ఆకుఎండు మొదలగు తెగుళ్ళు, చెదలు, గొంగళి పురుగులు మరియు కారుతొలుచు పురుగులాంటివి ఆశిస్తుంటాయి. వీటి నివారణకు:

· విత్తిన 70-80 రోజుల తద్వాత 50 గ్రా. కార్బరిల్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

· ఆకుమచ్చ, ఆకు ఎండు తెగులు నివారణకు లీటరు నీటికి 1 గ్రా, కార్బండైజిమ్ కలిపి

విత్తిన 70-80 రోజుల తర్వాత పిచికారి చేయాలి. కోత: విత్తిన 90 రోజులకు మొదటిసారి, తరువాత 40-45 రోజుల వ్యవదిలో కోత తీసుకోవాలి. కాయలు పట్టిన 15 రోజులకు (పసుపురంగు) కోయాలి. కోసిన ఆకులు మరియు కాయలు 7-10 రోజులు వీడలో ఆరనివ్వాలి.

Cassia Angustifolia Cultivation

Cassia Angustifolia Cultivation

Also Read: Citronella Cultivation: సిట్రోనెల్లా సాగు లో మెళుకువలు.!

దిగుబడి: నీటిపారుదల క్రింద ఎకరాకు సుమారు 8 క్వింటాళ్ళ ఎండు ఆకులు మరియు 3-4 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. సుమారు రూ. 5,000-6,000 నికరాదాయం లభిస్తుంది.

ఉపయోగాలు:

• నేల తంగేడు ఆకులను నీడలో ఎండించి చూర్ణము చేసుకొని 2 చెంచాలు వేడినీటిలో సిపిస్తే తేలికగా విరేచనమౌతుంది.

• నేల తంగేడు ఆకులను పాలలో గాని, టీ డికాశనులోగాని వేసుకొని సేవించిన సుఖవిరేచన మౌతుంది.

Also Read: Aloe vera Cultivation: కలబంద సాగులో మెళుకువలు.!

Leave Your Comments

Reproductive System Of Dairy Cattle: పాడి పశుపులలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది.!

Previous article

Tuberculosis Disease in Cattle: పశువులలో క్షయ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది.!

Next article

You may also like